E-Paper
Advertisement

Shubman Gill Injury: గాయం అంటూ గిల్‌, గంభీర్ డ్రామాలు.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి తొల‌గించ‌డం వెనుక అస‌లు ర‌హ‌స్యం ఇదే!

Shubman Gill Injury: గాయం అంటూ గిల్‌, గంభీర్ డ్రామాలు.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి తొల‌గించ‌డం వెనుక అస‌లు ర‌హ‌స్యం ఇదే!
Advertisement

Shubman Gill Injury: భారత క్రికెట్ నియంత్రణ మండలి {BCCI} సంచలన నిర్ణయం తీసుకుంది. 2025 టి-20 ప్రపంచ కప్ కోసం భారత స్క్వాడ్ ఎంపికలో సెలెక్టర్లు మరోసారి తమ మార్క్ చూపించారు. ప్రపంచ కప్ మెగా టోర్నీ సమీపిస్తున్నందున ఫామ్ లో లేని శుభ్ మన్ గిల్ పై వేటు వేశారు. వరుస మ్యాచ్ లలో విఫలమవుతున్నప్పటికీ.. ఇన్నాళ్లు T-20 జట్టు ఓపెనర్ గా కొనసాగించిన గిల్ పై ఎట్టకేలకు వేటు వేసింది. ఊహించని రీతిలో అతడిని జట్టు నుంచి తప్పించింది. అతడి స్థానంలో సంజు శాంసన్ ని జట్టులోకి తీసుకున్నారు.

Also Read: The Ashes 2025-26: మళ్లీ ఇంగ్లండ్ ఓటమి.. యాషెస్ సిరీస్‌ ఆసీస్ వశం

Advertisement

 

గిల్ ని ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది..?:

గిల్ ని ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందనే విషయాలను టీమ్ ఇండియా టి-20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ వెల్లడించారు. సూర్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ” మిడిల్ ఆర్డర్ బలాన్ని పెంచేందుకే గిల్ ని పక్కన పెట్టాల్సి వచ్చింది. వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ తో పాటు రింకు సింగ్ కోసం గిల్ ని తప్పించాల్సి వచ్చింది. గిల్ పేలవ ఫామ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోలేదు. అతని క్లాస్ బ్యాటింగ్ పై మాకు ఎలాంటి సందేహం లేదు. టీం కాంబినేషన్ కోసమే అతడిని పక్కన పెట్టాల్సి వచ్చింది. టాప్ ఆర్డర్ లో మాకు ఒక వికెట్ కీపర్ కావాల్సి వచ్చింది. అంతేతప్ప గిల్ ఫామ్ గురించి కాదు” అని చెప్పుకొచ్చాడు.

Advertisement

ఇక టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ మాట్లాడుతూ.. ” పరుగులు రాబట్టడంలో గిల్ వెనుకబడ్డాడు. 2024 వరల్డ్ కప్ జట్టులోను అతడు ఆడలేదు. అభిప్రాయాలు వేరుగా ఉండవచ్చు. కానీ కొన్నిసార్లు జట్టు ఎంపిక అత్యంత క్లిష్టంగా ఉంటుంది. గిల్ ఇప్పటికీ నాణ్యమైన ఆటగాడు అని మేము నమ్ముతున్నాం. ఫామ్ విషయంలో ప్రతి ఒక్కరి కెరీర్ లో ఎత్తు పళ్లాలు సహజమే. కానీ జట్టు కూర్పుకు అనుగుణంగా ఆటగాళ్లను ఎంపిక చేయాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో కొందరికి స్థానం దక్కదు” అని చెప్పుకొచ్చాడు.

 

గిల్ గాయం పై అనుమానాలు:

2026 టి-20 ప్రపంచ కప్ లో జట్టులో గిల్ పేరు ప్రకటించకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జట్టు మేనేజ్మెంట్ అధికారికంగా గిల్ పాదానికి గాయం ఉందని ప్రకటించినప్పటికీ.. వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందన్న చర్చ సోషల్ మీడియాలో పొందుకుంది. తాజాగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన చివరి టి-20 లో గిల్ మైదానంలో స్వేచ్ఛగా తిరుగుతూ, సహచర ఆటగాళ్లకు వాటర్ బాయ్ గా నీళ్లు అందిస్తూ, హర్షిత్ రానాతో సరదా సంభాషణలు చేస్తూ కనిపించాడు.

Also Read: Hardik Pandya-Cameraman: కెమెరామెన్ కు హగ్ ఇచ్చిన హార్దిక్ పాండ్యా.. చేయి విర‌గ్గొట్టి మ‌రీ

ఇది చూసిన అభిమానులు, మాజీ ఆటగాళ్లు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. అతడికి నిజంగా గాయం అయి ఉంటే ఇంత యాక్టివ్ గా ఎలా ఉంటాడన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అయితే కొన్ని మీడియా రిపోర్ట్స్ ప్రకారం గిల్ కి పెద్దగా గాయం ఏమీ లేదని.. ఫామ్ లోపం లేదా టీం కాంబినేషన్ కారణంగానే అతడిని తుది జట్టులో నుంచి తప్పించారని, గాయం కారణంగా చూపి అతడిని పక్కన పెట్టారని ప్రచారం జరుగుతుంది.

Related News

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

Big Stories

Advertisement
×