E-Paper
Advertisement

Ind vs Eng 2nd Semi-Final: మ‌రోసారి ఫ్లాప్, ఇంగ్లాండ్ ప్లేయ‌ర్ ను బూతులు తిట్టిన అభిషేక్, సంజు అర్ధ సెంచ‌రీ.. సంజు సెంచ‌రీ మిస్‌

Ind vs Eng 2nd Semi-Final: మ‌రోసారి ఫ్లాప్, ఇంగ్లాండ్ ప్లేయ‌ర్ ను బూతులు తిట్టిన అభిషేక్,   సంజు అర్ధ సెంచ‌రీ.. సంజు సెంచ‌రీ మిస్‌
Advertisement

Ind vs Eng 2nd Semi-Final:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇవాళ రెండో సెమీఫైనల్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న సంగతి తెలిసిందే. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. అయితే ఇందులో టాస్ ఓడిపోయి ముందుగా టీమిండియా బ్యాటింగ్ చేస్తోంది. ప్రస్తుతం ఒక వికెట్ కోల్పోయినప్పటికీ టీమిండియా మాత్రం భారీ స్కోర్ దిశగా దూసుకు వెళ్తోంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా మరోసారి అభిషేక్ శర్మ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో కేవలం 9 పరుగులు చేసిన అభిషేక్ శర్మ ( bhishek Sharma), విల్ జాక్స్ ( Will Jacks ) బౌలింగ్ లో టెంప్ట్ అయి ఔట్ అయ్యాడు. అయితే అభిషేక్ శర్మ వికెట్ తీసిన అనంతరం విల్ జాక్స్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇది అభిషేక్ శర్మకు మండింది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ ఆటగాడు విల్ జాక్స్ ను బండ బూతులు తిట్టాడు అభిషేక్ శర్మ. ఈ సంఘటన వైరల్ గా మారింది. ఇది చూసిన ఇండియన్ ఫాన్స్ అభిషేక్ శర్మనే టార్గెట్ చేసి పోస్టులు పెడుతున్నారు. నీకు బ్యాటింగ్ చేయడం చేతకాదు.. కానీ వికెట్ తీసిన విల్ జాక్స్ ను తిడతావా ? అంటూ ఫైర్ అవుతున్నారు. ఇక అటు ఈ మ్యాచ్ లో సంజు శాంస‌న్ అర్ధ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు.

Also Read: Pak Players: ఆయ‌న‌వి ఒంటెద్దు పోక‌డులు, కీలు బొమ్మ‌లాగా ఆడుకున్నాడు..కోచ్ పై ఫిర్యాదు చేసిన‌ పాకిస్తాన్ ప్లేయ‌ర్లు

మరోసారి విఫలమైన అభిషేక్ శర్మ

Advertisement

టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో మరోసారి అభిషేక్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. సెమీఫైనల్ లో అయిన అద్భుతంగా రాణిస్తాడు అనుకుంటే… ఇంగ్లాండ్ మ్యాచ్ లో కూడా దారుణంగా విఫలమయ్యాడు. ఈ మ్యాచ్ లో 7 బంతుల్లో 9 పరుగులు మాత్రమే చేశాడు. టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ గ్రూప్ స్టేజ్ లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లపైన డకౌట్ అయ్యాడు అభిషేక్ శర్మ. ఆ తర్వాత దక్షిణాఫ్రికాపై 15 పరుగులు చేసిన అభిషేక్ శర్మ జింబాబ్వే యాబై ఐదు పరుగులు సాధించాడు. ఇక మొన్న వెస్టిండీస్ పైన 11 పరుగులు సాధించిన అభిషేక్ శర్మ… ఈ సెమీఫైనల్ లో మాత్రం తొమ్మిది పరుగులే చేశాడు. దీంతో అతన్ని జట్టు నుంచి తొలగించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అతని స్థానంలో రింకూ సింగ్ కు ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు.

సంజు శాంసన్ సెంచ‌రీ మిస్‌

టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ లో సంజు శాంసన్ బ్యాటింగ్ ఆధారపడుతున్నాడు. మొన్న వెస్టిండీస్ పై 97 పరుగులు సాధించిన సంజు శాంసన్, ఇవాల్టి మ్యాచ్ లో 89 పరుగులతో రెచ్చిపోయాడు. కేవలం 42 బంతుల్లోనే ఈ పరుగులు సాధించాడు సంజు. ఇందులో ఏడు సిక్సర్లు అలాగే 8 బౌండరీలు ఉన్నాయి. అయితే దురదృష్టవశాత్తు సెంచరీ చేసుకోకుండానే సంజు, మరోసారి విల్ జాక్స్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.

Advertisement

Also Read: SA vs NZ 1st Semi-Final: టీమిండియా కోసం జై షా కుట్ర‌లు…ద‌క్షిణాఫ్రికాను కావాల‌నే ఇంటికి పంపార‌ని ట్రోల్స్ !

 

 

Related News

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

రీ-ఎంట్రీపై ప‌గ‌టి క‌ల‌లు వ‌ద్దు..ఇక‌ రిటైర్మెంట్ ఇచ్చేసి, స‌న్యాసం తీసుకో !

SRH ఇక నీదే అల్లుడు…క‌ట్నంగా కింద క‌ట్ట‌బెట్టిన కావ్య పాప ఫ్యామిలీ ?

ఉగ్రవాదుల టెన్షన్..21 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌లో అడుగుపెట్టిన ఇంగ్లాండ్

చిన్నస్వామిలో వర్షం పడాలని పోర్లు దండాలు పెట్టండి, లేకపోతే విండీస్ ఘోర ఓటమే!

విరాట్ కోహ్లీ నాలాగే ఉంటాడు కానీ, పెద్ద అంద‌గాడు కాదు !

వాళ్లంద‌రితో జై హిందూ అనిపించండి, ష‌మీ కామెంట్స్ వైర‌ల్ !

Big Stories

Advertisement
×