E-Paper
Advertisement

Investment In AP: దావోస్‌లో ఏపీ ఆరంభం అదుర్స్.. RMZ గ్రూప్ భారీపెట్టుబడి, ఫలించిన లోకేష్ కృషి

Investment In AP: దావోస్‌లో ఏపీ ఆరంభం అదుర్స్.. RMZ గ్రూప్ భారీపెట్టుబడి, ఫలించిన లోకేష్ కృషి
Advertisement

Investment In AP: దావోస్‌ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్-2026లో ఆంధ్రప్రదేశ్ భారీ పెట్టుబడి సాధించింది. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, డిజిటల్, పారిశ్రామిక రంగాల అభివృద్ధి కోసం RMZ గ్రూప్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. దీనిద్వారా దాదాపు 84 వేల కోట్ల పెట్టుబడి రానుంది. ఆ కంపెనీ ప్రతినిధులను ఒప్పించడంలో మంత్రి లోకేష్ సక్సెస్ అయ్యారు.

దావోస్‌లో ఏపీ ఆరంభం అదుర్స్

Advertisement

దావోస్‌లో చంద్రబాబు టీమ్ పర్యటిస్తోంది. అగ్రశ్రేణి కంపెనీలపై ఫోకస్ చేసింది. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు RMZ గ్రూప్‌‌ని ఒప్పించారు మంత్రి లోకేష్. ఏపీ ప్రభుత్వం-ఆ కంపెనీ మధ్య ఒప్పందం జరిగింది. ఆ కంపెనీ పెట్టుబడితో ఏపీ ఆర్థిక ముఖ చిత్రం మారవచ్చని భావిస్తోంది. ఇంతకీ RMZ గ్రూప్‌ ఎంత పెట్టుబడి పెట్టనుంది? ఎక్కడెక్కడ, ఏయే రంగాలు అనేదానిపై కాస్త లోతుగా వెళ్దాం.

ఇంతకీ ఆర్ఎంజెడ్ కంపెనీ ఏంటి? భారత్‌లో ఐటీ మౌలిక సదుపాయాల రంగంలో RMZ గ్రూప్ తిరుగులేదు. బెంగళూరులో RMZ Ecoworld, హైదరాబాద్‌లో RMZ Skyview, చెన్నైలో RMZ One Paramount లాంటి ప్రాజెక్టుల ద్వారా సత్తా చాటింది. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలను ఆకట్టుకుంటూ నిర్మించిన భవనాల్లో 95 శాతం పైగా ఆక్యుపెన్సీ రేటును సాధించింది.

Advertisement

ఫలించిన లోకేష్ కృషి.. RMZ గ్రూప్ భారీపెట్టుబడి

గతంలో చేపట్టిన ఏ ప్రాజెక్టు మధ్యలో ఆగిపోలేదు. అత్యున్నత ప్రమాణాలతో పూర్తి చేయడం ఈ సంస్థ ప్రత్యేకత. ఆర్థికంగా బలంగా ఉన్న RMZ గ్రూప్.. ఆరేళ్ల కింద బ్రూక్‌ఫీల్డ్‌తో ఒప్పందం జరిగింది. ఆ తర్వాత పూర్తిగా రుణ రహిత సంస్థగా అవతరించింది. కెనడా పెన్షన్ ప్లాన్-CPPIB, జపాన్‌కు చెందిన మిట్సుయ్ ఫుడోసన్ వంటి గ్లోబల్ ఇన్వెస్టర్ల విశ్వసనీయతను మరింత పెంచింది.

ఆంధ్రప్రదేశ్‌లో రూ. 84 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఆ కంపెనీ చేపట్టబోయే మౌళిక సదుపాయాల వల్ల లక్షలాది మందికి ఉపాధి కలగనుంది. ఈ కంపెనీ ద్వారా ఏపీకి మూడు విభాగాల్లో పెట్టుబడులు రానున్నాయి. విశాఖపట్నం కాపులుప్పాడ ప్రాంతంలోని ఐటీ పార్క్‌లో సుమారు 50 ఎకరాల్లో 10 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంతో గ్లోబల్ కేపబులిటీ సెంటర్-GCC నిర్మించనుంది.

ALSO READ: ఆంధ్రా భోజనానికి జపాన్ దౌత్య సిబ్బంది ఫిదా

ప్రపంచ స్థాయి సంస్థలను విశాఖకు ఆకర్షించడమే కాకుండా గ్లోబల్ ఐటీ హబ్‌గా మార్చనుంది. విశాఖలో సుమారు 500 నుండి 700 ఎకరాల విస్తీర్ణంలో 1 గిగా వాట్ సామర్థ్యంతో డేటా సెంటర్ క్లస్టర్‌ను దశల వారీగా అభివృద్ధి చేయనుంది. ఇది ఏఐ వంటి అత్యాధునిక సాంకేతికతలకు వెన్నుముకగా నిలవనుంది.

రాయలసీమలోని టేకులొడు ప్రాంతంలో సుమారు 1,000 ఎకరాల్లో భారీ ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ పార్క్‌ను ఏర్పాటు చేయనుంది. తయారీ, లాజిస్టిక్స్ రంగాలకు కేంద్రంగా మారనుంది. రానున్న ఐదు నుండి ఆరు ఏళ్ల కాలంలో సుమారు 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నారు. ఐటీ, డేటా సెంటర్లు, పారిశ్రామిక రంగాల్లో దాదాపు లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది.

 

Related News

కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు.. చంద్రబాబు సర్కారుపై షర్మిల సంచలన ఆరోపణలు

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

Big Stories

Advertisement
×