E-Paper
Advertisement

Puttaparthi: విశ్వప్రేమకు ప్రతిరూపం, ఆయన ప్రేమ మనతో, సత్యసాయి జయంతి ఉత్సవాల్లో ప్రధాని మోదీ

Puttaparthi: విశ్వప్రేమకు ప్రతిరూపం, ఆయన ప్రేమ మనతో, సత్యసాయి జయంతి ఉత్సవాల్లో ప్రధాని మోదీ
Advertisement

Puttaparthi: సత్యసాయి భౌతికంగా మన మధ్య లేకున్నా, ఆయన ప్రేమ మనతోనే ఉందన్నారు ప్రధాని నరేంద్రమోదీ. విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారని అన్నారు. సత్యసాయి జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు ప్రధాని నరేంద్రమోదీ. భారతీయ నాగరికతకు సేవ మూల కేంద్రమని, భక్తి, జ్ఞానం,  కర్మ, ఈ మూడు సేవతోనే ముడిపడి ఉంటాయన్నారు.

ఘనంగా సత్యసాయి శత జయంతి ఉత్సవాలు

Advertisement

సేవ పరమ ధర్మమని మన నాగరికత చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. బాబా బోధనలు లక్షల మందికి మార్గం చూపాయని, అందరినీ ప్రేమించు, అందర్నీ సేవించు ఇదే బాబా నినాదమన్నారు. సత్యసాయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా సత్యసాయి పేరిట నాణెం, స్టాంపు విడుదల చేశారు ప్రధాని నరేంద్రమోదీ.  తొలుత  స్పీచ్ ప్రారంభంలో ఎందరో మహానుభావులు.. అందరికీ వందనములు అని ప్రస్తావించారు.

బాబా బోధనల ప్రభావం దేశమంతా కనిపిస్తోందని, కోట్లాది మంది బాబా భక్తులు మానవ సేవ చేస్తున్నారని తెలిపారు. బాబా ప్రేమ సూత్రాలు ఎందరినో ఆలోచింప జేశాయని, చాలామంది జీవితాలను సమూలంగా మార్చారని వివరించారు. లక్షల మందిని సేవా మార్గంలో నడిపించారని అన్నారు. ప్రజల కోసం ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని, తాను నీరు, వైద్యం, విద్య వంటి రంగాల్లో విశిష్ట సేవలు అందించారని గుర్తు చేశారు.

Advertisement

ఉత్సవాలకు హాజరైన ప్రధాని నరేంద్రమోదీ

20 వేల మంది బాలికలకు ఇవాళ సురక్ష సమృద్ధి యోజన అందించార న్నారు. అంతకుముందు ఢిల్లీ నుంచి నేరుగా ప్రధాని నరేంద్రమోదీ పుట్టపర్తి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ప్రశాంతి నిలయం వద్దకు చేరుకున్నారు. సాయి కుల్వంత్ హాలులో సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. ఆ తర్వాత హిల్ వ్యూ ఆడిటోరియానికి వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. అక్కడే ప్రధాని మోదీని సన్మానించారు సీఎం చంద్రబాబు.

ALSO READ:  సత్యసాయి శత జయంతి ఉత్సవాలు, సచిన్-ఐశ్వర్య ఆసక్తికర కామెంట్స్

 

 

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×