Ind vs Sa 3rd Odi: నేడు విశాఖ నగరంలో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య వన్డే మ్యాచ్ జరుగుతుంది. 3 వన్డేల సిరీస్ మ్యాచ్ లో ఇరు జట్లు ఇప్పటికే చెరో మ్యాచ్ గెలిచాయి. అయితే నేడు జరిగే మ్యాచ్ సిరీస్ డిసైడర్ కావడంతో అందరిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మొదటి వన్డేలో భారత జట్టు 17 పరుగుల తేడాతో విజయం సాధించినప్పటికీ.. రెండవ వన్డేలో మాత్రం దారుణంగా ఓడిపోయింది.
Also Read: Hardik Pandya: AMB సినిమాస్ కు వచ్చిన హార్దిక్ పాండ్యా.. అఖండ 2 కోసమేనా?
ఇందుకు వాతావరణంలో తేమ, భారత ఫీల్డర్లు విఫలం కావడం కూడా కారణం. మరోవైపు రెండో వన్డేలో పేసర్ల కొరత కొట్టొచ్చినట్లు కనిపించింది. హర్షదీప్ సింగ్ మినహా మిగతా బౌలర్లు అందరూ ఫెయిల్ అయ్యారు. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. టాస్ కూడా టీమిండియా మీద పగబట్టింది. గెలవాల్సిన మ్యాచ్ లో టాస్ ఓటమి కారణంగా ఓటమిని చవిచూసింది.
భారత జట్టు ఈ సిరీస్ లో విజయం సాధించాలంటే నేడు విశాఖపట్నం వేదికగా జరుగుతున్న వన్డేలో తప్పక గెలుపొందాల్సి ఉంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ సంచలన వీడియో వైరల్ గా మారింది. ఈ మూడవ వన్డేలో భారత జట్టు.. సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోవాలని చేసిన క్షుద్ర పూజల {black magic} కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఓ నల్ల కర్చీఫ్ ముఖానికి, తలకి ధరించిన వ్యక్తి.. మెడలో రెండు రుద్రాక్ష మాలలు ధరించి ఈ క్షుద్ర పూజలకు పాల్పడ్డాడు. ఓ టేబుల్ పై రెండు క్యాండిల్ లను ఉంచి.. వాటిలో ఒక క్యాండిల్ ముందు సౌత్ ఆఫ్రికా ఫ్లాగ్, మరో క్యాండిల్ ముందు భారత ఫ్లాగ్ ఉంచాడు. అయితే పూజల అనంతరం భారత ఫ్లాగ్ ముందు ఉన్న క్యాండిల్ ని ఆర్పేశాడు. ఆ తర్వాత మూడవ వన్డేలో సౌత్ఆఫ్రికా విజయం సాధిస్తుందని.. టీమిండియా ఓడిపోతుందని.. ఓ తాంత్రిక బాబా గా తాను చెబుతున్నానని అన్నాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: NZ vs WI: 148 ఏళ్ల చరిత్ర.. రెండో ఇన్నింగ్స్ 400లకు పైగా స్కోర్ చేసిన వెస్టిండీస్
వైరల్ గా మారిన ఈ వీడియోని చూసి క్రీడాభిమానులు నవ్వుకుంటున్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఓవైపు ప్రపంచం దూసుకుపోతుంటే.. ఇంకా ఈ మూఢ నమ్మకాలు ఏంటని, ఇలాంటివి ఎవ్వరూ నమ్మరని కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి చిల్లర వీడియోలు చేసి సోషల్ మీడియాలో ఫేమస్ కావాలని చూస్తున్నారని మండిపడుతున్నారు. ఇలాంటి పూజలతో మ్యాచ్ ఫలితాలు తారుమారు కావని.. ఇలాంటి వీడియోలను షేర్ చేయడం కూడా మానేయాలని కామెంట్స్ చేస్తున్నారు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">