E-Paper
Advertisement

అర్షదీప్ కాదు, ఇక‌పై Wids దీప్…ఒకే ఓవ‌ర్ లో 11 బంతులు వేశాడు

అర్షదీప్ కాదు, ఇక‌పై  Wids దీప్…ఒకే ఓవ‌ర్ లో 11 బంతులు వేశాడు
Advertisement

Arshdeep Singh Wide Ball: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరుగుతోంది. న్యూ చండీగఢ్ వేదికగా పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ( Punjab Kings vs Gujarat Titans) మధ్య నాలుగవ మ్యాచ్ కొనసాగుతోంది. అయితే ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ మొదట బ్యాటింగ్ చేయగా, పంజాబ్ బౌలర్ అర్షదీప్ సింగ్ ( Arshdeep Singh) చేసిన పని ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ మ్యాచ్ లో అర్షదీప్ సింగ్ చివరి ఓవర్ సంధించాడు. ఈ క్ర‌మంలో మొత్తం ఐదు వైడ్లు, ఒక నో- బాల్ వేసి చెత్త రికార్డు నెలకొల్పాడు. అంతేకాదు చివరి ఓవర్ లో ఆరు బంతులకు గాను 11 బాల్స్ వేసి ట్రోలింగ్ కు గురయ్యాడు. దీంతో అర్షదీప్ ను కాస్త వైట్ దీప్ అంటూ ర్యాగింగ్ చేస్తున్నారు నెటిజెన్స్‌. ఈ మేర‌కు పోస్టులు వైర‌ల్ చేస్తున్నారు.

Also Read: PSL Ball Tampering:  బాల్ టాంప‌రింగ్ పాకిస్తాన్ కు కొత్తేం కాదు..ఇంజమామ్ నుంచి జమాన్ వ‌ర‌కు అంద‌రూ దొంగ‌లే

అర్షదీప్ కాదు, ఇక‌పై వైడ్స్ దీప్…ఒకే ఓవ‌ర్ లో 11 బంతులు వేశాడు

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో (Indian Premier League 2026 Tournament) భాగంగా ఇవాళ పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో గుజరాత్ టైటాన్స్ మొదట బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 162 పరుగులు సాధించింది గుజరాత్ టైటాన్స్. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా పంజాబ్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు నమోదు చేశాడు. ఈ మ్యాచ్ లో మొత్తం నాలుగు ఓవర్లు సంధించాడు అర్షదీప్ సింగ్. ఈ క్రమంలో 42 పరుగులు ధారాళంగా సమర్పించుకున్న అర్షదీప్ సింగ్ ఒక్క వికెట్ కూడా తీయలేదు. ఇందులో ఎనిమిది వైడ్లు అలాగే ఒక నోబాల్ కూడా ఉంది.

టి20 క్రికెట్ లో తోపు బౌలర్ గా పేరు గాంచిన అర్షదీప్ సింగ్ ఇలాంటి చెత్త ప్రదర్శన కనబరచడంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి తోడు చివరి ఓవర్ లో మనోడు ఆరు బంతులకు మొత్తం 11 బంతులు వేసి మరో చెత్త రికార్డు నెలకొల్పాడు. చివరి ఓవర్ వేసిన అర్షదీప్ సింగ్ ( Arshadeep singh).. ఐదు వైడ్లు, ఓ నో బాల్ వేశాడు. అలాగే ఇందులో బౌండరీ కూడా ఉంది. మొత్తంగా 11 బంతులు వేసి 12 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో అర్షదీప్ సింగ్ ను కాస్త వైడ్ దీప్ సింగ్ అంటున్నారు. అలాగే అర్షదీప్ సింగ్ బౌలింగ్ చేస్తే క‌చ్చితంగా ఇద్దరు వికెట్ కీపర్లు ఉండాల్సిందేనని ట్రోల్ చేస్తున్నారు.

Advertisement

 

 

Also Read: Ball Tampering In PSL 2026 : PSL లో బాల్ టాంపరింగ్..జ‌మాన్‌, షాహీన్ షా, ర‌వూఫ్ పై బ్యాన్..? బ‌జారున ప‌డ్డ‌ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు 

 

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×