E-Paper
Advertisement

Historical Courtroom Drama OTT : 18 మిలియన్ల వ్యూస్ తో దుమ్మురేపిన కోర్టు రూమ్ డ్రామా… IMDbలో 8.2 రేటింగ్‌… కానీ థియేటర్లలో డిజాస్టర్

Historical Courtroom Drama  OTT : 18 మిలియన్ల వ్యూస్ తో దుమ్మురేపిన కోర్టు రూమ్ డ్రామా… IMDbలో 8.2 రేటింగ్‌… కానీ థియేటర్లలో డిజాస్టర్
Advertisement

Historical Courtroom Drama OTT : గత ఏడాది అక్షయ్ కుమార్, ఆర్. మాధవన్, అనన్య పాండే నటించిన “కేసరి: చాప్టర్ 2″(Kesari chapter 2) సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమా భారతదేశంలో దాదాపు ₹89 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా ₹138 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అయితే ఈ సినిమా ఓటీటీలో మాత్రం రికార్డ్ సృష్టిస్తోంది. ఓటీటీ ఆడియన్స్ దీనిని బాగా ఆదరించడంతో ఇది ఓటీటీలో రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతోంది. ఇది IMDbలో కూడా 10/ 8.2 అద్భుతమైన రేటింగ్‌ను పొందింది. మీరు ఇంకా సినిమా చూడకపోతే, ఈ వీకెండ్ ఓ లుక్ వేయండి.

జియో హాట్‌స్టార్‌లో రికార్డు వ్యూస్

‘కేసరి చాప్టర్ 2: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్‌వాలా బాగ్’ 2025లో విడుదలైన హిందీ సినిమా. జలియన్‌వాలా బాగ్ హత్యాకాండ తర్వాత బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ప్రముఖ న్యాయవాది సి. శంకరన్ నాయర్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ధర్మ ప్రొడక్షన్స్, లియో మీడియా కలెక్టివ్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ బ్యాన‌ర్స్‌పై నిర్మించిన ఈ సినిమాకు కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహించాడు. అక్షయ్ కుమార్, ఆర్. మాధవన్, అనన్య పాండే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2025 ఏప్రిల్ 3న విడుదల చేసి, సినిమాను ఏప్రిల్ 18న విడుదల చేశారు. ఆతరువాత జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కి వచ్చి అతిపెద్ద రికార్డు సృష్టించింది. “కేసరి చాప్టర్ 2” జియో హాట్‌స్టార్‌లో 18 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది ఇప్పుడు.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

1919లో జరిగిన జలియన్‌వాలా బాగ్ ఊచకోత నేపథ్యంగా ఈ సినిమా సాగుతుంది. లండన్‌లో చదువుకున్న ప్రముఖ న్యాయవాది సి. శంకరన్ నాయర్ (అక్షయ్ కుమార్) మొదట్లో బ్రిటిష్ న్యాయవ్యవస్థను బలంగా నమ్ముతారు. అయితే బైసాఖీ పండుగ నాడు అమాయక భారతీయులపై జనరల్ డయ్యర్ జరిపిన కాల్పుల ఘటన ఆయన మనసును పూర్తిగా మారుస్తుంది. ఈ దారుణాన్ని కప్పిపుచ్చేందుకు బ్రిటిష్ ప్రభుత్వం చేసే ప్రయత్నాలను గమనించిన శంకరన్ నాయర్, వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌కు రాజీనామా చేసి, బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా న్యాయపోరాటానికి సిద్ధమవుతారు.

ఈ పోరాటంలో న్యాయవాది దిల్‌రీత్ గిల్ (అనన్యా పాండే) శంకరన్ నాయర్‌కు అండగా నిలుస్తుంది. బ్రిటిష్ ప్రభుత్వం తరపున వాదించే లాయర్ నెవిల్ మెకిన్లీ (ఆర్. మాధవన్) ను ఎదుర్కోవడానికి నాయర్ తన తెలివితేటలను ఉపయోగిస్తారు. కోర్టులో జనరల్ డయ్యర్ క్రూరత్వాన్ని సాక్ష్యాలతో సహా నిరూపిస్తూ, ఈ కేసు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యేలా చేస్తారు. చరిత్ర మరుగున పడిపోయిన ఒక ధీరుడి కథను ఈ సినిమా కళ్ళకు కట్టినట్లు చూపించింది.

Advertisement

Read Also : మీనా థ్రిల్లర్ సిరీస్ పై హాట్ స్టార్ అఫిషియల్ అనౌన్స్మెంట్… లైన్లో ఇంకా 4 వెయిటింగ్

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×