Illu Illalu Pillalu Today Episode September 4th: నర్మదా బాగ్యం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి అక్కడ ఏం జరిగిందో అన్న విషయాన్ని వివరిస్తూ ఉంటుంది. ఏం జరిగింది అని నర్మదా వాళ్ళని అడుగుతుంది. అయితే ఇదంతా వల్లి భాగ్యం ప్లాన్ అని తెలుసుకున్న నర్మదా అక్కడ ఏం జరిగింది అని అడుగుతుంది. కానీ శ్రీవల్లి మాత్రం మా మీద అనుమాన పడుతున్నావా ఏ నీకేం పని పాట లేదా అని అంటుంది. నర్మదా ఆ మాట అనగానే భాగ్యం వాళ్ళందరూ షాక్ అవుతారు కానీ ఇదంతా చేయడానికి కారణం మీరే మీరు వేసిన చిక్కుముడిని నేనే విప్పాలి కదా అని నర్మదా అంటుంది.. శ్రీవల్లి, నర్మదా ఇద్దరు కూడా ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఉంటారు. మొత్తానికి నర్మదా అనుమానం నిజమైపోతుంది..
ఇవన్నీ చేసింది నువ్వే అని నాకు బాగా క్లారిటీగా అర్థమైంది. నీ అంతు నేను చూస్తాను అని నర్మదా అనగానే అయ్యో నా గురించి మొత్తం నీకు తెలిసిపోయిందా..? అయితే నువ్వు ఎవరికీ చెప్పద్దు నీ కాళ్లు పట్టుకుంటాను నాకు కాపురం పాడైపోతుంది అంటూ శ్రీవల్లి నాటకం మొదలు పెడుతుంది.. అని నీ కాళ్లు పట్టుకొని బతిమిలాడతానని నువ్వు అనుకుంటున్నావు కదా.. నువ్వు అనుకున్నట్లు నీ పప్పులు ఏమి ఇక్కడ ఉడకవు అంటూ నర్మదాకు శ్రీవల్లి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. నా గురించి నీకు నిజం తెలిసిపోయినా నేనే చేశాను అని నీ దగ్గర రుజువులు లేవు కాబట్టి నువ్వు కచ్చితంగా నా గురించి బయట పెట్టలేవు అని నర్మదాతో శ్రీవల్లి చెప్తుంది. నిప్పు నిజం లాంటిది ఏ రోజైనా బయలు పడుతుంటే అని నర్మదా చెప్తుంది.. అది బయటపడినప్పుడు చూద్దాం అని చెప్పగానే నర్మదా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
నా తమ్ముడికి వచ్చిన పెళ్లి సంబంధాన్ని చెడగొడతారా..? నా బంధువులని చెప్పి మరి వెళ్లి ఆ పెళ్లి సంబంధం చెడగొట్టారు అంటే అది కచ్చితంగా ఆ కూలోడి పని అయి ఉంటుంది అని భద్ర అంటుంది. సేన కూడా ఇదంతా వాడి పని అయి ఉంటుంది వాడే ఇదంతా చేసి ఉంటాడు. వాడే వాడి కుటుంబ సభ్యుల్ని పంపించి మన తిరుపతి పెళ్లి చెడగొట్టాలని చూసాడు.. వాళ్లు చేయలేని పని మనం చేస్తున్నాం కదా.. అందుకే ఇప్పుడు వాడు మనల్ని టార్గెట్ చేసి ఆ పెళ్లి సంబంధాలు చెడగొట్టాడు అని భద్ర చాలా సీరియస్ గా ఉంటుంది.. ధీరజ్ గారితో పాటు ఒక అమ్మాయి కూడా వెళ్ళిందంట ఆ అమ్మాయి ఎవరో తెలియాలి చెప్తాను అని భద్ర అనగానే ప్రేమ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. భద్ర ప్రేమను పిలిచి అడిగితే ఎక్కడ దొరికిపోతుంది అని టెన్షన్ పడుతుంది కానీ విశ్వం మాత్రం నర్మదక్క అని అనగానే దాన్ని పట్టుకుని అక్క అంటావేంట్రా అని చెంప పగలగొడుతుంది.
నర్మదా అలాగే ధీరజ్ వేదవతి అందరూ గదిలోకి వెళ్లి తలుపు వేసుకోవడం చూసిన శ్రీవల్లి వీళ్లిద్దరూ ఏదో నా గురించి మాట్లాడేలా కనిపిస్తున్నారు అని అనుకుంటుంది శ్రీ వల్లి.. కిటికీలోంచి తొంగి చూస్తూ శ్రీవల్లి ఏమైందో అని తెలుసుకునే ప్రయత్నం చేయాలి అని అనుకుంటుంది. నర్మదా శ్రీవల్లిని ఇదంతా చేసిందని ఎంత చెప్తున్నా సరే అసలు వినకుండా వేదవతి అది చేసింది అంటే నేను నమ్మని అని అంటుంది. అయితే నర్మదా శ్రీవల్లిని ఇదంతా చేసింది అని ఎంత చెప్తున్నా సరే అటు ధీరజ్ కూడా నమ్మకపోవడంతో ఆ వల్లి మిమ్మల్ని అంతగా నమ్మించింది. కానీ అదే చేసింది నేను సాక్షాలతో నిరూపిస్తాను. అప్పుడు ఆ బల్లి అంతూ చూస్తానని నర్మదా అంటుంది.. శ్రీవల్లి మాత్రం నా సంగతి నువ్వు బయట పెట్టడం నీ తరం కాదు అని ధీమాగా ఉంటుంది.
వేదవతి తన తమ్ముడి కోసం బాధపడిపోతూ ఉంటుంది. అయితే తిరుపతి తన సంబంధం చెడిపోవడానికి కారణమైన ధీరజ్ ప్రేమలను చాలా పొగిడేస్తూ ఉంటాడు. మా సంబంధం చెడగొట్టిన మీరిద్దరూ కలిసిపోతే బాగుంటుంది అని తిరుపతి చెప్పగానే.. ధీరజ్ ప్రేమ ఇద్దరూ కూడా దీంతో కలవడం ఏంటి అంటూ మరోసారి గొడవ పడతారు. ఇక వేదవతి నర్మదా అక్కడికి వచ్చి తమ్ముడు కోసం వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. నన్ను దొంగ అని అన్నారు నాకు చాలా బాధగా ఉంది అని వేదవతి తో తిరుపతి అని బాధపడతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..