E-Paper
Advertisement

IPL 2026 Schedule: ఐపీఎల్ కు తీవ్ర అంత‌రాయం..5 రాష్ట్రాల‌ అసెంబ్లీ ఎన్నిక‌లతో కొత్త చిక్కులు

IPL 2026 Schedule: ఐపీఎల్ కు తీవ్ర అంత‌రాయం..5 రాష్ట్రాల‌ అసెంబ్లీ ఎన్నిక‌లతో కొత్త చిక్కులు
Advertisement

IPL 2026 Schedule:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కు ( Indian Premier League 2026 Tournament ) కొత్త చిక్కులు వచ్చినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 టోర్నమెంటు మార్చి 26వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ముందుగా ప్రకటించిన ఈ తేదీలో ఐపీఎల్ ప్రారంభం కష్టమే అంటున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 5 రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నాయి. అవి కూడా పెద్ద రాష్ట్రాలు కావడం గమనార్హం. తమిళనాడు, పశ్చిమబెంగాల్, అస్సాం , కేర‌ళ‌, పుదుచ్చేరి లాంటి రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ అలాగే మేలో జరగబోతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ ను ఫిబ్రవరి మొదటి వారంలో ప్రకటించబోతున్నారట. ఆ లోపు ఈ 5  రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ( IPL 2026 Schedule) వస్తుంది. షెడ్యూల్ వచ్చిన తర్వాత ఐపీఎల్ వేదికలు, పూర్తిస్థాయి షెడ్యూల్ ప్రకటించేందుకు సిద్ధమవుతోందట భారత క్రికెట్ నియంత్రణ మండలి.

Also Read: Shoaib Malik Retirement: పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ‌..PSL 2026 ప్రారంభాని కంటే ముందే షోయబ్ మాలిక్ రిటైర్మెంట్‌

5 రాష్ట్రాల‌ అసెంబ్లీ ఎన్నిక‌లతో కొత్త చిక్కులు

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మార్చి 26వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల రూపంలో కొత్త చిక్కులు వచ్చాయి. ఈ సీజన్ సందర్భంగా ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, అస్సాం, కేంద్రపాలిత ప్రాంతమైన పుదిచ్చేరి రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఏప్రిల్, మే అలాగే జూన్ మాసాలలో ఎప్పుడైనా ఈ ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరిగే ఛాన్సులు ఉంటాయి. ఎక్కువ శాతం మే నెలలోపే ఈ ఎన్నికలు పూర్తయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో ఈ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ఫిబ్రవరి చివరి వారంలో రిలీజ్ కాబోతుందట. లేదా మార్చి మొదటి వారంలో ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలవుతుంది. అయితే ఆ షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత ఐపిఎల్ 2026 టోర్నమెంట్ కు సంబంధించిన షెడ్యూల్ పూర్తిస్థాయిలో విడుదల చేస్తారట. దాని ప్రకారం ఐపీఎల్ మార్చి 26వ తేదీన ప్రారంభమవుతుందా? లేక అంతకంటే ముందు ప్రారంభం కానుందా? అనే విషయంపై క్లారిటీ రానుంది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు కాబట్టి సెక్యూరిటీ ఇబ్బందులు వస్తాయి. అందుకే బిసిసిఐ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఐపిఎల్ 2026 టోర్నమెంట్ షెడ్యూల్ ప్రకటించేందుకు సిద్ధమైందట.

ఐపీఎల్ 2026 కోసం 18 వేదిక‌లు సిద్ధం

Advertisement

ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జ‌రుగ‌నున్న త‌రుణంలో ఐపీఎల్ 2026 కోసం 18 వేదిక‌లు సిద్ధం చేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఢిల్లీ, లక్నో, ధర్మశాల, న్యూ చండీగఢ్, చెన్నై, ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, అహ్మదాబాద్, తిరువనంతపురం, నవీ ముంబై, విశాఖపట్నం, గౌహతి, జైపూర్, బెంగళూరు, పూణే, రాంచీ, రాయ్‌పూర్ వేదిక‌ల‌లో మాత్ర‌మే ఐపీఎల్ 2026 టోర్న‌మెంట్ నిర్వ‌హించ‌బోతున్నార‌ట‌. ఈ మేర‌కు త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న రానున్న‌ట్లు స‌మాచారం.

Also Read: Rinku Singh AI Video Controversy: దేవుళ్ల‌పై ఆ పోస్టులు…రింకు సింగ్ అరెస్ట్ కు రంగం సిద్ధం..అస‌లు ఏంటి ఈ వివాదం ?

 

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×