Aakash Chopra On Tilak Varma and Ishan Kishan: న్యూజిలాండ్ జట్టుతో గురువారం జరిగిన తొలి వన్డే సందర్భంగా టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ ను గౌతమ్ గంభీర్ పూర్తిగా మార్చేశాడు. ఇషాన్ కిషన్ స్థానంలో తిలక్ వర్మను మూడవ స్థానంలో పంపాడు. అటు తిలక్ వర్మ వచ్చే ఐదవ స్థానంలో ఇషాన్ కిషన్ బరిలో దిగాడు. దీంతో ఇద్దరు అట్టర్ ప్లాప్ అయ్యారు. ఈ క్రమంలో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ మార్చిన శ్రేయస్ అయ్యర్ తో పాటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై ఆకాశ్ చోప్రా సీరియస్ అయ్యారు. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా ఉన్నన్ని రోజులు టీమిండియా సర్వనాశనం కావడం గ్యారెంటీ అని హెచ్చరించారు.
పదే పదే బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు చేయడం, బౌలర్లను తొలగించడం… కొత్త వాళ్లకు అవకాశాలు ఇస్తూ పాత వాళ్లను వెళ్ళగొట్టడం గౌతమ్ గంభీర్ కు అలవాటైపోయిందని ఆకాశ్ చోప్రా మండిపడ్డారు. టి20 వరల్డ్ నెంబర్వన్ ఆటగాడు ఇషాన్ కిషన్ బ్యాటింగ్ ఆర్డర్ మార్చి… గౌతమ్ గంభీర్ దిక్కుమాలిన నిర్ణయం తీసుకున్నాడని ఆగ్రహించారు. అనవసరంగా అతని స్థానంలో తిలక్ వర్మను పంపించి బలి చేశాడని ఫైర్ అయ్యారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా గంభీర్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇద్దరు అట్టర్ ప్లాప్ అయ్యారని ఆగ్రహించారు.
న్యూజిలాండ్ పై తొలి మ్యాచ్ లో టీమిండియా గెలిచింది కాబట్టి… ఈ తప్పిదం బయటపడడం లేదని… లేకుంటే గౌతమ్ గంభీర్ పైన క్రికెట్ ఫాన్స్ తిరుగుబాటు చేసే వాళ్ళని హెచ్చరించారు. అసలు ఇలాంటి ప్రయోగాలు చేసి, ఏం సాధిస్తున్నాడో అర్థం కావడం లేదంటూ సీరియస్ అవుతున్నారు. ఈ దిక్కుమాలిన ప్రయోగాలతో తిలక్, ఇషాన్ లను రోడ్డున పడేయం ఖాయమంటూ ఫైర్ అయ్యారు.
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టీ20 సందర్భంగా గౌతమ్ గంభీర్ దెబ్బకు తిలక్ వర్మతో పాటు ఇషాన్ కిషన్ అట్టర్ ఫ్లాప్ అయ్యారు. మూడవ వికెట్ కు బరిలోకి దిగిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ 11 బంతులు ఎదుర్కొని కేవలం 6 పరుగులు చేసి వికెట్ సంబంధించి ఉన్నాడు. అటు 5వ స్థానంలో వచ్చిన ఇషాన్ కిషన్ మూడు బంతులు ఎదుర్కొని ఒకే ఒక్క పరుపు సాధించాడు. దీంతో ఈ ఇద్దరూ దారుణంగా విఫలమయ్యారు. ఈ మ్యాచ్ లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 42 పరుగులు, సంజు 67 పరుగులు, నమన్ ధీర్ 42 పరుగులు చేయకపోయి ఉంటే న్యూజిలాండే గెలిచేంది.