Abhishek Sharma Net Worth: టీమిండియా స్టార్ క్రికెటర్ అభిషేక్ శర్మ ( Abhishek Sharma) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అది తక్కువ కాలంలో టీమిండియా జట్టులోకి వచ్చిన అభిషేక్ శర్మ… ఇప్పుడు డేంజర్ ఆటగాడికి మారిపోయాడు. 25 సంవత్సరాల వయసులోనే టీమ్ ఇండియాను ఏలుతున్నాడు అభిషేక్ శర్మ. ప్రస్తుతం టి20లో మాత్రమే ఆడుతున్న అభిషేక్ శర్మ త్వరలోనే టెస్టులతో పాటు వన్డేలు కూడా ఆడతాడని అంటున్నారు. అంతేకాదు భవిష్యత్తులో సూర్య కుమార్ యాదవ్ రిటైర్మెంట్ ప్రకటిస్తే టీమిండియా టి20 కెప్టెన్ గా అభిషేక్ శర్మకు బాధ్యతలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని అంచనా వేస్తున్నారు క్రీడా విశ్లేషకులు. అయితే న్యూజిలాండ్ పై జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో 80 కి పైగా పరుగులు చేసిన అభిషేక్ శర్మ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి.
టీమిండియా యువ కెరటం అభిషేక్ శర్మ వయసు ప్రస్తుతం 25 సంవత్సరాలు అన్న సంగతి తెలిసిందే. ఈ ఏజ్ లో కూడా అభిషేక్ శర్మ జట్టులో రాణిస్తూ కోట్లల్లో డబ్బులు సంపాదించాడు. ప్రస్తుతం అభిషేక్ శర్మ ఆస్తిలో ( Abhishek Sharma Net Worth ) విలువ రెండు మిలియన్స్. అంటే ఇండియన్ కరెన్సీలో 16 కోట్లు అన్నమాట. ఐపీఎల్ తో పాటు టీమిండియాలో అద్భుతంగా రాణిస్తున్న నేపథ్యంలో అతనికి ఈ మేర ఆస్తులు వచ్చాయి. ప్రస్తుతం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఆడుతున్న అభిషేక్ శర్మ ఏడాదికి 14 కోట్లు అర్జిస్తున్నాడు. మొదట ఐపిఎల్ ప్రారంభమైనప్పుడు 6.5 కోట్లు మాత్రమే ఏడాదికి సంపాదించేవాడు. అది ఇప్పుడు భారీగా పెరిగింది. ఇతర బ్రాండ్ల ద్వారా అతను కోట్లల్లో డబ్బులు సంపాదిస్తున్నాడు. టి20 లో నెంబర్ వన్ ఆటగాడిగా మారిన నేపథ్యంలో.. బ్రాండ్ అంబాసిడర్ గా కూడా పలు బ్రాండ్లకు కొనసాగుతున్నాడు. అంతేకాదు పంజాబ్ లోని అమృత్ సర్ లో ఓ విలాసవంతమైన బంగ్లా కూడా ఉందట. దీని విలువ కోటి రూపాయల వరకు ఉంటుందని తెలుస్తోంది. అభిశిక్ శర్మకు రెండు ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇందులో రేంజ్ రోవర్ వేలర్. దీని విలువ 83 లక్షలు. మరో కారు బీఎండబ్ల్యూ X1. ఈ కారు విలువ 45 లక్షలు గా ఉంటుంది.
మంచినీళ్లు తాగినంత సులభంగా సిక్సులు కొట్టే అభిషేక్ శర్మ ప్రస్తుతం రిలేషన్ లో ఉన్నాడు. ప్రముఖ మోడల్ లైలా ఫైసల్ ( Laila Faisal ) అనే అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడట. వీళ్ళిద్దరూ చాలా రోజుల నుంచి ప్రేమలో ఉన్నారు. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరి 14వ తేదీన అంటే లవర్స్ డే రోజు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. ఆరోజు పెళ్లి కాకపోయినా ఎంగేజ్మెంట్ అయినా చేసుకుంటారట. లైలా ఫైసల్ ( Laila Faisal ) ప్రముఖ మోడల్. ఈమె కశ్మీరీ ముస్లిం ఫ్యామిలీకి చెందిన లేడీ.
Indian cricketer Abhishek Sharma is reportedly dating Laila Faisal, and sources claim the couple is planning to tie the knot on 14th February the most romantic date of the year! 💍
While neither Abhishek nor Laila has made an official announcement yet, the news has already set… pic.twitter.com/oDMixZcqZA
— Bharatramsena (@Bharatramsena) January 22, 2026