E-Paper
Advertisement

Sangareddy: సంగారెడ్డి హౌసింగ్ శాఖలో కలకలం.. నా కారులోనే రావాలి, మహిళా అధికారులపై పీడీ లైంగిక వేధింపులు?

Sangareddy: సంగారెడ్డి హౌసింగ్ శాఖలో కలకలం.. నా కారులోనే రావాలి, మహిళా అధికారులపై పీడీ లైంగిక వేధింపులు?
Advertisement

సంగారెడ్డి జిల్లా గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో మహిళా ఉద్యోగినుల పట్ల ఉన్నతాధికారి ప్రవర్తన ఇప్పుడు జిల్లావ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. స్వయంగా మహిళా అధికారులే తమ పైఅధికారిపై లైంగిక, మానసిక వేధింపుల ఆరోపణలు చేస్తూ జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించడం సంచలనం సృష్టిస్తోంది.

కలెక్టర్‌కు చేరిన ఫిర్యాదు

Advertisement

సంగారెడ్డి జిల్లా హౌసింగ్ శాఖలో ప్రాజెక్ట్ డైరెక్టర్ (పీడీ)గా విధులు నిర్వహిస్తున్న చలపతిరావు తమను వేధిస్తున్నారని ఆరుగురు అవుట్‌సోర్సింగ్ మహిళా అసిస్టెంట్ ఇంజనీర్లు (AEలు) ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వారు జిల్లా కలెక్టర్ ప్రావీణ్యకు రాతపూర్వక ఫిర్యాదు అందజేశారు. క్షేత్రస్థాయి పరిశీలనలకు (ఫీల్డ్ విజిట్) వెళ్లే సమయంలో తన కారులోనే రావాలని పీడీ ఒత్తిడి చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, కార్యాలయ పనివేళలు ముగిసి ఇంటికి వెళ్లిన తర్వాత కూడా ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని.. మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

వేధింపుల పర్వం

Advertisement

మహిళా ఉద్యోగినులు తమ విధుల్లో భాగంగా ఫీల్డ్ విజిట్‌కు వెళ్లాల్సి వచ్చినప్పుడు, విడిగా కాకుండా తనతోనే రావాలని పీడీ పట్టుబట్టడం వెనుక దురుద్దేశాలు ఉన్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. తమ ఆత్మగౌరవానికి భంగం కలిగేలా ఆయన ప్రవర్తన ఉంటుందని వారు వాపోయారు. లోగడ కూడా ఇలాంటి ఘటనలు జరిగినా.. ఉద్యోగ భద్రత దృష్ట్యా, పరువు పోతుందన్న భయంతో బయటకు రాలేకపోయామని కొందరు మహిళా ఉద్యోగులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. అయితే, వేధింపులు మితిమీరడంతో గత్యంతరం లేక కలెక్టర్ మెట్లెక్కాల్సి వచ్చిందని వారు తెలిపారు.

ఖండించిన పీడీ చలపతిరావు

తనపై వస్తున్న ఈ ఆరోపణలను హౌసింగ్ పీడీ చలపతిరావు తీవ్రంగా ఖండించారు. తాను ఎవరినీ వేధించలేదని, తనపై జరుగుతున్నదంతా దుష్ప్రచారమేనని ఆయన కొట్టిపారేశారు. విచారణలో అన్ని నిజాలు బయటకు వస్తాయని.. తాను నిర్దోషిగా నిలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విధుల్లో భాగంగా కఠినంగా వ్యవహరించడం వల్లనే కొందరు కావాలని తనపై బురద చల్లుతున్నారని ఆయన వాదిస్తున్నారు.

విచారణకు ఆదేశం

మహిళా ఏఈల ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ ప్రావీణ్య స్పందించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందని.. విచారణలో ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ కార్యాలయంలోనే ఉన్నతాధికారిపై ఇటువంటి ఆరోపణలు రావడం ఇప్పుడు జిల్లావ్యాప్తంగా కలకలం రేపుతోంది.

ALSO READ: Medak News: పోలీసుల సాక్షిగా.. ప్రేమ జంటపై యువతి ఫ్యామిలీ దాడి, ఆ తర్వాత

Related News

వినాయక నిమజ్జనానికి డీజే పెడుతున్నారా.. అయితే మీకో షాకింగ్ న్యూస్!

కేసీఆర్ చిటికె వేస్తే కాంగ్రెస్ నాయకులు ఊళ్లలో తిరగలేరు: జీవన్ రెడ్డి

చేయూత పింఛన్ అప్లై చేసుకోలేదా.. సాయంత్రం 5 గంటల వరకే లాస్ట్ ఛాన్స్!

మెదక్ జిల్లాలో మైండ్ బ్లాక్ అయ్యే న్యూస్.. 3 ఎకరాల రైతు ఖాతాలో 3,850 ఎకరాల భూమి?

ఇందిరమ్మ ఇండ్లు అప్లికేషన్ బిగ్ అప్డేట్.. లాస్ట్ డేట్ పొడిగింపు!

తల్లి కాంగ్రెస్‌నే ఎదిరించాం.. ఈ పిల్ల కాంగ్రెస్ ఓ లెక్కా? రేవంత్ సర్కార్‌పై కవిత ఫైర్!

ఎంపీడీవో, ఆర్‌ఐపై భద్రాద్రి జిల్లా కలెక్టర్ ఫైర్.. చర్యలు తీసుకోవాలని ఆదేశం!

అధికారులు కాదు.. తప్పు చేసిందే ప్రభుత్వం.. 22A వివాదంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×