E-Paper
Advertisement

Bigg Boss 9 Promo: టికెట్‌ టూ ఫినాలే టాస్క్‌లో ఇమ్ము ఫౌల్ గేమ్… రీతు‌కు క్లాస్ పీకిన నాగ్

Bigg Boss 9 Promo: టికెట్‌ టూ ఫినాలే టాస్క్‌లో ఇమ్ము ఫౌల్ గేమ్… రీతు‌కు క్లాస్ పీకిన నాగ్
Advertisement

Bigg Boss 9 Telugu Day 90 Promo: బిగ్‌ బాస్‌ ప్రియులంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న వీకెండ్‌ వచ్చేసింది. బిగ్‌ బాస్‌ షో తుదిదశకు చేరుకుంది. దీంతో షో మరింత ఆసక్తిగా మారింది. తమకు ఇష్టమైన కంటెస్టెంట్‌ టాప్‌ 5 ఉంటారా లేదా అని ఉత్కంఠ ఆడియన్స్‌లో రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ క్రమంలో వీకెండ్‌ ఎపిసోడ్‌ రావడం, ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్‌లో ఎవరూ బయటకు వస్తారనేది కూడా ఆసక్తిని సంతరించుకుంది. ఈ నేపత్యంలో తాజాగా శనివారం వీకెండ్‌ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రొమో విడుదలైంది.

డిమోన్ డ్రెస్ పై ఫన్

ఈ ప్రొమోలో వచ్చిరాగానే హోస్ట్‌ నాగార్జున డిమోన్‌ని ఆటపట్టించాడు. వీకెండ్‌ ఎపిసోడ్‌ కోసం శుక్రవారమే కంటెస్టెంట్స్‌ కి ఇంటికి స్పెషల్‌ కాస్ట్యూమ్స్‌ వస్తాయనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం డిమోన్‌ తనకు వచ్చిన డ్రెస్‌ని ట్రయల్ చేసి హౌజ్‌మేట్స్‌కి చూపించాడు. అతడి డ్రెస్‌ డిజైన్‌ మ్యూజియషన్‌లా ఉందంటూ ఇమ్మాన్యుయేల్‌ ఆటపట్టించాడు. డిమోన్‌ పవన్‌ చే షర్టులో నుంచి పావురాలు తీయుట.. ప్యాంట్‌లో నుంచి పాములు తీయుట ఇలాంటి ఎన్నో ఆశ్చర్యపరిచే, అబ్బురపరిచే కార్యక్రమాలు రేపు మీ అందరికి చూపించబడును అంటూ ఆడుకున్నాడు.

కళ్యాణ్ కి నాగ్ సెల్యూట్

Advertisement

ఇప్పుడు అదే నాగార్జున కూడా డిమోన్‌ని ఏడిపించాడు. వచ్చిరాగానే డిమోన్‌ పవన్‌ నిన్ను ఎవరు ఏమన్నా.. నీ డ్రెస్‌ మాత్రం చాలా బాగుంది. ఇంతకి ఏంటి పాములు తీస్తావా? పావురాలు తీస్తావా? అని ఆడుకున్నారు. ఆ తర్వాత టికెట్‌ టూ ఫినాలే ట్రోఫీ గెలిచిన కళ్యాణ్‌ని నాగ్‌ ప్రశంసించారు. నువ్వు దానికి అర్హుడివి అంటూ కళ్యాణ్ సెల్యూట్‌ కొట్టడం ప్రొమోలో హైలెట్‌గా నిలిచింది. ఆ తర్వాత రీతూ మళ్లీ సంచాలక్‌గా ఫెయిల్‌ అయ్యిందని నాగ్‌ ఫుల్‌ క్లాస్‌ పీకాడు. టికెట్‌ టూ ఫినాలే కోసం జరిగిన తాడు, బాల్‌ టాస్క్‌లో ఇమ్మాన్యుయేల్‌, సంజనలు పోటీ పడ్డారు. ఈ గేమ్‌కి రీతూ సంచాలక్‌గా వ్యవహరించింది. దీనికి జడ్జీమెంట్‌ ఏమైనా పంతంతో చేశావా? అని అసలు విషయానికి వచ్చారు. దీనికి ఫుల్‌ క్లారిటీతో చేశాని అంటుంది.

రీతూకి ఫుల్ క్లాస్

Advertisement

ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్‌ని పిలిచిన ఈ టాస్క్‌ నువ్వు కరెక్ట్‌గానే ఆడావా? అని ప్రశ్నించారు. ఆడాను అని చెప్పడంతో వీడియో చూపించి మరి అసలు విషయం బయటపెట్టాడు. ఆటలో గేమ్‌ రూల్స్‌ తప్పి తాడును చేతితో పట్టుకోకుండ బాడీతో క్యారీ చేశాడు. నిబంధలు తప్పి ఫౌల్‌ గేమ్‌ ఆడాడు. కానీ, ఇందులో ఇమ్మూనే టాస్క్‌ విన్నర్‌గా ప్రకటించింది రీతూ. దీంతో ఇమ్మూ ఫౌల్‌ గేమ్‌, రీతూ సంచాలక్‌గా రాంగ్‌ జడ్జీమెంట్‌ని ఈ ప్రొమో బట్టయబలు చేశాడు నాగార్జున. ఈ విషయంలో రీతూ ఫుల్‌ క్లాస్‌ పీకాడు. ఇక ఇమ్మాన్యుయేల్‌ మాత్రం తాను కాన్షియస్‌ లేను సర్‌.. ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకునేవాడినంటూ వివరణ ఇచ్చుకున్నాడు. చివరిగా.. మ్యాథ్స్‌ టాస్క్‌లో ఇమ్మాన్యుయేల్‌ ఆట తీరు ప్రశంసించారు. జిల్లా పరిషత్‌ అంటూ భలే ఆడావంటూ పొగడడంతో ప్రొమో ముగుస్తుంది.

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×