Abhishek Sharma-IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) మార్చి 28వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్ నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఇలాంటి తరుణంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు బిగ్ రిలీఫ్ దక్కింది. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సందర్భంగా దారుణంగా విఫలమైన అభిషేక్ శర్మ, మంచి టచ్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 టోర్నమెంట్ కోసం ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న అభిషేక్ శర్మ ( Abhishek Sharma), ప్రాక్టీస్ మ్యాచ్ లో అదరగొట్టాడు. కేవలం 42 బంతుల్లో 94 పరుగులు చేసి ఊచకోత కోశాడు అభిషేక్ శర్మ. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) కంటే ముందు సన్రైజర్స్ ప్లేయర్లు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు. ఈ సందర్భంగా సన్రైజర్స్ హైదరాబాద్ ( SRH) A జట్టు తరఫున బరిలోకి దిగాడు అభిషేక్ శర్మ. ఈ సందర్భంగా మొదటి బంతి నుంచి దూకుడుగాడిన అభిషేక్ శర్మ 42 బంతుల్లోనే 94 పరుగులతో ఊచ కోత కోశాడు. అటు హైదరాబాద్ జట్టుకు సంబంధించిన మరో ఫినిషర్ సలీం అరోరా 16 బంతుల్లోనే 47 పరుగులు చేశాడు. కాటేరమ్మ కొడుకుగా పేరుగాంచిన క్లాసెన్ 31 బందులు ఎదుర్కొని 49 పరుగులు చేశాడు. అటు సన్రైజర్స్ కెప్టెన్ ఇషాన్ కిషన్ 15 బంతుల్లో 18 పరుగులు సాధించి విఫలమయ్యాడు.
ఈ దెబ్బకు సన్రైజర్స్ హైదరాబాద్ A జట్టు మొదట బ్యాటింగ్ చేసి 253 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలోనే 9 వికెట్లు నష్టపోయింది. ఈ మ్యాచ్ లో మొత్తం 7 సిక్సర్లు బాదిన అభిషేక్ శర్మ ఎనిమిది బౌండరీలు కూడా కొట్టాడు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సందర్భంగా అభిషేక్ శర్మ దారుణంగా విఫలం అయ్యాడు. కానీ ఫైనల్ సందర్భంగా అర్ధ సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఇక ఇప్పుడు ఐపీఎల్ 2026 ప్రారంభానికి కంటే ముందే, ప్రాక్టీస్ మ్యాచ్ లో అదరగొట్టాడు. ఇదే ఊపును అభిషేక్ శర్మ కొనసాగిస్తే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టును ఆపడం ఎవరి తరం కాదని అంచనా వేస్తున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో బ్యాటింగ్ పరంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. నిర్ణీత 20 ఓవర్ల లలో 400 పరుగులు కూడా కొట్టగల సత్తా ఉన్న బ్యాటర్లు ఉన్నారు. కానీ బౌలింగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ చాలా వీక్ గా ఉంది. ప్యాట్ కమిన్స్ గాయం కారణంగా తొలిదశ మ్యాచ్లకు దూరం కాబోతున్నాడు. అతడు జట్టులో లేకపోతే హైదరాబాద్ బౌలింగ్ దారుణంగా విఫలం కావడం గ్యారెంటీ అంటున్నారు.
🚨 "ABHISHEK SHARMA" STORM IN PRACTICE MATCH SIMULATION 🚨
He Smashed 94Runs off 42 balls with 7 Sixes and 8 Fours 🔥
He nearly Missed well deserved hundredWill IPL 2026 gonna be going hot for Abhishek's career ??
— Kiara (@crickiara) March 21, 2026