E-Paper
Advertisement

Pak Players: ఆయ‌న‌వి ఒంటెద్దు పోక‌డులు, కీలు బొమ్మ‌లాగా ఆడుకున్నాడు..కోచ్ పై ఫిర్యాదు చేసిన‌ పాకిస్తాన్ ప్లేయ‌ర్లు

Pak Players: ఆయ‌న‌వి ఒంటెద్దు పోక‌డులు, కీలు బొమ్మ‌లాగా ఆడుకున్నాడు..కోచ్ పై ఫిర్యాదు చేసిన‌ పాకిస్తాన్ ప్లేయ‌ర్లు
Advertisement

Pak Players:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) తుది దశకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెమీ ఫైనల్ దశ కొనసాగుతోంది. ఇలాంటి నేపథ్యంలో టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయిన పాకిస్తాన్ ప్లేయర్లపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు యాక్షన్ తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. అయితే, తమపై వేటు వేస్తారు అన్న భయంతో పాకిస్తాన్ ప్లేయర్లు ( PAK PLAYERS ) కొత్త స్కెచ్ వేశారు. పాకిస్తాన్ కోచ్ మైక్ హెస్సన్ ( COACH MIKE HESSON ) పైన రివర్స్ గా ఫిర్యాదు చేశారు ప్లేయర్లు. అతని చేతకానితనం, ఒంటెద్దు పోక‌డ‌ల‌ వల్ల పాకిస్తాన్ టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయిందని సంచలన ఆరోపణలు చేశారు పాక్ ప్లేయ‌ర్లు. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు ఫిర్యాదు కూడా చేశారు. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Also Read : BCCI vs PCB Salary Clash: పాకిస్తాన్ క్రికెట‌ర్ల జీతాలు ఎంతో తెలుసా ? టీమిండియా ప్లేయ‌ర్ల కాలిగోటికి కూడా స‌రిపోవా

పాకిస్తాన్ కోచ్ ను అడ్డంగా ఇరికించిన ప్లేయర్లు

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament )  నేపథ్యంలో సూపర్ 8 దశలో పాకిస్తాన్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే పాకిస్తాన్ ఎలిమినేట్ అయిన నేపథ్యంలో వైఫల్యాలపై ఫోకస్ చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( PCB). ఈ మేరకు తాజాగా అత్యవసర సమావేశం కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పాకిస్తాన్ కోచ్ మైక్ హెస్సన్ ను దోషి చేశారు పాక్ ప్లేయర్లు. అతడి నిరంకుశత్వం, చేతకానితనం వల్ల పాకిస్తాన్ ఓడిపోవాల్సి వచ్చిందని మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలను తీసుకున్నాడని… ప్లేయర్లుగా తమ నిర్ణయాలకు ఏ రోజు కూడా గౌరవం ఇవ్వలేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ముందు నివేదిక ఇచ్చారు ప్లేయర్లు. వేరే కోచ్ ఉంటే పరిస్థితి మరోలాగా ఉండేదని పాక్ ప్లేయర్లు తెలిపారు.

కీలు బొమ్మలాగా ప్లేయర్లను ఆడుకున్నాడని… అసలు జట్టుకు ఏం కావాలో అతనికి తెలియదని మండిపడ్డారు. అతని ఒంటెద్దు పోకడల వల్ల పాకిస్తాన్ ఓడిపోయిందని బాంబు పేల్చారు. దీనివల్ల పాకిస్తాన్ ప్రదర్శన దెబ్బ కొట్టిందని ప్లేయర్లు సంచలన ఆరోపణలు చేశారు. ఇక పాకిస్తాన్ ప్లేయర్ల ఫిర్యాదు నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ అలర్ట్ అయింది. వెంటనే పాకిస్తాన్ కోచ్ మైక్ హెస్సన్ ను బాధ్యుడిని చేస్తూ అతన్ని తొలగించే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏ క్షణమైన దీనిపైన ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు జాతీయ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండ‌గా, టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 టోర్న‌మెంట్ నేప‌థ్యంలో గ్రూప్ స్టేజ్ లోనే టీమిండియా ( Team India) చేతిలో పాక్ ( Pakistan team) ఓట‌మి పాలైంది.

Advertisement

Also Read: Ban On Sanju Samson: సంజుపై ఐసీసీ నిషేధం…సెమీ ఫైన‌ల్ నుంచి ఔట్, ఆ హెల్మెటే కొంప‌ముంచిందా ?

 

Related News

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

Big Stories

Advertisement
×