Aaron Finch: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ టోర్నమెంట్ లో సగానికి పైగా మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఇంకా లేటెస్ట్ గా ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Delhi Capitals vs Royal Challengers Bengaluru) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ ( Arun Jaitley Stadium, Delhi) వేదికగా జరిగింది. ఇందులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో విక్టరీ అందుకుంది. అయితే మొదటి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 75 పరుగుల వద్ద ఆలౌట్ కావడంతో.. గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 49 పరుగులకు ఆలౌట్ అయిన సంఘటనను గుర్తు చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆరోన్ ఫించ్ ( Aaron Finch) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయినప్పటికీ… బెంగుళూరు పరువును గంగలో కలిపారని షాకింగ్ కామెంట్స్ చేశారు. 49 పరుగులు దాటి ఢిల్లీ క్యాపిటల్స్ నిజంగానే విక్టరీ అందుకుందని వ్యాఖ్యానించారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament ) భాగంగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ 16.3 ఓవర్లు ఆడి… 75 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అయితే ఈ లక్ష్యాన్ని ఆరు పాయింట్ మూడు ఓవర్లలో కేవలం ఒకే ఒక్క వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఇందులో విజయం సాధించినప్పటికీ కూడా పాయింట్లు పట్టికలో బెంగళూరు రెండవ స్థానానికి పరిమితమైంది.
ఈ మ్యాచ్ నేపథ్యంలో రవి శాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు పైన ( RCB) ఢిల్లీ ప్లేయర్లు చెత్తగా ఆడారని మండిపడ్డారు. పవర్ ప్లే లోపే 6 వికెట్లు కోల్పోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అయితే ఎలిమినేట్ కాక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. అయితే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆరోన్ ఫించ్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయినప్పటికీ… రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు తరహాలో 49 పరుగులకు ఆల్ అవుట్ కాలేదని సెటైరికల్ కామెంట్స్ చేశారు. 49 లోపు ఢిల్లీ ఆల్ అవుట్ అయి ఉంటే కచ్చితంగా ప్లేయర్లను నేను తిట్టేవాడిని.. కానీ ఆ చాన్స్ వాళ్లకు రాలేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికీ బెంగళూరు రికార్డు అలాగే ఉందని గుర్తు చేశారు.
🚨 AARON FINCH ROASTED RCB 🚨
Ravi Shastri said: Delhi are playing really poor cricket today. Losing six wickets in the powerplay there’s honestly nothing more to say.
Aaron Finch said: "No matter how poorly Delhi play, they won’t be able to break RCB’s 49-run record.This… pic.twitter.com/dCREOWC5f7
— Cricket Central (@CricketCentrl) April 27, 2026