E-Paper
Advertisement

WPL 2026-RCB Finals: ఫైనల్‌కు RCB..యూపీ ఎలిమినేట్..మిగిలిన జ‌ట్ల‌లో ఎవ‌రికి ఎంత ఛాన్స్, సినారియో ఇదే

WPL 2026-RCB Finals: ఫైనల్‌కు RCB..యూపీ ఎలిమినేట్..మిగిలిన జ‌ట్ల‌లో ఎవ‌రికి ఎంత ఛాన్స్, సినారియో ఇదే
Advertisement
WPL 2026-RCB Finals: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Women’s Premier League 2026) తుది దశకు వచ్చేసింది. జనవరి 9వ తేదీన ప్రారంభమైన ఈ మెగా టోర్నమెంట్ ఫిబ్రవరి 5వ తేదీన ముగియనుంది. అంటే మరో ఐదు, ఆరు రోజుల్లో టోర్నమెంట్ ఫినిష్ అవుతుంది. ఈ తరుణంలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చేరుకుంది. స్మృతి మందాన కెప్టెన్సీ లోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుస విజయాలను నమోదు చేసుకున్న నేపథ్యంలో ఫైనల్ కు వెళ్ళింది. ఇవాళ యూపీ వారియ‌ర్జ్‌ పై విజయం సాధించిన బెంగుళూరు 12 పాయింట్స్ సాధించి ఫైనల్ బెర్త్ కన్ఫామ్ చేసుకుంది. దీంతో యూపీ వారియ‌ర్జ్‌ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.

ఫైనల్ కు చేరుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ యూపీ వారియర్జ్ ( Royal Challengers Bengaluru Women vs UP Warriorz Women ) మధ్య మ్యాచ్ వ‌డోద‌ర వేదిక‌గా జరిగింది. ఇందులో బెంగళూరు ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్జ్‌ నిర్ణీత 20 ఓవర్లు ఆడింది. ఈ నేపథ్యంలోనే 8 వికెట్లు నష్టపోయిన యూపీ వారియ‌ర్జ్‌ 143 పరుగులు సాధించింది. ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో బెంగళూరు జట్టు చాలా ఆచితూచి ఆడింది. 13.1 ఓవర్లు ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రెండు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేదించింది. దీంతో ఎనిమిది వికెట్ల తేడాతో బెంగళూరు విజయం సాధించి ఫైనల్ కు దూసుకు వెళ్ళింది. అటు యూపీ ఎలిమినేట్ అయింది.

ఫైన‌ల్ కు RCB..ఢిల్లీ, గుజ‌రాత్‌, ముంబైలో ఎవ‌రికీ ఛాన్స్ ?

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇప్పటికే ఫైనల్ కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దూసుకు వెళ్లింది. అటు యూపీ ఎలిమినేట్ అయినట్లే అని చెప్పవచ్చు. యూపీ తన లీగ్ దశలో ఢిల్లీతో ఒక్క మ్యాచ్ ఆడనుంది. అందులో గెలిచినా ప్రయోజనం ఉండదు. కాబట్టి యూపీ ఎలిమినేట్ అయినట్లు చెప్పుకోవచ్చు. అంటే రెండో ఫైనలిస్ట్ గా గుజరాత్, ముంబైకి ఎక్కువ అవ‌కాశం ఉండ‌గా ఢిల్లీకి ఛాన్స్ ఉంటుంది. ఈ లెక్కన ఈ మూడు జట్లు తలో మ్యాచ్ ఆడనున్నాయి. జనవరి 30 అంటే రేపు ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ మధ్య ఫైట్ జరగనుంది. ఇందులో ముంబై గెలిస్తే పాయింట్ల పట్టిక ప్రకారం ఎనిమిది పాయింట్లతో రెండో స్థానానికి వస్తుంది.

Advertisement

అదే గుజరాత్ గెలిస్తే, రెండో స్థానంలో గుజరాత్ కొనసాగుతుంది. ఎలిమినేటర్ కు ఎంపిక అవుతుంది. ఇక యూపీతో మ్యాచ్ లో ఢిల్లీ ఓడిపోతే, ముంబైకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఒక వేళ ఢిల్లీ గెలిచినా, ముంబై ర‌న్ రేట్ ఎక్కువ ఉంటే క‌ష్ట‌మే. అప్పుడు యూపీతో పాటు ఢిల్లీ కూడా ఎలిమినేట్ అవుతుంది. ఈ నేపథ్యంలో గుజరాత్ వర్సెస్ ముంబై మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ ఉంటుంది. ఈ ఎలిమినేటర్ మ్యాచ్ ఫిబ్ర‌వ‌రి మూడవ తేదీన వడోదర వేదికగా నిర్వహిస్తారు. ఈ ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచిన జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఫిబ్రవరి 5వ తేదీన వడోదర వేదికగా ఫైనల్ ఆడుతుంది. మొత్తానికి ఎలిమినేటర్ స్టేజ్ వెళ్లేందుకు ఎక్కువ ఛాన్సులు ముంబై, గుజరాత్ జ‌ట్ల‌ల‌కు మాత్రమే ఉన్నాయి. అంటే ఢిల్లీ, యూపీ ఇంటిదారి పట్టే ఛాన్స్‌ ఎక్కువ.

Also Read: Boycott Pakistan: టీ20 ప్రపంచ కప్ కు ముందు పాకిస్తాన్ కు మ‌రో షాక్‌..బాయ్ కాట్ చేసిన ఆస్ట్రేలియా..ఇక న‌ఖ్వీ బిచ్చ‌గాడు కావాల్సిందే

Related News

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్న పాకిస్తాన్ క్రికెట‌ర్లు..!

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

Big Stories

Advertisement
×