E-Paper
Advertisement

Mohammad Amir: ఐపీఎల్ అంటేనే ఫిక్స‌ర్స్ లీగ్..అంపైర్ల నుంచి చీర్ గ‌ర్ల్స్ అంద‌రూ అమ్ముడుపోయేవాళ్లే

Mohammad Amir: ఐపీఎల్ అంటేనే ఫిక్స‌ర్స్ లీగ్..అంపైర్ల నుంచి చీర్ గ‌ర్ల్స్ అంద‌రూ అమ్ముడుపోయేవాళ్లే
Advertisement

Mohammad Amir:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 ) ఇవాల్టి నుంచి ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఇవాళ సాయంత్రం 7:30 గంటలకు తొలి మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల ( Royal Challengers Bengaluru vs Sunrisers Hyderabad) మధ్య ప్రారంభం కానుంది. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేడు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ అమీర్ ( Mohammad Amir ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే ఫిక్సర్స్ లీగ్ (fixers) అంటూ హాట్ కామెంట్స్ చేశారు. అందులో ప్లేయర్లు ఒక్కలే కాదు, అంపైర్లు, చీర గర్ల్స్ కూడా అమ్ముడుపోతారని సంచలన ఆరోపణలు చేశారు మహమ్మద్ అమీర్. దీంతో మహమ్మద్ అమీర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. అయితే దీనిపై ఇండియన్ ఫాన్స్ కౌంటర్ ఇస్తున్నారు.

Also Read: Shahid Afridi On PSL: ఛీ..ఛీ పింక్ బంతులు వాడ‌టం ఏంట్రా…PSL కంటే గ‌ల్లీ క్రికెట్ న‌యం, కేబుల్ టీవీ ప్ర‌సారాల కంటే దారుణం

ఐపీఎల్ అంటేనే ఫిక్స‌ర్స్ లీగ్ – మహమ్మద్ అమీర్

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ఇవాల్టి నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు విషం కక్కడం మొదలుపెట్టారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ పై తాజాగా పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రపంచంలోనే అత్యంత అవినీతి టోర్నమెంట్ అంటే ఐపీఎల్ మాత్రమేనని తెలిపారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో వివాదాలతో పాటు మ్యాచ్ ఫిక్సింగ్లు మాత్రమే ఉంటాయని బాంబు పేల్చారు. ఐపీఎల్ టోర్నమెంట్ ద్వారా కోట్లల్లో డబ్బులు ప్లేయర్లు సంపాదిస్తున్నారని.. దీని వెనుక మ్యాచ్ ఫిక్సింగ్ కుట్ర ఉందని సంచలన ఆరోపణలు చేశారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో ( Indian Premier League 2026 ) ప్లేయర్ ఒక్కరే కాదు అంపైర్లు , చీర్ గర్ల్స్ కూడా డబ్బులకు అమ్ముడుపోతారని ఆరోపణలు చేశారు. ఈ మ్యాచ్ ఫిక్సింగ్ టోర్నమెంటును కేవలం ఫిక్సర్లు మాత్రమే చూస్తారని బాంబు పేల్చారు. ఐపీఎల్ టోర్నమెంట్లో ఫిక్సింగ్ ( IPL fixing) జరుగుతుందని ఇండియన్ ఫ్యాన్స్ కూడా బాగా తెలుసు అన్నారు. అందుకే గతంలో చెన్నై సూపర్ కింగ్స్ అలాగే రాజస్థాన్ రాయల్స్ జట్లను రెండు సంవత్సరాల పాటు పక్కకు పెట్టినట్లు గుర్తు చేశారు. అయితే మహమ్మద్ అమీర్ చేసిన వ్యాఖ్యలకు ఇండియన్ ఫ్యాన్స్ ( Indian Fans) కూడా కౌంటర్ చేస్తున్నారు. ఫిక్సింగ్ చేసే మహమ్మద్ అమీర్ ఈ ఫిక్సింగ్ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఇండియన్ ఫ్యాన్స్ పరువు తీస్తున్నారు. గ‌తంలో ఫిక్సింగ్ చేసిన దొంగ నువ్వే అంటూ అమీర్ ను ఆడుకుంటున్నారు.

Advertisement

Also Read: DK Shivakumar On IPL Tickets: ఐపీఎల్ లో కొత్త పంచాయ‌తీ, ప్ర‌తి ఎమ్మెల్యేకు 4 VIP టికెట్లు..? డీకే శివ కుమార్ వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు

 

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×