E-Paper
Advertisement

Flying car: విమానంలా గాల్లోకి ఎగిరిన కారు.. వామ్మో అంత ఎత్తు ఎగిరిందేంటీ?

Flying car: విమానంలా గాల్లోకి ఎగిరిన కారు.. వామ్మో అంత ఎత్తు ఎగిరిందేంటీ?
Advertisement

Romania Car Accident: తాజాగా రొమేనియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రమాదంలో ఓ కారు అమాంతం ఎగిరి పదుల మీటర్ల దూరంలో పడిపోయింది. బస్సు మీది నుంచి ఎగిరిపోయి సమీపంలోని చెట్టు మీద దూకింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సమీపంలోని సీసీటీవీలో రికార్డు అయ్యింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు ‘ఫ్లైయింగ్ కార్’ అని పిలుస్తున్నారు. ఇంతకీ ఈ ఘటన ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ ప్రమాదం ఎక్కడ జరిగిందంటే?

ఈ ఘటన రొమేనియా దేశంలోని  ఓరాడియాలో జరిగింది. వన్‌ ష్టిలోరి రోడ్డు రౌండ్‌ అబౌట్ దగ్గర ఒక పెట్రోల్ బంక్ సమీపంలో జరిగింది. డిసెంబర్ 3న రాత్రి 9.35 గంటలు ఈ యాక్సిడెంట్ అయ్యింది. 55 ఏళ్ల మహిళ  తన మెర్సిడెస్ కారును అధిక వేగంతో రౌండ్‌ బౌట్‌ లోకి తప్పుదారిలో తీసుకొచ్చింది. అతివేగంతో ఉన్న కారుకు ఎదరురుగా బస్సు రావడంతో సెంట్రల్ ఐలాండ్‌ ను తాకి, కారు గాల్లోకి ఎగిరింది. ఒక బస్సు, రెండు కార్ల మీదుగా ఎగిరిపోయింది. ఆ తర్వాత రోడ్డు పక్కన ఉన్న మెటల్ పోల్‌ ను తాకి కిందపడిపోయింది. ఒకవేళ పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ మీద పడి ఉంటే పెను ప్రమాదం జరిగేది.

తీవ్ర గాయాల పాలపైన మహిళ

Advertisement

ఈ కారు నడుపుతున్న మహిళ హైపోగ్లైసీమియాతో కారులోనే మూర్చపోయింది. ఈ ఘటనలో ఆమెకు మల్టిపుల్ ఫ్రాక్చర్లు అయ్యాయి. కాళ్లు, చేతి ఎముకలు విరిగాయి. కానీ, ఆమె ప్రాణాలకు ప్రమాదం లేదని డాక్టర్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతుంది. ఈ ప్రమాదం వల్ల రోడ్డు మీద ఉన్న మరే ఇతర వాహనదారులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.

మహిళా డ్రైవర్ లైసెన్స్ రద్దు

Advertisement

ఈ ఘటన తర్వాత సదరు కారు నడిపిన మహిళ లైసెన్స్ ను మూడు నెలల పాటు రద్దు చేశారు. £270( సుమారు రూ. 32 వేల) జరిమానా విధించారు.ఈ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

నెటిజన్లు ఏమంటున్నారంటే?

అటు ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ విజువల్స్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ‘ప్లైయింగ్ కారు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఈ ప్రమాదంలో డ్రైవర్ ప్రాణాలు కోల్పోకపోవడంతో పాటు ఇతర వాహనాదారులకు, ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంపై అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు.

Related News

హిట్ అండ్ రన్.. బడాబాబులకు చట్టం వేరేనా?

ఆక్వా రైతులకు మేత షాక్

కూలుతున్న మంచు కొండలు.. డేంజర్‌‌లో నేపాల్

కర్నూలులో కదులుతున్న డీఎస్సీ డొంక

వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ గరం

రివర్స్ అటాక్.. కొండా అవుట్..!

కౌంట్ డౌన్ షురూ.. హైకమాండ్ డెసిషన్ ఏంటి?

పెళ్లిళ్లు.. బంగారం.. ప్రధానీ మోదీ సంచలనం

Big Stories

Advertisement
×