Abdullah Fazal On Babar Azam: ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ (England vs Pakistan) మధ్య టెస్ట్ సిరీస్ (Pakistan tour of England 2026) జరుగుతున్న క్రమంలో కెప్టెన్ బాబర్ ఆజంను (Babar Azam) ఉద్దేశించి మాజీ క్రికెటర్లు అలాగే క్రికెట్ అభిమానులు చాలా సీరియస్ అవుతున్నారు. బాబర్ ఆజం చేతకాని తనం వల్ల… ఇంగ్లాండ్ గడ్డపై దారుణంగా ఓడిపోయి సిరీస్ కోల్పోయామని ఆగ్రహిస్తున్నారు. అయితే ఇలాంటి క్రికెట్ తరుణంలో పాకిస్తాన్ టెస్ట్ కెప్టెన్ బాబర్ ఆజంను ఉద్దేశించి ఆ దేశ యంగ్ క్రికెటర్ అబ్దుల్లా ఫజల్ (Abdullah Fazal) హాట్ కామెంట్స్ చేశారు. బాబర్ ఆజం డబ్బా కొట్టుకోవడం తప్ప.. అతడు పీకిందేమీ లేదని పరువు తీశారు. విరాట్ కోహ్లీ కంటే గొప్ప ఆటగాడని.. బిల్డప్ ఇస్తాడు తప్ప… లోపల ఏం లేదని హేళన చేశారు. కోహ్లీ కాలి గోటికి కూడా బాబర్ పనికిరాడు అంటూ బాంబ్ పేల్చారు. దీంతో అబ్దుల్లా ఫజల్ (Abdullah Fazal) చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ ఆడుతున్న బాబర్ ఆజం చాలా గొప్ప ప్లేయర్ అని పాకిస్తాన్ మాజీలు పేర్కొంటూ ఉంటారు. విరాట్ కోహ్లీ కంటే గొప్పోడు అని పితాబు ఇస్తూ ఉంటారు. ప్రపంచంలోనే అసలు కింగ్ బాబర్ ఆజం మాత్రమే అంటూ తన్వీర్ అహ్మద్ ఇలాంటి వాళ్లు నిత్యం సోషల్ మీడియా వేదికగా పేర్కొంటారు. అయితే వాళ్లందరికీ పాకిస్తాన్ కుర్ర క్రికెటర్ అబ్దుల్లా ఫజల్ (Abdullah Fazal) కౌంటర్ ఇచ్చారు. ప్రపంచంలోనే అసలు సిసలైన కింగ్ విరాట్ కోహ్లీ ఒక్కడు మాత్రమేనని కుండబద్దలు కొట్టి చెప్పారు.
అతను తప్ప మరొకరికి ఆ చాన్స్ రాదన్నారు. అయితే బాబర్ ఆజం బాగానే ఆడతాడు… కానీ జట్టును గెలిపించడంలో విఫలమవుతాడని ఫైర్ అయ్యారు అబ్దుల్లా ఫజల్. పరుగులు చేసినంత మాత్రాన పాకిస్తాన్ జట్టు గెలవదని… కెప్టెన్గా జట్టును బాబర్ ఆజం ముందుండి నడిపించాలని కోరారు. అప్పుడే రియల్ కింగ్ అవుతారని చురకలు అంటించారు. ప్రస్తుతానికైతే తన దృష్టిలో విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడని ప్రశంసించారు. బాబర్ ఆజం మరో 10 ఏళ్ళు అయినా కూడా విరాట్ కోహ్లీ స్థాయిని అందుకోలేడని కుండ బద్దలు కొట్టి చెప్పారు.