E-Paper
Advertisement

Ajinkya Rahane: రాసి పెట్టుకోండి..టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో అభిషేక్ శ‌ర్మ డ‌కౌట్ కావ‌డం ప‌క్కా

Ajinkya Rahane: రాసి పెట్టుకోండి..టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో అభిషేక్ శ‌ర్మ డ‌కౌట్ కావ‌డం ప‌క్కా
Advertisement

Ajinkya Rahane:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026) నేపథ్యంలో అభిషేక్ శర్మ పై ( Abhishek Sharma) సంచలన వ్యాఖ్యలు చేశారు టీమిండియా క్రికెటర్ అజింక్య రహానే. టి20 ప్రపంచ కప్ టోర్నమెంట్ నేపథ్యంలో అభిషేక్ శర్మ కాస్త జాగ్రత్తగా ఆడాలని, అతని ఇన్నింగ్స్ టీమ్ ఇండియాకు చాలా ముఖ్యమంటూ వ్యాఖ్యానించారు. అభిషేక్ శర్మ చాలా రిస్క్ తో ఆడుతున్నాడు… అలా ఆడితే ప్రపంచకప్ లో కూడా డకౌట్ అయ్యే ప్రమాదం ఉంటుంది అంటూ హెచ్చరించారు అజింక్య రహానే. మరో వారం రోజుల్లోనే టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు ఈ మెగా టోర్నమెంట్ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియాకు కీలక సూచనలు చేశారు అజింక్య రహానే ( Ajinkya Rahane ).

 Also Read:  Sanju Samson: సంజు శాంస‌న్ కు కోట్ల‌ల్లో ఆస్తులు, బంగ్లాలు, ఖ‌రీదైన కార్లు..కానీ ఒక్క‌ మ్యాచ్ ఆడ‌టం చేత‌కావ‌డం లేదు

అభిషేక్ శర్మ డక్ అవుట్ కావడం గ్యారెంటీ

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో హై-రిస్క్ తో ఆడుతున్న అభిషేక్ శర్మ డకౌట్ ( Abhishek Sharma golden duck ) కావడం గ్యారెంటీ అంటూ అజింక్య రహానే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అతని ఆట తీరు చూస్తుంటే చాలా భయంకరంగా ఉంటుందని తెలిపారు. అభిషేక్ శర్మ లాగా టి20 లో ఆడాల్సిందే.. కానీ రిస్క్ లేకుండా బ్యాటింగ్ చేయాలి అంటూ సూచనలు చేశారు. రిస్క్‌ తీసుకొని అభిషేక్ శర్మ భయంకరమైన షాట్లు ఆడుతున్నాడు.. అలా ఆడితే కొన్నిసార్లు సక్సెస్ అవుతుందని వివరించారు. అదే రిస్క్ బెడిసి కొడితే అభిషేక్ శర్మ డకౌట్ కావడం గ్యారెంటీ అన్నారు. ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించే సత్తా అభిషేక్ శర్మకు ఉంది.. అలాంటి ఆటగాడు చివరి వరకు బ్యాటింగ్ చేయాలి.. అప్పుడే ఇండియా విజయం సాధిస్తుందని వివరించారు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని అభిషేక్ శర్మ బ్యాటింగ్ చేయాలని కోరారు. అలా చేస్తే అభిషేక్ శర్మ బ్యాటింగ్ కు తిరుగుండదని.. ప్రత్యర్థి బౌలర్లకు ఇక చుక్కలే అంటూ వార్నింగ్ ఇచ్చారు.

పాకిస్తాన్ కు పరువు తీసిన అజింక్య రహానే

టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ బాయ్ కాట్ చేస్తామంటూ పాకిస్తాన్ బెదిరింపులు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై అజింక్య రహానే స్పందించారు. పాకిస్తాన్ కొంత దమ్ము లేదని.. వాళ్లు కచ్చితంగా టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఆడతారని వివరించారు. టోర్నమెంట్ ఆడేందుకు శ్రీలంకకు కచ్చితంగా పాకిస్తాన్ వస్తుందని తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. కాగా, ఇప్పటికే కొలంబో వచ్చేందుకు పాకిస్తాన్ జట్టు టికెట్లు కూడా బుక్ చేస్తుందట. 2026 టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా వ‌ర్సెస్ పాకిస్తాన్ మ‌ధ్య ఫిబ్ర‌వ‌రి 15వ తేదీన లీగ్ ద‌శ‌లో మ్యాచ్ కొలంబో వేదిక‌గా ఉంది.

Advertisement

 Also Read: WPL 2026-RCB Finals: ఫైనల్‌కు RCB..యూపీ ఎలిమినేట్..మిగిలిన జ‌ట్ల‌లో ఎవ‌రికి ఎంత ఛాన్స్, సినారియో ఇదే

 

 

Related News

ఈ ద‌ద్ద‌మ్మకు టీమిండియాపై ఆడ‌టం చేత‌కాదు…స‌ల్మాన్ సెంచ‌రీపై బాజిద్ ఖాన్ ఫైర్‌

శ‌భాష్ స‌ల్మాన్‌…నీ దెబ్బ‌కు న‌ఖ్వీ గాడి రెండు చెంప‌లు వాచిపోయింటాయ్ ?

అస‌లు నీకు బుర్ర ఉందా ? ష‌న‌కా బ్యాటింగ్ పై గ్యారీ కిర్‌స్టెన్ సీరియ‌స్‌

ఆ పాట‌లు పెట్టి ధోని న‌న్ను రెచ్చ‌గొట్టేవాడు…వీరూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబ‌ర్‌, షాహీన్‌, షాబాద్, హారిస్ రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిందే…పాకిస్తాన్ నుంచి త‌రిమేసే టైమ్ వ‌చ్చింది!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

Big Stories

Advertisement
×