E-Paper
Advertisement

Kavya Maran – PCB : కావ్య పాప‌కు పాకిస్తాన్‌ గుడ్ న్యూస్…ఇక డ‌బ్బులే డ‌బ్బులు

Kavya Maran – PCB : కావ్య పాప‌కు పాకిస్తాన్‌ గుడ్ న్యూస్…ఇక డ‌బ్బులే డ‌బ్బులు
Advertisement

Kavya Maran – PCB :  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న నేపథ్యంలో కావ్య పాపకు ( Kavya Maran) బంపర్ ఆఫర్ తగిలింది. పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ( Abrar Ahmed) విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( Pakistan Cricket Board) సంచలన నిర్ణయం తీసుకుంది. ది 100 లీగ్ లో ( The Hundred league) అబ్రార్ అహ్మద్ ఆడెందుకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ( NOC ) జారీ చేస్తూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. దీంతో కావ్య పాప కొనుగోలు చేసిన సన్ రైజర్స్ లీడ్స్ జట్టు ( Sunrisers Leeds) తరఫున వచ్చే సీజన్ లో పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ బరిలోకి దిగుతాడు అన్నమాట. దీంతో కావ్య పాప‌కు బిగ్ రిలీఫ్ ద‌క్కింది. ఆమె పెట్టిన డ‌బ్బుల‌కు న్యాయం జ‌రుగ‌నుంది.

Also Read: Sanju VS Klaasen: నీ తోలు తీస్తా..సంజుకు కాటేరమ్మ కొడుకు క్లాసెన్ వార్నింగ్‌, ప్లే ఆఫ్స్ లోకి SRH, గుజ‌రాత్ టైటాన్స్‌

Advertisement

ది 100 లీగ్ వేలం ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సన్ రైజర్స్ లీడ్స్ జట్టు ఓనర్ కావ్య పాప ఈ వేలంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక ప్లేయర్లను కొనుగోలు చేశారు. ఇందులో భాగంగానే పాకిస్తాన్ మిస్టరీస్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ను కావ్య పాప కొనుగోలు చేయడం హాట్ టాపిక్ అయింది. ఏకంగా 2.34 కోట్లు పెట్టి, అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేయడం జరిగింది. ఐపీఎల్ తో లింక్ ఉన్న ఇండియన్ ఫ్రాంచైజీ… ఒక పాకిస్తాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

దీంతో కావ్య పాప పై దారుణంగా ట్రోలింగ్ చేశారు ఇండియన్ ఫ్యాన్స్. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును బ్యాన్ చేయాలని కూడా సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. కావ్యాను దేశద్రోహి అంటే కూడా పోస్టులు పెట్టారు. అన్నిటిని ఓర్చుకున్న కావ్య.. ఐపీఎల్ లో కూడా తమ జట్టును ముందుకు తీసుకువెళ్తోంది. ఎక్కడ వెనక్కి తగ్గలేదు. అయితే ఇలాంటి క్రమంలో కావ్య పాపకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇండియాకు సంబంధాలు ఉన్న సన్రైజర్స్ లీడ్స్ జట్టులో అబ్రార్ అహ్మద్ ఆడేలా NOC ఇచ్చింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. దీంతో ది 100 లీగ్ లో అబ్రార్ అహ్మద్ బరిలోకి దిగుతాడు.

కావ్య పాపను లైట్ తీసుకున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి

Advertisement

రూల్స్ ప్రకారం పాకిస్తాన్ దేశానికి సంబంధించిన ఏ ఒక్క ప్లేయర్ ను కూడా ఇండియాకు సంబంధించిన ఫ్రాంచైజీ కొనుగోలు చేయకూడదు. అయితే ఆ రూల్స్ బ్రేక్ చేస్తూ కావ్య పాప.. అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేసింది. అయితే ఇండియాలో జరిగే టోర్నమెంట్ కోసం మాత్రం ఆమె… అతన్ని కొనుగోలు చేయలేదు. ఇంగ్లాండ్ కు సంబంధించిన ది 100 లీగ్ కావడంతో కావ్య పాప వివాదాన్ని లైట్ తీసుకుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి.

Also Read: Trolls On Rizwan: 50 పైస‌ల ఓవర్ యాక్టింగ్ అంటూ మూకుమ్మ‌డిగా బంగ్లా ప్లేయ‌ర్ల దాడి..అంపైర్ కు రిజ్వాన్ ఫిర్యాదు 

 

 

 

 

 

 

Related News

ఉగ్రవాదుల టెన్షన్..21 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌లో అడుగుపెట్టిన ఇంగ్లాండ్

చిన్నస్వామిలో వర్షం పడాలని పోర్లు దండాలు పెట్టండి, లేకపోతే విండీస్ ఘోర ఓటమే!

విరాట్ కోహ్లీ నాలాగే ఉంటాడు కానీ, పెద్ద అంద‌గాడు కాదు !

వాళ్లంద‌రితో జై హిందూ అనిపించండి, ష‌మీ కామెంట్స్ వైర‌ల్ !

టీమిండియాకు ఏది చేత‌కాదు, ఇప్ప‌టికే విండీస్ సిరీస్ గెలిచింది, ట్రోఫీ ఇచ్చేయండి

టీమిండియా రూ.250 కోట్లు దొబ్బుకుపోతే, మాకు ఒక్క రూపాయి ఇవ్వ‌డం లేదు

నోటికి ప్లాస్ట‌ర్ వేసి, 15వ అంతస్తు నుంచి కిందకు వేలాడదీశారు!

విడాకులు త‌ర్వాత ప‌చ్చి తాగుబోతున‌య్యా..ధ‌న శ్రీపై యుజ్వేంద్ర చాహల్ సంచ‌ల‌నం !

Big Stories

Advertisement
×