E-Paper
Advertisement

Mrithyunjay: కట్టిపడేసింది.. శ్రీ విష్ణు ‘మృత్యుంజయ్’పై నేచురల్ స్టార్ నాని రివ్యూ!

Mrithyunjay: కట్టిపడేసింది.. శ్రీ విష్ణు ‘మృత్యుంజయ్’పై నేచురల్ స్టార్ నాని రివ్యూ!
Advertisement

Mrithyunjay: ఈ మధ్యకాలంలో ఒక హీరో సినిమాపై మరో హీరో రివ్యూ ఇవ్వడం సాధారణంగా మారింది. ఈ కల్చర్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేసింది మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు అనే చెప్పాలి. తను చూసిన సినిమా బాగుంటే, వెంటనే ఆ సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ, ఆ సినిమాకు బూస్ట్ ఇస్తుంటారు. ఆయన తర్వాత మరికొందరు హీరోలు కూడా దీనిని కంటిన్యూ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) ఓ సినిమా రివ్యూని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా, అది వైరల్ అవుతోంది. ఆ సినిమా ఏదో కాదు, శుక్రవారం (మార్చి 06)న విడుదల కాబోతున్న శ్రీ విష్ణు (Sree Vishnu) సినిమా ‘మృత్యుంజయ్’ (Mrithyunjay) ప్రీమియర్ చూసిన నాని, సోషల్ మీడియా వేదికగా ‘కట్టిపడేసింది’ అంటూ తన రివ్యూని షేర్ చేశారు.

Also Read- Anantha Sriram: చిరు, చరణ్‌ల ప్రేమ ఎలా ఉంటుందంటే?

స్నేహితుడి కోసం

Advertisement

శ్రీ విష్ణు హీరోగా హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం‌లో రూపుదిద్దుకున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ ‘మృత్యుంజయ్’. లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ‘సామజవరగమన’తో బ్లాక్ బస్టర్ హిట్ పెయిర్‌గా నిలిచిన శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ ఈ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఆల్రెడీ ఈ సినిమాను వీక్షించి.. సినిమా చాలా బాగుంది అంటూ తన రివ్యూని ఇచ్చిన విషయం తెలిసిందే. శుక్రవారం థియేటర్లలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన ఈ చిత్రాన్ని నేచురల్ స్టార్ నాని కూడా వీక్షించి తన బ్లాక్ బస్టర్ రివ్యూ (Nani Mrithyunjay Movie Reveiw)ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఎంతో బిజీ షెడ్యూల్‌లో ఉండి కూడా, తన స్నేహితుడు శ్రీ విష్ణు కోసం ఈ మూవీని ప్రత్యేకంగా వీక్షించి.. సోషల్ మీడియాలో రివ్యూ ఇస్తూ, హీరోపై ప్రశంసలు కురిపించారు. తన తొలి ప్రాజెక్ట్‌తోనే బ్లాక్ బస్టర్ విజయం సాధించబోతున్నందుకు నిర్మాత సందీప్‌ను కూడా అభినందించారు.

Also Read- Carmeni Selvam: ఏప్రిల్ 3 లిస్ట్‌లోకి హై స్టేక్స్ డ్రామా.. వివరాలివే!

నాకు చాలా నచ్చింది

Advertisement

ఈ సందర్భంగా నాని తన ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్‌లో.. ‘‘శ్రీ విష్ణు ‘మృత్యుంజయ్’ నాకు చాలా నచ్చింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నన్ను కట్టిపడేసింది. శ్రీ విష్ణు తన కామిక్ టైమింగ్, సరదా పాత్రలతో ఎంతగా నవ్విస్తుంటాడో మనందరికీ తెలుసు. కానీ ఈ సినిమాలో శ్రీ విష్ణు నటన నన్ను ఆశ్చర్యపరిచింది. సందీప్ గుణ్ణం తొలి ప్రాజెక్ట్‌తోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నారు.. ఆయనకు ముందుగానే అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కొత్త కంటెంట్, కొత్త దారిలో సినిమాను నిర్మించినందుకు హ్యాపీగా ఉంది. రేపు సినిమా విడుదల కాబోతోన్న నేపథ్యంలో టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్’’ అని పేర్కొన్నారు. ఇక నాని చేసిన ఈ పోస్ట్‌కు నెటిజన్లు కూడా ‘వావ్.. నాని అన్ననే మెప్పించిదంటే, ఈ సినిమాను కచ్చితంగా చూడాలి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా చూసి, టీమ్‌కు అభినందనలు తెలిపిన నానికి, చిత్రయూనిట్ కృతజ్ఞతలు తెలిపింది.

Also Read- Raviteja -Kona Venkat: అడ్డమైన వాళ్ళు తింటున్నారు.. రవితేజను ఘోరంగా అవమానించిన నిర్మాత?

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×