E-Paper
Advertisement

ఇలా ఫిక్సింగ్ చేసే ఐపీఎల్ 2025 గెలిచారు..ఆర్సీబీపై ఆరోన్‌ ఫించ్‌ ఆరోప‌ణ‌లు

ఇలా ఫిక్సింగ్ చేసే ఐపీఎల్ 2025 గెలిచారు..ఆర్సీబీపై ఆరోన్‌ ఫించ్‌ ఆరోప‌ణ‌లు
Advertisement

Aaron Finch On Klaasen Catch:   ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) శనివారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ తొలి మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, హైదరాబాద్ ( Royal Challengers Bengaluru vs Sunrisers Hyderabad) జట్టు తలపడ్డాయి. అయితే ఇందులో అద్భుతంగా రాణించిన బెంగుళూరు జట్టు, అవలీలగా ఆరు వికెట్ల తేడాతో విక్టరీ అందుకుంది. దీంతో బెంగళూరులో సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్ లో హేన్రిచ్ క్లాసెన్ ( Heinrich Klaasen) వికెట్ పైన వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. హేన్రిచ్ క్లాసెన్ నాటౌట్ అంటూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు అభిమానులు.

Also Read: IPL telecast in Bangladesh: బిగ్ రిలీఫ్‌..బంగ్లాదేశ్ లో ఐపీఎల్ పై నిషేధం ఎత్తివేత‌..ముస్తాఫిజుర్ రీ-ఎంట్రీ !

ఆర్సీబీపై ఆరోన్‌ ఫించ్‌ ఆరోప‌ణ‌లు

Advertisement

అయితే దీనిపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ( Aaron Finch ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇలా ఫిక్సింగ్ చేసే గత సీజన్ లో బెంగుళూరు టైటిల్ గెలిచిందని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆరోన్ ఫించ్ అందరికీ షాక్ ఇచ్చాడు. హేన్రిచ్ క్లాసెన్ వికెట్ గురించి మాట్లాడబోయి, బెంగళూరు పరువు తీశాడు. థ‌ర్డ్ అంపైర్ ఆర్సీబీకి అమ్ముడుపోయిన‌ట్లుగానే, క్లాసెన్ వికెట్ పై నిర్ణ‌యం తీసుకున్నాడ‌ని ఆరోప‌ణ‌లు చేశారు. వాస్త‌వానికి హేన్రిచ్ క్లాసెన్ నాటౌట్ అంటూ తెలిపారు. థ‌ర్డ్ అంపైర్ ఒక‌టికి రెండు స్లారు చూసి, నిర్ణ‌యం తీసుకుంటే హేన్రిచ్ క్లాసెన్ విష‌యంలో త‌ప్పు జ‌రుగ‌క‌పోయేద‌న్నారు ఆరోన్ ఫించ్‌.

హేన్రిచ్ క్లాసెన్ క్యాచ్ వివాదం ఏంటి ?

ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్ బెంగళూరు వర్సెస్ హైదరాబాద్ మధ్య జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో హేన్రిచ్ క్లాసెన్ ( Heinrich Klaasen) అద్భుతంగా రాణించాడు. అయితే 31 పరుగులు సాధించిన నేపథ్యంలో రొమారియో షెఫర్డ్ బౌలింగ్ లో ఫిల్ సాల్ట్ కు బౌండరీ గేట్ దగ్గర క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అయితే క్యాచ్ అందుకునే క్రమంలో బౌండరీ గేటును ఫిల్ సాల్ట్ టచ్ అయినట్లు టీవీ రిప్లై లో కనిపించింది. కానీ థర్డ్ అంపైర్ మాత్రం ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోకుండానే ఔట్ అంటూ ప్రకటించాడు. దీంతో ఈ వివాదం రాజకుంది. అంటూ ఇదే అంశంపై సునీల్ గ‌వాస్కర్ లాంటి వాళ్లు కూడా స్పందిస్తున్నారు. థ‌ర్డ్ అంపైర్ ఈ విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నారని ఫైర్ అయ్యారు సునీల్ గవాస్కర్ ( Sunil Gavaskar). దీంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జ‌ట్టుకు ఈ నిర్ణ‌యం అనుకూలంగా మారింద‌న్నారు. లేక‌పోయింటే, క్లాసెన్ అర్ధ సెంచ‌రీ చేసేవాడ‌న్నారు. దీనిపై మరొకసారి రిప్లై లో చూసి నిర్ణయం తీసుకుంటే సరిపోయేది అన్నారు. అటు రవి శాస్త్రి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

Advertisement

 

Also Read: Mohammad Amir: ఐపీఎల్ అంటేనే ఫిక్స‌ర్స్ లీగ్..అంపైర్ల నుంచి చీర్ గ‌ర్ల్స్ అంద‌రూ అమ్ముడుపోయేవాళ్లే

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×