E-Paper
Advertisement

వివాదంలో అంబానీ..ముంబై ఇండియ‌న్స్ కోచ్ గా మహ్మద్ అమీర్ ?

వివాదంలో అంబానీ..ముంబై ఇండియ‌న్స్ కోచ్ గా మహ్మద్ అమీర్ ?

Mohammed Amir:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు 40 శాతం మ్యాచ్ లు పూర్తి అయ్యాయి. మే చివరి వరకు ఈ టోర్నమెంట్ కొనసాగుతుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ గా పాకిస్తాన్ కు చెందిన మహమ్మద్ అమీర్ కు అంబానీ ఫ్యామిలీ అవకాశం ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు మహమ్మద్ అమీర్ ( Mohammed Amir) కూడా తనకు ఆఫర్ వచ్చినట్లు కుండబద్దలు కొట్టి చెప్పారు. దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయింది. దీనిపై ముంబై ఇండియన్స్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ దుర్మార్గులకు ఇండియాలో అవకాశం లేదని స్పష్టం చేస్తున్నారు. బీసీసీఐ రూల్స్ ప్రకారం వాళ్లను సెలెక్ట్ చేయకూడదని కోరుతున్నారు.

Also Read: Javed Miandad: ఫర్హాన్ దెబ్బ‌కు బుమ్రా కెరీర్ నాశ‌నం..పాకిస్తాన్ తో పెట్టుకుంటే తొక్కిప‌డేస్తాం Javed Miandad

ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ గా మహమ్మద్ అమీర్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ( Mumbai indians ) అత్యంత దారుణ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. బ్యాటింగ్ లో పరవాలేదనిపించినప్పటికీ, బౌలింగ్ లో మాత్రం తేలిపోతోంది. బుమ్రా కూడా ఆరు మ్యాచులు ఆడితే ఒకే ఒక్క వికెట్ పడగొట్టాడు. వరుసగా ఐదు మ్యాచ్ల్లో ఒక్క వికెట్ పడగొట్టకుండా చెత్త ప్రదర్శన ఘనపరిచాడు బుమ్రా. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ అమీర్ కు ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ అవకాశం వచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై మొహమ్మద్ అమీర్ కూడా రియాక్ట్ అయ్యాడు. ముంబై ఇండియన్స్ యాజమాన్యం నుంచి తనకు బంపర్ ఆఫర్ తగిలిందని చెప్పారు.

ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ గా అవకాశం ఇచ్చేందుకు యాజమాన్యం ముందుకు వచ్చిందని తెలిపారు. కానీ తాను ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్లు బాంబు పేల్చారు. ఇండియాలో సెక్యూరిటీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని.. తాను అక్కడ అడుగు పెడితే పెను ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. అందుకే సింపుల్ గా ముంబై ఇండియన్స్ నుంచి వచ్చిన ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్లు కుండబద్దలు కొట్టి చెప్పారు మహమ్మద్ అమీర్. ఐపీఎల్ లో ప్రాతినిధ్యం వహిస్తే తన భవిష్యత్తు ఎక్కడికో వెళ్తుంది.. కానీ అవకాశం చేజేతులా పోగొట్టుకున్నానని ఎమోషనల్ అయ్యారు మహమ్మద్ అమీర్. దీంతో మహమ్మద్ అమీర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కాగా మ‌హ్మ‌ద్ అమీర్ కు బ్రిటీష్ పౌర‌సౌత్వం ఉన్న నేప‌థ్యంలోనే ముంబై ఇండియ‌న్స్ ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్లు క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

Also Read: Inzamam Ul Haq: PSLలో హిందువుల‌కు నో ఛాన్స్‌..కోహ్లీ వ‌స్తే, మెడ‌లు ప‌ట్టి Inzamam Ul Haqబ‌య‌ట‌కు గెంటేస్తా

 

https://www.facebook.com/photo/?fbid=983906667883409&set=a.808612632079481

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×