E-Paper
Advertisement

Heart attack in Winter: చలికాలంలో హార్ట్‌ అటాక్‌ ప్రమాదం ఎందుకు పెరుగుతుంది?

Heart attack in Winter: చలికాలంలో హార్ట్‌ అటాక్‌ ప్రమాదం ఎందుకు పెరుగుతుంది?
Advertisement

దేశంలో చలి స్థాయిలు పెరిగిపోయాయి. చలికాలంలోనే ఎక్కువ మంది గుండెపోటు బారిన పడుతూ ఉంటారని నివేదికలు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పుడే హృదయ సంబంధ సమస్యలు పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా శీతాకాలంలో చలితో పాటు పొగమంచు, కాలుష్యం, శారీరక శ్రమ తగ్గడం వంటి కారణాలు హార్ట్‌ అటాక్‌ ప్రమాదాన్ని పెంచుతాయని హెల్త్‌ రిపోర్టులు చెబుతోంది. ముఖ్యంగా ఇప్పటికే హృదయ సమస్యలు ఉన్నవారు, పెద్దవారు, షుగర్‌ లేదా బీపీ ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

చలికాలం మొదలైన వెంటనే శరీరం వేడిని కాపాడుకోవడానికి రక్తనాళాలు స్వయంగా సంకోచిస్తాయి. ఇది రక్తప్రవాహాన్ని తగ్గిస్తూ హృదయంపై అదనపు ఒత్తిడిని పెంచుతుంది. రక్తపోటు పెరగడంతో హృదయం మరింత పనిచేయాల్సి వస్తుంది. ఇదే పరిస్థితి కొంతమందిలో హార్ట్‌ అటాక్‌కు దారితీసే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయినవారిలో ఈ పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారుతుంది. చలిలో రక్తప్రసరణ మారిపోవడం వల్ల అవి సులభంగా బ్లాక్‌ అయ్యే అవకాశం ఉంటుంది.

Advertisement

ఫిజికల్‌ యాక్టివిటీ తగ్గడం కూడా…
చలికాలంలో చాలా మంది ఉదయం నడక, వ్యాయామం వంటి శారీరక శ్రమను తగ్గిస్తారు. ఇంట్లోనే ఎక్కువ సమయం గడపడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ తగ్గుతుంది. అదేవిధంగా ఈ సీజన్‌లో వేడి, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకునే అలవాటు పెరుగుతుంది. ఇలా వ్యాయామం తగ్గి, ఫ్యాటీ ఆహారం పెరగడంతో కొలెస్ట్రాల్‌, షుగర్‌ లెవెల్స్‌ పెరిగి హార్ట్‌ సమస్యలు రావచ్చు.

పొగమంచు, కాలుష్యం
శీతాకాలంలో కాలుష్యం ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. వాతావరణంలో పొగమంచు, డస్ట్‌ పార్టికల్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఇవి శ్వాస సమస్యలను మాత్రమే కాదు గుండెను కూడా దెబ్బతీస్తాయి. కాలుష్యంలోని విషపదార్థాలు రక్తంలోకి చేరి రక్తనాళాల్లో వాపును పెంచుతుంది. ఇది చివరకు హార్ట్‌ అటాక్‌ ప్రమాదాన్ని పెంచే కారణంగా మారుతుంది. ఒక చిన్న జలుబు కూడా చలికాలంలో తీవ్రమై, శరీరానికి అదనపు ఒత్తిడి కలిగిస్తుంది. ఈ ఒత్తిడి కూడా హృదయంపై ప్రభావం చూపుతుంది.

Advertisement

వీరికే ప్రమాదం ఎక్కువ
ఇప్పటికే గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు, శ్వాస సమస్యలు ఉన్నవారు, హై బీపీ, షుగర్‌, అధిక కొలెస్ట్రాల్‌ ఉన్నవారు, ధూమపానం చేసే వ్యక్తులు, అధిక బరువున్నవారు, 50 ఏళ్లు పైబడిన వారు… వీరంతా చలికాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

నిపుణుల సూచనల మేరకు కొన్ని ఆహారాలు చలి ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. మొదటగా అల్లం, పసుపు, వాము వంటి మసాలాలు శరీరంలో వేడి పెంచి రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. వీటిని టీగా, కషాయంగా తాగితే చలి తగ్గుతుంది. గోధుమరొట్టె, సజ్జ, జొన్న వంటి ధాన్యాలు శరీరాన్ని దీర్ఘకాలం వేడి ఉంచే శక్తిని ఇస్తాయి. అదేవిధంగా బెల్లం, నువ్వులు, పల్లీలు, బాదం, జీడిపప్పు వంటి నట్‌లు శరీరం కోసం అవసరమైన ఆరోగ్యకర కొవ్వులను అందిస్తాయి. ఇవి శీతాకాలంలో ఎప్పటికప్పుడు శక్తిని ఇస్తాయి. పాలు, గుడ్లు, చికెన్‌ సూప్‌ వంటి ప్రోటీన్‌ ఆహారాలు కూడా చలిని తగ్గించడంలో సహాయపడతాయి.

పండ్లలో జామపండు, దానిమ్మ, అరటిపండు వంటి వాటిని తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరిగి చలికి గురయ్యే అవకాశాలు తగ్గుతాయి. తగినంతగా వేడి నీరు తాగడం కూడా చాలా ముఖ్యమైన అంశం.

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×