E-Paper
Advertisement

ఘోర రోడ్డు ప్రమాదం.. జాతీయ రహదారిపై 7 కార్లు, లారీలు ఢీ

ఘోర రోడ్డు ప్రమాదం.. జాతీయ రహదారిపై 7 కార్లు, లారీలు ఢీ
Advertisement

Nizamabad: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం చంద్రాయన్ పల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై ఊహించని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై వేగంగా వెళ్తున్న ఓ ట్రక్ టైర్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఆ వాహనం రోడ్డు మధ్యలోనే ఆగిపోయింది. ఆ సమయంలో వెనుక నుంచి అంతే వేగంతో వస్తున్న ఏడు కార్లు డ్రైవర్లు అప్రమత్తమయ్యే లోపే.. ఒకదానికొకటి వరుసగా బలంగా ఢీకొట్టుకున్నాయి.

అయితే ప్రమాదం అక్కడితో ఆగలేదు. ఆ కార్ల వెనుకే కొబ్బరి బొండాల లోడ్‌తో వస్తున్న మరో లారీ.. ఈ వాహనాలను తప్పించబోయి పక్క నుంచి బలంగా ఢీకొట్టింది. ఆపై నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది.

Advertisement

ఈ సిరీస్ యాక్సిడెంట్ ధాటికి పలు కార్లు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. వాహనాలు డ్యామేజ్ అయిన తీరు చూస్తే ఎవరి ప్రాణాలైనా దక్కాయా లేదా అనే అనుమానం రాక మానదు. కానీ అదృష్టవశాత్తూ, సీట్ బెల్టులు, ఎయిర్ బ్యాగుల వల్ల కావచ్చు.. వాహనదారులందరూ స్వల్ప గాయాలతోనే ప్రాణాలతో బయటపడ్డారు. దీంతో అక్కడ ఉన్నవారంతా పెద్ద ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు.

Also Read: మానవత్వం చాటుకున్న జగ్గారెడ్డి.. 8 ఏళ్ల లోపు పిల్లలకు సైకిళ్ల పంపిణీ!

Advertisement

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×