E-Paper
Advertisement

NZ vs WI: 148 ఏళ్ల చ‌రిత్ర‌.. రెండో ఇన్నింగ్స్ 400ల‌కు పైగా స్కోర్ చేసిన వెస్టిండీస్‌

NZ vs WI: 148 ఏళ్ల చ‌రిత్ర‌.. రెండో ఇన్నింగ్స్ 400ల‌కు పైగా స్కోర్ చేసిన వెస్టిండీస్‌
Advertisement

NZ vs WI: క్రైస్ట్ చర్చ్ వేదికగా వెస్టిండీస్ – న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్ట్ డ్రా గా ముగిసింది. ఈ టెస్ట్ లో మొదట బ్యాటింగ్ చేసిన నూజిలాండ్ జట్టు 231 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. ఆ తర్వాత వెస్టిండీస్ జట్టు 167 పరుగులకు కుప్పకూలింది. ఇక రెండవ ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ జట్టు 466/8 వద్ద ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేసి.. వెస్టిండీస్ కి 530 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ క్రమంలో వెస్టిండీస్ జట్టు 457/6 తో ఆఖరి రోజును ముగించింది. దీంతో ఈ టెస్ట్ డ్రా గా ముగిసింది.

Also Read: Rohit – Kohli: రోహిత్ శర్మ భార్యతో కోహ్లీ రొమాంటిక్ ఫోటో..!

విండీస్ ఆల్రౌండర్ అద్భుత డబుల్ సెంచరీ:

Advertisement

మన బ్యాటర్లు సొంత గడ్డపై పట్టుమని పది ఓవర్లు కూడా నిలవలేక పోతున్నారు. అలాంటిది విదేశీ గడ్డపైకి వెళ్లి.. అక్కడ డబుల్ సెంచరీ చేయడమే కాకుండా.. ఓడిపోయే మ్యాచ్ ని కాపాడాడు వెస్టిండీస్ ఆల్రౌండర్ జస్టిన్ గ్రీవ్స్. దీంతో గ్రీవ్స్ ఆడిన ఆట తీరుకు క్రీడా ప్రపంచం ప్రశంసల వర్షం కురిపిస్తోంది. గ్రీవ్స్ చేసిన ఈ పోరాటం టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ పోరాటాలలో ఒకటిగా మిగిలిపోనుంది. ఏకంగా 565 నిమిషాల పాటు క్రీజ్ లో ఉన్న గ్రీవ్స్.. తన జట్టు మ్యాచ్ లో ఓడిపోకుండా కాపాడాడు. ఈ టెస్ట్ మ్యాచ్ రెండవ ఇన్నింగ్స్ లో 531 పరుగుల టార్గెట్ తో వెస్టిండీస్ బ్యాటింగ్ ప్రారంభించింది. ఓ దశలో 72 పరుగులకే 4 వికెట్లను కోల్పోయింది.

దీంతో మొదటి టెస్ట్ లో ఇక ఓటమి తప్పదు అనుకున్న సమయంలో.. షాయ్ హోప్, గ్రీవ్స్ కీలక భాగస్వామ్యాన్ని నెలకోల్పారు వీరిద్దరూ ఐదవ వికెట్ కి ఏకంగా 196 పరుగులు జోడించారు ఆ తరువాత హోప్ 140 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక వెస్టిండీస్ ఓడిపోవడం ఖాయమని మళ్లీ అనుకున్నారు. కానీ అదే సమయంలో గ్రీవ్స్ కి రోచ్ అండగా నిలిచాడు. ఇక వీరు ఇద్దరు కలిసి ఏడో వికెట్ కి అజేయంగా 180 పరుగులు జోడించారు. దీంతో చివరి రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి వెస్టిండీస్ 457 పరుగులు చేసింది. గ్రీవ్స్ మొత్తంగా 388 బంతులు ఎదుర్కొని.. 202 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ లో 19 ఫోర్లు ఉన్నాయి. అంతేకాకుండా టెస్ట్ లలో రెండో ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ చేసిన నాలుగవ వెస్టిండీస్ బ్యాటర్ గా గ్రీవ్స్ రికార్డ్ క్రియేట్ చేశాడు.

Advertisement

Also Read: Rohit Sharma: తెలుగు ఫ్యాన్స్ అరాచ‌కం… బాల‌య్య రేంజ్ లో కోపంతో ఊగిపోయిన రోహిత్ శ‌ర్మ !

 

రోచ్ చేసిన పోరాటాన్ని కూడా విస్మరించలేం:

37 ఏళ్ల వయసులో రోచ్ చేసిన పోరాటాన్ని కూడా ఎప్పటికీ మరిచిపోలేము. రెండవ ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసిన తర్వాత.. 233 బంతులను ఎదుర్కోవడం మామూలు విషయం కాదు. ఈ 233 బంతుల్లో రోచ్ 58 పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది ఫోర్లు ఉన్నాయి. అలా అంత భారీ లక్ష్యాన్ని చేదించే క్రమంలో వెస్టిండీస్ ఆటగాళ్లు ఒత్తిడికి లోను కాకుండా 163.3 ఓవర్లు ఎదుర్కోవడం మామూలు విషయం కాదు. గత మూడు దశాబ్దాలుగా ఉనికి కోసం పోరాడుతున్న వెస్టిండీస్ జట్టు.. ఈ టెస్ట్ లో చేసిన వీరోచిత పోరాటాన్ని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఈ ప్రదర్శనతో వెస్టిండీస్ ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురుస్తుంది.

 

 

View this post on Instagram

 

Related News

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

Big Stories

Advertisement
×