E-Paper
Advertisement

The Ashes 2025-26: మళ్లీ ఇంగ్లండ్ ఓటమి.. యాషెస్ సిరీస్‌ ఆసీస్ వశం

The Ashes 2025-26: మళ్లీ ఇంగ్లండ్ ఓటమి.. యాషెస్ సిరీస్‌ ఆసీస్ వశం
Advertisement

The Ashes, 2025-26: యాషెష్ సిరీస్ లో భాగంగా సొంత గడ్డపై ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ లో బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొట్టిన ఆస్ట్రేలియా.. సిరీస్ ని కైవసం చేసుకుంది. తొలి రెండు టెస్ట్ మ్యాచ్ లలో గెలుపొందిన ఆస్ట్రేలియా.. అడిలైడ్ వేదికగా జరిగిన మూడవ టెస్ట్ లోను విజయకేతనం ఎగురవేసింది. ఇంగ్లాండ్ ని 82 పరుగులు తేడాతో ఓడించి.. మరో రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగానే 3 – 0 తో సిరీస్ ని కైవసం చేసుకుంది.

Also Read: Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు కిస్సులు ఇచ్చి మ‌రీ రెచ్చ‌గొట్టిన లేడీ.. బ‌లైన ద‌క్షిణాఫ్రికా

Advertisement

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 371 పరుగులు చేసింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు 286 పరుగులు చేసింది. ఇక 435 పరుగుల లక్ష్య చేదనలో 207/6 తో ఐదవ రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు.. 352 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా బ్యాటర్ అలెక్స్ కేరి ప్లేయర్ ఆల్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో కేరి 106, రెండవ ఇన్నింగ్స్ లో 72 పరుగులు చేశాడు. ఇక నాలుగో టెస్ట్ డిసెంబర్ 26న మేల్ బోర్న్ వేదికగా జరగనుంది.

 

పోరాడినప్పటికీ జట్టును గట్టెక్కించలేకపోయారు:

Advertisement

ఇంగ్లాండ్ బ్యాటర్లు జాక్ క్రాలీ {85}, బ్రైడెన్ కార్స్ {39}, విల్ జాక్స్ {47}, జేమీ స్మిత్ {60} పోరాడినప్పటికీ తమ జట్టును ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయారు. ఆదిలోనే ఓపెనర్ బెన్ డకెట్ {4} పెవిలియన్ చేరగా.. కాసేపటికే ఒలీ పోప్ {17} కూడా అవుట్ అయ్యాడు. కీలక దశలో జో రూట్ 63 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఈ మూడు వికెట్లను ఆస్ట్రేలియా కెప్టెన్ కమీన్స్ పడగొట్టాడు. ఇక బ్రూక్ 56 బంతుల్లో 36 పరుగులు చేసి.. క్రాలీతో ఇన్నింగ్స్ ని చక్కదిద్దె ప్రయత్నం చేశాడు. కానీ ఆస్ట్రేలియా స్పిన్నర్ లియోన్ ఆ జట్టును దెబ్బతీశాడు. స్వల్ప వ్యవధిలోనే మూడు వికెట్లను పడగొట్టి మ్యాచ్ ని ఆస్ట్రేలియా వైపు తిప్పాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, ప్యాట్ కమ్మిన్స్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.

Also Read: Hardik Pandya-Cameraman: కెమెరామెన్ కు హగ్ ఇచ్చిన హార్దిక్ పాండ్యా.. చేయి విర‌గ్గొట్టి మ‌రీ

 

భారీ సెంచరీ చేసిన ట్రావీస్ హెడ్:

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో 349 పరుగులకు ఆల్ అవుట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ రెండవ ఇన్నింగ్స్ లో ట్రావీస్ హెడ్ 219 బంతుల్లో 170 పరుగులు చేశాడు. ఇందులో 16 ఫోర్లు, 2 సిక్స్ లు ఉన్నాయి. అలాగే అలెక్స్ కెరీ కూడా 128 బంతుల్లో 72 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాటర్లు పెద్దగా తోడ్పాటు అందించకపోవడంతో ఆస్ట్రేలియా జట్టు ఆశించిన స్కోర్ కంటే ముందే అలౌట్ అయ్యింది. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్ టంగ్ 4 వికెట్లు పడగొట్టాడు. అలాగే బ్రైడెన్ కార్స్ 3 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా మరో రెండు టెస్టులు మిగిలి ఉండగానే.. వరుసగా మూడు మ్యాచ్ లలో గెలుపొంది సిరీస్ ని కైవసం చేసుకుంది ఆస్ట్రేలియా.

Related News

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

Big Stories

Advertisement
×