IND VS PAK: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) చాలా రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే 18 మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఇలాంటి నేపథ్యంలో ఇండియా ఇప్పటికే రెండు మ్యాచ్ లు ఆడింది. ఇందులో రెండిటిలో విజయం సాధించి సూపర్ 8 దశలో ఉంది. మరో మ్యాచ్ విజయం సాధిస్తే నేరుగా వెళ్ళనుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో ఫిబ్రవరి 15వ తేదీ శివరాత్రి రోజున ( Siva ratri) ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( India Vs Pakistan) మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కొలంబోలోని ప్రేమ దాస స్టేడియం వేదికగా ( R.Premadasa Stadium, Colombo ) నిర్వహిస్తారు. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో వర్షం విలన్ గా మారే ప్రమాదం పొంచి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) నేపథ్యంలో శివరాత్రి రోజున ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. రాత్రి 7 గంటల సమయంలో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. గత కొన్ని రోజులుగా కొలంబోలో ( Colomo Rains) భారీ వర్షాలు ( Rain) పడుతున్నాయి. ఈ టోర్నమెంట్ ప్రారంభం కాకముందు కూడా పడ్డాయి.
గత నాలుగు రోజులుగా వర్షాలకు బ్రేక్ వచ్చినప్పటికీ… మళ్లీ ఆదివారం నుంచి పడే ఛాన్సులు ఉన్నట్లు చెబుతున్నారు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగే ఆదివారం రోజున కూడా 80 శాతం వర్షం పడే ప్రమాదం పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇదే జరిగితే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( India Vs Pakistan) మధ్య మ్యాచ్ జరగడం కష్టమే అంటున్నారు. లేదా సూపర్ ఓవర్ తరహాలో మ్యాచ్ ముగించాల్సి వస్తుందని అంటున్నారు. ఇలా అయితే భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. పూర్తిస్థాయి మ్యాచ్ జరిగితేనే బ్రాడ్ కాస్టర్లకు అటు ఐసీసీకి ( ICC) భారీ స్థాయిలో లాభాలు వస్తాయి. కానీ ఇప్పుడు వర్షం విలన్ గా మారితే మాత్రం భారీ నష్టం జరిగే ప్రమాదం పొంచి ఉంది. మరి వరుణ దేవుడు ( Rain) కరుణిస్తాడు? లేదా కాటేస్తాడో చూడాలి.
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య శివరాత్రి రోజున మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు రెచ్చిపోతున్నారు. ఈ మ్యాచ్లో కచ్చితంగా ఇండియన్ ఓడిస్తామని శపధం చేస్తున్నారు. అందరూ అద్భుతంగా ఆడి.. ఇండియాను చిత్తుగా ఓడిస్తామని హెచ్చరిస్తున్నారు. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సందర్భంగా పాకిస్తాన్ ను ఇండియా చిచ్చు చేసింది. దానికి ప్రతీకారంగా ఇప్పుడు పాకిస్థాన్ సిద్ధమవుతోంది.
🚨 RAIN COULD SPOIL THE FUN FOR CRICKET FANS 🚨
– There's a 75-80% chance of rain during the Pakistan vs. India Match on Sunday
-We might even see a washout of the Pakistan vs India game.#ICCMensT20WorldCup pic.twitter.com/bWqzgwTomX
— tanzeel (@TanZiMirani) February 12, 2026