E-Paper
Advertisement

Abdul Razzaq: PSL అల్లా కంటే ప‌విత్ర‌మైన‌ది..ఐపీఎల్ అతిపెద్ద‌ ఫిక్సింగ్ హబ్

Abdul Razzaq: PSL అల్లా కంటే ప‌విత్ర‌మైన‌ది..ఐపీఎల్ అతిపెద్ద‌ ఫిక్సింగ్ హబ్
Advertisement

Abdul Razzaq:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇప్పటికే ఈ టోర్నమెంటులో ప్లే ఆఫ్స్ జట్లు కూడా ఖరారు అయ్యాయి. రేపటి నుంచి ప్లే ఆఫ్స్ పోరు షురూ కానుంది. ఇలాంటి క్రమంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ను కించపరిచేలా మాట్లాడారు పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ (Abdul Razzaq). అల్లా కంటే పవిత్రమైనది పాకిస్తాన్ సూపర్ లీగ్ (Pakistan Super League) అంటూ వ్యాఖ్యానించిన అబ్దుల్ రజాక్… ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ అతిపెద్ద ఫిక్సింగ్ హబ్ (fixing hub) అంటూ ఆరోపణలు చేశారు. ఐపీఎల్ ఆడే వాళ్లంతా దొంగలే అంటూ సీరియస్ అయ్యారు. దీంతో అబ్దుల్ రజాక్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: PAK VS AUS: షాదాబ్ ఖాన్ పెద్ద‌ జోక‌ర్..న‌ఖ్వీ అమ్ముడుపోయే కుక్క‌…PCB సెల‌క్ష‌న్‌పై పాక్ ప్లేయ‌ర్ తిరుగుబాటు

PSL అల్లా కంటే ప‌విత్ర‌మైన‌ది..ఐపీఎల్ అతిపెద్ద‌ ఫిక్సింగ్ హబ్

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) ప్రారంభమైన నుంచి పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఐపీఎల్ టోర్నమెంటును కించపరిచేలా వ్యవహరిస్తున్నారు. ఏదో ఒక అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి బాంబు పేల్చుతున్నారు. అయితే లేటెస్ట్ గా ఐపిఎల్ టోర్నమెంట్ పై అబ్దుల్ రజాక్ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ టోర్నమెంట్ లో ప్రతి మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుందని ఆరోపణలు చేశారు. అదొక ఫిక్సింగ్ హబ్ గా మారిపోయింది అన్నారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ చాలా క్వాలిటీ టోర్నమెంట్ అంటూ వ్యాఖ్యానించారు. ఇందులో ఇలాంటి ఫిక్సింగ్ జరగబోదని.. డబ్బులు తక్కువగా వచ్చినా కూడా… క్వాలిటీ క్రికెట్ ప్రేక్షకులకు అందిస్తున్నట్లు వివరించారు. అల్లా కంటే పవిత్రమైన లీగ్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు అబ్దుల్ రజాక్. ఇప్పటికైనా ఐపిఎల్ టోర్నమెంట్ ఆడే విదేశీ క్రికెటర్లందరూ పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడాలని కోరారు.

అబ్దుల్ రజాక్ వ్యాఖ్య‌ల‌కు కెవీన్ పీట‌ర్స‌న్

పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ను విమర్శలు చేస్తుంటే.. ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ మాత్రం మరో యాంగిల్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కఠినమైన టోర్నమెంటు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ టోర్నమెంట్ ఆధారంగా యంగ్ క్రికెటర్లు తెరపైకి వస్తున్నారని వివరించారు. ఒత్తిడి, క్వాలిటీ, ఇంటెన్సిటీ ఈ టోర్నమెంట్లో కచ్చితంగా ఉంటాయి.. వీటిని ఎదుర్కొని ప్లేయర్లు ఓ రేంజ్ కి వెళ్తున్నారని వ్యాఖ్యానించారు. టీమిండియా జట్టులో ఐపీఎల్ ద్వారానే చాలామంది స్థానం సంపాదించుకున్నారని కూడా గుర్తు చేశారు కెవిన్ పీటర్సన్. అంతర్జాతీయ స్టాండర్డ్స్ ఉన్న టోర్నమెంట్ అని కొనియాడారు.

Advertisement

Also Read: SRH VS RCB: క్లాసెన్, అభిషేక్ సెంచ‌రీలు..300-2 SRH స్కోర్ బోర్డు వైర‌ల్, ఇక RCBకి వ‌ణుకుపుట్టాల్సిందే ( Indian Premier League 2026 Tournament)

 

https://www.facebook.com/photo/?fbid=3338401612987226&set=a.2580868458740549

Related News

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

Big Stories

Advertisement
×