E-Paper
Advertisement

Shoaib Malik Retirement:  పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ‌..PSL 2026 ప్రారంభాని కంటే ముందే షోయబ్ మాలిక్ రిటైర్మెంట్‌

Shoaib Malik Retirement:  పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ‌..PSL 2026 ప్రారంభాని కంటే ముందే షోయబ్ మాలిక్ రిటైర్మెంట్‌
Advertisement

Shoaib Malik Retirement:  పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఊహించని షాక్ తగిలింది. పాకిస్తాన్ స్టార్ ఆటగాడు షోయబ్ మాలిక్  ( Shoaib Malik ) సంచలన ప్రకటన చేశాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026) ప్రారంభానికి కంటే ముందు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు షోయబ్ మాలిక్. మూడు పెళ్లిళ్లు చేసుకోవడం, సానియా మీర్జాకు విడాకులు ఇవ్వడం లాంటి అంశాలతో బాగా పాపులర్ అయిన షోయబ్ మాలిక్.. అందరికీ షాక్ ఇస్తూ రిటైర్మెంట్ ఇచ్చాడు. పది సంవత్సరాల పాటు పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లో ఆడిన షోయబ్ మాలిక్ రిటైర్మెంట్ ( Shoaib Malik Retirement ) ఇవ్వడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అతని వ్యక్తిగత కారణాలవల్ల రిటైర్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Also Read: Rinku Singh AI Video Controversy: దేవుళ్ల‌పై ఆ పోస్టులు…రింకు సింగ్ అరెస్ట్ కు రంగం సిద్ధం..అస‌లు ఏంటి ఈ వివాదం ?

PSL 2026 ప్రారంభాని కంటే ముందే షోయబ్ మాలిక్ రిటైర్మెంట్‌

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026) మార్చి 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ టోర్నమెంట్ ప్రారంభం కంటే ముందు పాకిస్తాన్ స్టార్ ఆటగాడు సానియా మీర్జా మాజీ భర్త షోయబ్ మాలిక్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ కు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు వెల్లడించారు. దాదాపు పది సంవత్సరాలపాటు ఈ టోర్నమెంట్లో కొనసాగానని… ఇన్ని రోజులపాటు తనకు అండగా నిలిచిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మాలిక్.

తన వ్యక్తిగత కారణాలవల్ల రిటైర్మెంట్ ( Shoaib Malik Retirement ) ఇస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు ఈ 10 సంవత్సరాల పాటు పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ల కొంతమందితో దిగిన ఫోటోలను పంచుకున్నారు షోయబ్ మాలిక్. అయితే పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటు కు రిటైర్మెంట్ ఇచ్చినప్పటికీ గ్లోబల్ టి20 లీగ్స్ అంటే బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లాంటి వాటిలో ఆడతానని వెల్లడించారు.

పాకిస్తాన్ సూపర్ లీగ్ లో మాలిక్ గణాంకాలు

Advertisement

10 సంవత్సరాల పాటు పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ( Pakistan Super League 2026)  ఆడిన షోయబ్ మాలిక్ ( Shoaib Malik ) ఇప్పటి వరకు 92 కు పైగా మ్యాచుల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో మొత్తం 2350 పరుగులు సాధించాడు. అలాగే 15 అర్థ సెంచరీలు నమోదు చేసుకున్నాడు షోయబ్ మాలిక్ ( ( Shoaib Malik ). హైయెస్ట్ స్కోర్ 73 పరుగులు మాత్రమే. ఇప్పుడు వరకు సెంచరీ నమోదు చేయలేదు. బ్యాటింగ్ ఆవరేజ్ 33 మాత్రమే ఉంది. స్ట్రైక్ రేట్ 128 మాత్రమే. స్పిన్ బౌలింగ్ వెయ్యగల మాలిక్ ఇప్పటివరకు 17 వికెట్లు పడగొట్టాడు. ఈ టోర్నమెంట్ లో ఆడి బెస్ట్ ఫినిషర్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు షోయబ్ మాలిక్.

 

Also Read: BCCI Central Contract: ‘A+’ కేటగిరీ ఎత్తివేత‌..ప్లేయ‌ర్ల జీతాల్లో భారీ కోత..ఆ స్లాబ్ లోకి రోహిత్‌, కోహ్లీ !

 

 

Related News

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

Big Stories

Advertisement
×