E-Paper
Advertisement

SA vs NZ 1st Semi-Final: టీమిండియా కోసం జై షా కుట్ర‌లు…ద‌క్షిణాఫ్రికాను కావాల‌నే ఇంటికి పంపార‌ని ట్రోల్స్ !

SA vs NZ 1st Semi-Final: టీమిండియా కోసం జై షా కుట్ర‌లు…ద‌క్షిణాఫ్రికాను కావాల‌నే ఇంటికి పంపార‌ని ట్రోల్స్ !
Advertisement

SA vs NZ 1st Semi-Final: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో తొలి సెమీ ఫైన‌ల్ ముగిసింది. దక్షిణాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ ( South Africa vs New Zealand ) మధ్య ఈ తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరగగా… కివిస్ ఫైనల్ కు చేరుకుంది. దక్షిణాఫ్రికా పై ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో అఖండ విజయాన్ని నమోదు చేసుకున్న న్యూజిలాండ్, టి20 వరల్డ్ కప్ ఫైనల్ కు చేరుకుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఐసీసీ బాస్ జై షా ( ICC jai shah ) పైన సంచలన ఆరోపణలు వస్తున్నాయి. అతని వల్ల దక్షిణాఫ్రికా ఓడిపోయిందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దక్షిణాఫ్రికా ను ఇంటికి పంపిస్తే టీమిండియా సులభంగా ఫైనల్ లో టైటిల్ గెల్చుకుంటుందని దారుణంగా ట్రోల్స్ కూడా చేస్తున్నారు. ఐడెన్ మార్క్‌రమ్ ( Aiden Markram ) క్యాచ్ ను ఆధారంగా చూపిస్తూ ఐసీసీ బాస్ జై షా ఫిక్సింగ్ కు తెరలేపినట్లు ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టులు వైరల్ అవుతున్నాయి.

Also Read : BCCI vs PCB Salary Clash: పాకిస్తాన్ క్రికెట‌ర్ల జీతాలు ఎంతో తెలుసా ? టీమిండియా ప్లేయ‌ర్ల కాలిగోటికి కూడా స‌రిపోవా

దక్షిణాఫ్రికా ఓడిపోయేలా జై షా కుట్రలంటూ పోస్టులు

Advertisement

టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా దక్షిణాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య బుధవారం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి సెమీఫైనల్ జరిగింది. ఇందులో న్యూజిలాండ్ అద్భుతంగా రానించి విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 169 పరుగులు చేయగా… ఆ లక్ష్యాన్ని కేవలం 12.5 ఓవర్లలోనే ఊది పడేసింది న్యూజిలాండ్. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో పరుగులు రాబట్టడానికి చాలా కష్టపడ్డారు బ్యాటర్లు. కానీ న్యూజిలాండ్ మాత్రం అవలీలగా పరుగులు సాధించింది. దీని వెనుక పెద్ద కుట్ర ఉందని… న్యూజిలాండ్ కు అనుకూలంగా పిచ్ రెడీ చేశారని కొంతమంది దక్షిణాఫ్రికా అభిమానులు ఆరోపణలు చేస్తున్నారు. దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్‌రమ్ ( Aiden Markram ) క్యాచ్ పైన కూడా ఫిక్సింగ్ జరిగిందని చెబుతున్నారు.

న్యూజిలాండ్ ఆటగాడు డారెల్ మిచెల్ బంతిని నేలకు తగిలేలా క్యాచ్ అందుకున్నాడని దక్షిణాఫ్రికా అభిమానులు స్పష్టం చేస్తున్నారు. కానీ థర్డ్ అంపైర్ మాత్రం ఐసీసీ బాస్ జై షా ఆదేశాల మేరకు ఔట్ గా ప్రకటించడానికి కూడా సంచలన ఆరోపణలు చేస్తున్నారు దక్షిణాఫ్రికా ఫ్యాన్స్. దక్షిణాఫ్రికా ఫైనల్ కు వస్తే టీమిండియా ఓడిపోతుందని భయపడుతున్నారని చెబుతున్నారు. అందుకే సెమీఫైనల్ దశలోనే దక్షిణాఫ్రికాను ఇంటిదారి పట్టించాడని ఐసీసీ బాస్ జై షా ను ఉద్దేశించి దారుణంగా ఆడుకుంటున్నారు. కాగా 2024 ఫైనల్స్ లో దక్షిణాఫ్రికాను టీమిండియా ఓడించింది. అయితే అప్పటి పగను టీమిండియా పై తీర్చుకునేందుకు దక్షిణాఫ్రికా చాలా కసిగా ఆడింది. టోర్నమెంటులో ఒక్క ఓటమి లేకుండా దూసుకు వచ్చింది. కానీ ఐడెన్ మార్క్‌రమ్ ( Aiden Markram ) క్యాచ్ కారణంగా ఓటమి పాలైంది దక్షిణాఫ్రికా. దీంతో దక్షిణాఫ్రికా ఓటమిలో జై షా సమయం ఉందని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక న్యూజిలాండ్ ఫైనల్ కి వస్తే టీమిండియా అవలీలగా గెలుస్తుందని కూడా కొంతమంది అంటున్నారు.

Advertisement

Also Read: Ban On Sanju Samson: సంజుపై ఐసీసీ నిషేధం…సెమీ ఫైన‌ల్ నుంచి ఔట్, ఆ హెల్మెటే కొంప‌ముంచిందా ?

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×