E-Paper
Advertisement

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం
Advertisement

Chittoor District:  ఫ్యామిలీలో చిన్నపాటి సమస్య చిచ్చుపెడుతున్నాయి. కోపాన్ని నియంత్రించుకోలేని కొడుకు, ఏకంగా తండ్రి గొంతు కోసి చంపేశాడు. ఆ తండ్రి చేసిన తప్పేంటో తెలుసా? కొడుకుని చూసి నవ్వడమే అసలు కారణం. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

చిత్తూరు జిల్లాలో దారుణం

చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. మాణిక్యరాయునిపల్లెకు చెందిన 55 ఏళ్ల చెంగారెడ్డికి ఇద్దరు కొడుకులున్నారు. ఒకడు జోకేశ్‌రెడ్డి కాగా, మరొకడు హేమచంద్రారెడ్డి. పెద్ద కొడుకు జోకేశ్‌రెడ్డి సమీపంలోని కంకర కర్మాగారంలో జేసీబీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతని భార్య చూడామణి పెనుమూరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్నారు. పెనుమూరులో నివాసం ఉంటున్న జోకేశ్‌రెడ్డి తరచూ మద్యం తాగి భార్యను వేధించేవాడు. తాగి రావడంతో ఇంట్లో నిత్యం గొడవలు జరిగేవి. తల్లి-భార్య చెప్పినా మద్యం మానలేదు. ఫలితంగా ఇంట్లో గొడవలు జరిగేవి. భార్యకు భోజనం పెట్టకుండా వేధిస్తున్నాడని, ఆస్తిని అమ్మేస్తాడనే భయంతో కొడుకుని మందలిండేది తల్లి.

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు

Advertisement

దీంతో కోపం పెంచుకున్న కొడుకు జోకేష్. ఈ క్రమంగా మంగళవారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు జోకేష్. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా భార్య.. తన మామ చెంగారెడ్డికి ఫోన్‌ చేసింది. మీ కొడుకు మందు తాగి వచ్చి వేధిస్తున్నాడని చెప్పింది. వచ్చి బుద్ధి చెప్పి తీసుకెళ్లాలని వివరించింది. భార్య నుంచి ఫోన్‌ తీసుకుని జోకేష్‌రెడ్డి.. తండ్రిపై సీరియస్ అయ్యాడు. నువ్వు ఇక్కడకు రావడం కాదు, నేను అక్కడకు వస్తున్నానని చెప్పి టూ వీలర్‌పై పై మాణిక్యరాయునిపల్లెకి వెళ్లాడు. నేరుగా తండ్రి ఇంటికి చేరుకున్నాడు. కొడుకు చేస్తున్న పని చూసి తండ్రి నవ్వాడు. మద్యం మత్తులో ఆగ్రహానికి గురైన జోకేశ్‌రెడ్డి, సమీపంలోని కత్తి తీసుకుని తండ్రి గొంతు కోసి పారిపోయాడు.

ALSO READ: ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

Advertisement

అక్కడికక్కడే తండ్రి చెంగారెడ్డి మరణించాడు. నేరుగా పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయిన నిందితుడు. ఇరుగుపొరుగువారు ఈ ఘటన గురించి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు, హత్యకు దారితీసిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. కేవలం మద్యం, కోపం కలిసి ఆ కుటుంబం నాశనం అయ్యింది.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×