E-Paper
Advertisement

Hardik Pandya-Cameraman: కెమెరామెన్ కు హగ్ ఇచ్చిన హార్దిక్ పాండ్యా.. చేయి విర‌గ్గొట్టి మ‌రీ

Hardik Pandya-Cameraman: కెమెరామెన్ కు హగ్ ఇచ్చిన హార్దిక్ పాండ్యా.. చేయి విర‌గ్గొట్టి మ‌రీ
Advertisement

Hardik Pandya-Cameraman: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. తాను కొట్టిన సిక్సర్ బంతి తగిలి గాయపడిన కెమెరామెన్ ని పరామర్శించి.. అతడికి సాయం చేసి అందరి మనసులు గెలుచుకున్నాడు. ఈ ఘటన అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం రోజు సౌతాఫ్రికా – భారత్ మధ్య జరిగిన ఆఖరి టి-20లో చోటుచేసుకుంది.

Also Read: IND VS SA: మ్యాచ్ ర‌ద్దు కావ‌డంపై శశిథరూర్ సీరియ‌స్‌.. సౌత్‌లో మ్యాచ్‌లు పెట్టండి

Advertisement

తన సిక్సర్ కారణంగా గాయపడిన కెమెరామెన్ కి హార్దిక్ పాండ్యా క్షమాపణలు చెప్పడంతో పాటు హగ్ ఇచ్చాడు. దీంతో హార్దిక్ పాండ్యా.. ఆ కెమెరామెన్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా పై నెటిజెన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

 

అసలు ఏం జరిగిందంటే..?:

Advertisement

భారత్ – సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన చివరి టి-20 మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా కేవలం 25 బంతుల్లో 63 పరుగులతో చెలరేగాడు. ఈ ఇన్నింగ్స్ లో ఐదు భారీ సిక్సర్లు బాదాడు. అయితే కార్బన్ బోష్ వేసిన 13వ ఓవర్ రెండవ బంతిని హార్దిక్ పాండ్యా మిడాఫ్ దిశగా భారీ సిక్స్ కొట్టాడు. ఆ బంతి నేరుగా వెళ్లి బౌండరీ బయట ఉన్న కెమెరామెన్ ఎడమ చేతి భుజానికి బలంగా దాకింది. దీంతో అతడి భుజంపై తీవ్ర గాయం అయింది. బంతి తగిలిన సమయంలో ఆ కెమెరామెన్ భారత డకౌట్ దృశ్యాలను తన భుజాలపై కెమెరా పెట్టుకుని షూట్ చేస్తున్నాడు. అయితే హార్దిక్ పాండ్యా కొట్టిన ఆ సిక్స్ ని అతడు గమనించకపోవడంతో బంతి అతడిని బలంగా తాకింది. దీంతో వెంటనే స్పందించిన టీమిండియా ఫిజియో ఆ కెమెరామెన్ కి ప్రధమ చికిత్స అందించారు. అతడికి పెయిన్ రిలీఫ్ స్ప్రే చేశారు. అయినా నొప్పి తగ్గకపోవడంతో ఐస్ బ్యాగ్ పెట్టుకొని కనిపించాడు. ఆ తర్వాత టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా కెమెరామెన్ గాయం పై ఆరా తీశాడు.

Also Read: Smriti Mandhana: ల‌వ‌ర్ టెన్ష‌న్ లేదు.. స్మృతి మందాన బ‌రితెగింపు ? పొట్టి బ‌ట్ట‌లు వేసుకుని !

 

కెమెరామెన్ ని హగ్ చేసుకుని క్షమాపణలు చెప్పిన హార్దిక్:

భారత ఇన్నింగ్స్ ముగిసిన వెంటనే హార్దిక్ పాండ్యా నేరుగా ఆ కెమెరామెన్ వద్దకు పరుగున వెళ్లాడు. అతడి గాయాన్ని పరిశీలించి.. ఐస్ ప్యాక్ పెట్టడంలో సహాయం చేశాడు. అనుకోకుండా జరిగిన పొరపాటుకు క్షమాపణగా అతనిని ఆలింగణం చేసుకొని తన పెద్ద మనసును చాటుకున్నాడు. ఈ క్షణాలు స్టేడియంలో ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా చూపిన ఈ మానవత్వం సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటుంది. అలాగే కెమెరామెన్ నవ్వుతున్న ముఖం వీడియో కూడా వైరల్ గా మారింది. హార్దిక్ పాండ్యా ఆ కెమెరామెన్ కి హాగ్ ఇచ్చిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Related News

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

రిటైర్మెంట్ ఇచ్చే వ‌రకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా కొన‌సాగుతాడు

బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది మధ్య గొడవలే పాకిస్తాన్ కు ఈ దరిద్రం

బాబ‌ర్ ఆజంకు చేత‌కాదు, నాకు కెప్టెన్సీ ఇవ్వండి !

Big Stories

Advertisement
×