E-Paper
Advertisement

IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ కు బెన్ డక్కెట్ సడన్ గుడ్ బై..3 ఏళ్ల నిషేధం, కొత్త ప్లేయ‌ర్ ఎంట్రీ !

IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ కు బెన్ డక్కెట్ సడన్ గుడ్ బై..3 ఏళ్ల నిషేధం, కొత్త ప్లేయ‌ర్ ఎంట్రీ !
Advertisement

IPL 2026:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 28వ తేదీ నుంచి ఈ మెగా టోర్నమెంట్ షురూ అవుతుంది. ఇప్పటికే అన్ని జట్లు ఈ టోర్నమెంట్ కోసం సంసిద్ధమవుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు సంబంధించిన స్టార్ ఆటగాడు బెన్ డక్కెట్ ( Ben Duckett) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. హ్యారీ బ్రూక్ తరహాలో చివరి క్షణంలో ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ఆడబోనని ఢిల్లీ క్యాపిట‌ల్స్ ( delhi capitals) యాజమాన్యానికి సమాచారం అందించాడు బెన్ డక్కెట్. దీంతో బెన్ డక్కెట్ పై మూడు సంవత్సరాల పాటు భారత క్రికెట్ నియంత్రణ మండలి నిషేధం విధించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Also Read: TTP Warns PSL 2026: త‌ల‌లు తెగిపడ‌తాయి, వెంట‌నే పాకిస్తాన్ ను వ‌దిలి వెళ్లిపోండి..విదేశీ క్రికెట‌ర్ల‌కు ఉగ్ర‌వాదుల హెచ్చ‌రిక‌

ఢిల్లీ క్యాపిటల్స్ కు బెన్ డక్కెట్ సడన్ గుడ్ బై

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. రెండు కోట్లు పెట్టి వేలంలో కొనుగోలు చేసిన బెన్ డక్కెట్ మరో నాలుగు రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఊహించని షాక్ ఇచ్చాడు. వ్యక్తిగత కారణాలు అలాగే అంతర్జాతీయ క్రికెట్ పైన దృష్టి పెట్టేందుకు గాను ఐపీఎల్ 2026 టోర్నమెంట్ కు దూరం అవుతున్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్ కు సమాచారం అందించాడు బెన్ డక్కెట్. ఈ మేరకు ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం కూడా అధికారికంగా ధ్రువీకరించింది.

అయితే చివరి క్షణంలో అనేక సాకులు చెప్పి ఐపిఎల్ టోర్నమెంట్ నుంచి తప్పుకుంటే బీసీసీఐ కఠినమైన రూల్స్ అమలు చేస్తోంది. గతంలో ఇంగ్లాండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ కూడా ఇలాగే నాటకాలు ఆడి జంప్ అయ్యాడు. దీంతో అతనిపై మూడు సంవత్సరాల పాటు బ్యాన్ విధించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఇక ఇప్పుడు బెన్ డక్కెట్ పైన కూడా ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు బీసీసీఐ చర్యలు తీసుకోనుంది. బెన్ డక్కెట్ ఇకపై ఐపీఎల్ ఆడకుండా రెండు లేదా మూడు సంవత్సరాలు చర్యలు తీసుకోవాలని ఉంది. అంటే ఐపీఎల్ 2029 వరకు బెన్ డక్కెట్ పై నిషేధం ఉండనుంది.

బెన్ డక్కెట్ స్థానంలో మరో డేంజర్ ఆటగాడు

Advertisement

ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు బెన్ డక్కెట్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నుంచి దూరమయ్యాడు. ఈ నేపథ్యంలోనే వెంటనే అలర్ట్ అయిన ఢిల్లీ క్యాపిటల్స్ మరో ఆటగాన్ని తీసుకుంది. గతంలో ఢిల్లీకి ఆడిన జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ ( Jake Fraser-McGurk) ను ఐపీఎల్ 2026 టోర్నమెంట్ కోసం బెన్ స్థానంలో తీసుకుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేసింది.

Also Read:  MS Dhoni – Sivakarthikeyan: ఎవడెన్ని కారు కూత‌లు కూసినా 60 ఏళ్లు వ‌చ్చే దాకా ఆడ‌తా, రిటైర్మెంట్ పై ధోని సంచ‌ల‌నం

 

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×