IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కు ( Indian Premier League 2026) బిగ్ రిలీఫ్ దక్కినట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు బంగ్లాదేశ్ లో ( Bangladesh) ఐపీఎల్ టోర్నమెంట్ పైన బ్యాన్ కొనసాగిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల బంగ్లాదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత, కీలక మార్పులు జరుగుతున్నాయి. ఈ తరుణంలోనే బంగ్లాదేశ్ లో ఐపీఎల్ పై నిషేధం కూడా ఎత్తివేశారు. ఈ మేరకు బంగ్లాదేశ్ మంత్రి స్వప్నన్ ( Bangladesh Minister Swapan) కీలక ప్రకటన చేశారు. ఇకపై బంగ్లాదేశ్ లో ఐపీఎల్ పై ఎలాంటి ఆంక్షలు ఉండవని.. ఎప్పటిలాగే ప్రసారాలు చేసుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇండియాతో ఎలాంటి గొడవలు తమకు లేవని.. ఐపీఎల్ పై బ్యాన్ ( Bangladesh lifts ban ) తొలగించినట్లు వివరించారు. దీంతో ఐపీఎల్ టోర్నమెంట్ కు బిగ్ రిలీఫ్ దక్కింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇవాళ సాయంత్రం 7:30 గంటలకు తొలి మ్యాచ్ కూడా జరగనుంది. తొలి మ్యాచ్ లో రాయల్ చాలెంజెస్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఫైట్ ఉండనుంది. అయితే, ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ఇవ్వాళ షురూ అవుతున్న నేపథ్యంలో బిగ్ రిలీఫ్ దక్కింది. ఐపీఎల్ ప్రసారాలపై బంగ్లాదేశ్ సర్కార్ నిషేధం ఎత్తివేసింది. ఈ మేరకు బంగ్లాదేశ్ మంత్రి స్వప్నన్ కీలక ప్రకటన చేశారు.
రాజకీయాలకు అలాగే క్రీడాలకు ఎలాంటి సంబంధం లేదని.. ఈ రెండిటిని వేరుగా చూడాలని బంగ్లాదేశ్ మంత్రి స్వప్నన్ ( Bangladesh Minister Swapan) వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ప్రసారాలపై ఆంక్షలు తొలగించినట్లు వివరించారు. ఇకపై ఐపీఎల్ ప్రసారాలను తాము అడ్డుకోబోమని అధికారిక ప్రకటన చేశారు. తమ బంగ్లాదేశ్ లో స్టార్ స్పోర్ట్స్ బరిలోకి దిగి ఐపీఎల్ ను ప్రసారం చేయాలనుకుంటే ఆహ్వానిస్తామని తెలిపారు. లేదా తమ దేశానికి సంబంధించిన లోకల్ ఛానల్ కు ప్రసార హక్కులు ఇస్తే కూడా తమకు ఓకేనని, ఇందులో ఎలాంటి గొడవ లేదని స్పష్టం చేశారు మంత్రి స్వప్నన్. దీంతో ఐపీఎల్ కు బిగ్ రిలీఫ్ దక్కింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ప్రసారాలపై బంగ్లాదేశ్ ఆంక్షలు ఎత్తివేసిన నేపథ్యంలో ముస్తాఫిజుర్ రెహ్మన్ కు బీసీసీఐ అనుమతులు ఇస్తుందా ? లేదా ? అనే టెన్షన్ నెలకొంది. హిందువులపై అప్పట్లో దాడులు జరిగిన నేపథ్యంలో కేకేఆర్ జట్టులో ఆడకుండా ముస్తాఫిజుర్ రెహ్మన్ పై బీసీసీఐ బ్యాన్ విధించింది. దానికి ప్రతీకారంగా ఐపీఎల్ పై బంగ్లాదేశ్ అప్పటి ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఐపీఎల్ ప్రసారాలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో ముస్తాఫిజుర్ రెహ్మాన్ ను కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లోకి తీసుకుంటారని చర్చ జరుగుతోంది.
🚨 Bangladesh lifts ban on IPL telecast in Bangladesh:
Minister Swapan said that, We don't want to mix politics with sport. We will not bar anyone from telecasting IPL. If Star Sports wants to telecast it, they can. If any of our channels want to telecast it, we will take it… pic.twitter.com/dNX89mvf3e
— Tejash (@Tejashyyyyy) March 28, 2026