Ananya Birla-Virat Kohli : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) సమరం మొదలైంది. శనివారం రోజున ప్రారంభమైన ఈ మెగా టోర్నమెంట్ నేపథ్యంలో తొలి మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు ( Royal Challengers Bengaluru vs Sunrisers Hyderabad) మధ్య జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన RCB, 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ గెలిచిన సంబరాలలో బెంగళూరు అభిమానులు ఉన్నారు. కానీ అనుష్క శర్మ ( anushka sharma) చాలా అసహనం వ్యక్తం చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీని అంతటికి కారణం బెంగుళూరు కొత్త ఓనర్ అనన్య బిర్లా ( Ananya Birla ). ఆమెకు మ్యాచ్ జరుగుతున్నప్పుడు విరాట్ కోహ్లీ ( Virat Kohli ) ఫ్లయింగ్ కిస్ ( Flying kiss exchange ) ఇచ్చినట్లు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీంతో అనుష్క శర్మ చాలా సీరియస్ గా ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ మొదటి మ్యాచ్ బెంగళూరు వర్సెస్ హైదరాబాద్ మధ్య జరిగింది. అయితే తొలి మ్యాచ్ సందర్భంగా కావ్య పాప వచ్చినట్లుగానే బెంగుళూరు ఓనర్ ఆర్యమాన్ , అనన్య బిర్లా ఇద్దరూ స్టేడియానికి వచ్చారు. అయితే అనుష్క శర్మ కూర్చున్న సీట్ల దగ్గరే అనన్య బిర్లా కూర్చోవడం జరిగింది. అయితే, ప్రతి మ్యాచ్ లోనూ బాగా ఆడితే తన భార్య అనుష్క శర్మకు ఫ్లయింగ్ కిస్ ఇస్తాడు విరాట్ కోహ్లీ. హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్ సందర్భంగా కూడా ఇదే సంఘటన చోటు చేసుకుంది. అర్థ సెంచరీ నమోదు చేసిన తర్వాత తన భార్య అనుష్క శర్మకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు విరాట్ కోహ్లీ. దీంతో వెంటనే అనుష్క శర్మ కూడా రిటర్న్ కిస్ కూడా ఇచ్చింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. అయితే మ్యాచ్ ను బౌండరీ కొట్టి ఫినిష్ చేశాడు విరాట్ కోహ్లీ. ఈ క్రమంలో అనుష్క పక్కనే కూర్చున్న అనన్య బిర్లా లేచి ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది.
విరాట్ కోహ్లీ అద్భుతంగా షాట్ ఆడిన నేపథ్యంలో ఈ కిస్ ఇవ్వడం జరిగింది. అయితే ఇది చూసిన అనుష్క శర్మకు మండిపోయింది. తన భర్తకు ఎందుకు కిస్ ఇచ్చిందని ఆమె సీరియస్ అయినట్లు తెలుస్తోంది. అయితే వీటికి సంబంధించిన ఫోటోలు వైరల్ అయిన నేపథ్యంలో.. కొంతమంది విరాట్ కోహ్లీ పైన విష ప్రచారం చేస్తున్నారు. అనుష్క శర్మకు విరాట్ కోహ్లీ ఫ్లయింగ్ కిస్ ఇస్తే.. తప్పుగా ప్రచారం చేస్తున్నారు. అనుష్క శర్మకు కాకుండా అనన్య బిర్లాకు విరాట్ కోహ్లీ ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడని నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. అనన్య వచ్చి, అనుష్క శర్మ కాపురంలో చిచ్చు పెట్టిందని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశం ఇప్పుడు వివాదంగా మారింది. వాస్తవానికి విరాట్ కోహ్లీ గాని అటు అనన్య బిర్లా మధ్య ఎలాంటి రిలేషన్ లేదు. కానీ కొంతమంది కోహ్లీపై విష ప్రచారం చేస్తూ అనుష్క శర్మకు కోపం తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో కోహ్లీకి అనన్య బిర్లా కిస్ ఇవ్వడం మాత్రం అనుష్క శర్మకు కోపం తెప్పించిందని తెలుస్తోంది.
Also Read: Mohammad Amir: ఐపీఎల్ అంటేనే ఫిక్సర్స్ లీగ్..అంపైర్ల నుంచి చీర్ గర్ల్స్ అందరూ అమ్ముడుపోయేవాళ్లే
Flying kiss 💋 exchange between Ananya Birla and Virat Kohli 🤯
What's going on? #IPL2026 pic.twitter.com/27b2ytUwrb
— CrickFlix 🧢 (@Cricketflixx) March 28, 2026