Sanju Samson: టీమిండియా యంగ్ క్రికెటర్, మరో ధోనిగా పిలువబడే సంజు శాంసన్ ( Sanju Samson net worth) ఆస్తుల గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న 5 టీ20 ల సిరీస్ లో వరుసగా నాలుగు మ్యాచ్ లలో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు సంజు శాంసన్. ఈ నేపథ్యంలోనే అతని ఆస్తుల వివరాలు కూడా వైరల్ గా మారాయి. సంజు శాంసన్ టీమిండియా తరఫున పెద్దగా ఆడకపోయినా, డబ్బులు మాత్రం బాగానే సంపాదించాడట. నేషనల్ మీడియా కథనాల ప్రకారం సంజు శాంసన్ ఆస్తుల విలువ 90 కోట్ల వరకు ఉంటుందట. ఇండియన్ ప్రీమియర్ లీగ్, భారత క్రికెట్ నియంత్రణ మండలి ద్వారా కోట్లల్లో ఆదాయం రానుంది. అటు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న కంపెనీల సంజు శాంసన్ కు కోట్లల్లో డబ్బులు వస్తాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో చాలా సంవత్సరాలుగా ఆడుతున్నాడు సంజు శాంసన్ (Sanju Samson ). ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా ఐపీఎల్ 2025 వరకు కొనసాగాడు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఏటా అతనికి రూ.18 కోట్ల చొప్పున రాజస్థాన్ రాయల్స్ ఇవ్వడం జరిగింది. ఇక ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు, ట్రేడింగ్ ద్వారా 18 కోట్లు ఇచ్చి సంజు శాంసన్ ను తీసుకుంది. త్వరలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా కూడా సంజు శాంసన్ అవతారం ఎత్తే ఛాన్సులు కూడా ఉన్నాయి. ధోని రేంజ్ లో ఎదుగుతాడని అంటున్నారు. గ్రేడ్ C లో ఉన్న సంజు శాంసన్ కు భారత క్రికెట్ నియంత్రణ మండలి నుంచి ప్రతి సంవత్సరం కోటి రూపాయలు వస్తుంది. అలాగే ప్రతి మ్యాచ్ కు ఫీజు కూడా అందిస్తారు. కూ, హీల్, జిలెట్ లాంటి కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా సంజు వర్క్ చేస్తున్నాడు. వాటి ద్వారా దాదాపు 5 కోట్లు సంవత్సరానికి సంపాదిస్తాడట.
కేరళలోని తిరువనంతపురానికి చెందిన సంజు కు ఖరీదైన బంగ్లాలతో పాటు కార్లు కూడా ఉన్నాయి. తిరువనంతపురం లో నాలుగు కోట్ల విలువైన బంగ్లా సంజు శాంసన్ కలిగి ఉన్నాడట. ముంబై తో పాటు బెంగళూరులో కూడా సంజు కు అపార్ట్మెంట్స్ ఉన్నాయి. చాలా కంపెనీలలో పెట్టుబడులు కూడా పెట్టాడు. ఆడి, BMW, రేంజ్ రోవర్ స్పోర్ట్, మెర్సీ డేస్ బెంజ్ లాంటి కార్లు సంజు శాంసన్ కలిగి ఉన్నాడు. ఈ కార్ల వ్యాల్యూ దాదాపు 5 కోట్ల వరకు ఉంటుందట. ఇలా సంజు శాంసన్ కోట్లల్లో డబ్బులు సంపాదించాడు.
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న 5 టీ20ల సిరీస్ లో అత్యంత దారుణంగా సంజు శాంసన్ విఫలమయ్యాడు. నాలుగు టి20 మ్యాచ్ లలో కూడా సరిగ్గా ఆడలేదు. ఇక చివరి మ్యాచ్ తిరువనంతపురంలో జరగనుంది. అక్కడ కూడా ఆడకపోతే అతన్ని వరల్డ్ కప్ 2026 తుది జట్టులో తీసుకునే అవకాశం లేదని అంటున్నారు. సంజు శాంసన్ స్థానంలో ఇషాన్ ఓపెనర్ గా అలాగే వికెట్ కీపర్ గా రాణించే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అటు మూడవ వికెట్ కు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఎలాగూ ఉన్నాడు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని సంజు శాంసన్ ఆడితే బెటర్ అని సూచనలు చేస్తున్నారు.
Sanju Samson!! pic.twitter.com/SnaXqBiydx
— RVCJ Media (@RVCJ_FB) January 29, 2026