E-Paper
Advertisement

రాష్ట్రంలో మేఘన పుడ్స్ అత్యుత్సాహం.. విచ్చల విడిగా కల్తీ దందా!

రాష్ట్రంలో మేఘన పుడ్స్ అత్యుత్సాహం.. విచ్చల విడిగా కల్తీ దందా!
Advertisement

Fake food: స్వేచ్ఛ బ్యూరో:హైదరాబాద్ నాచారంలోని మేఘన పుడ్ కేంద్రంపై పుడ్ సేప్టీ ప్లైయింగ్ స్వ్కాడ్ రెయిడ్స్ నిర్వహించింది. దీంతో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేంద్రంలో విజయ బ్రాండ్ తో పాలు, నెయ్యి అమ్మకాలు జరుగుతున్నట్లు పుడ్ సేప్టీ అధికారులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్ మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ ప్రాంచైజీగా చెప్పుకుంటూ అమ్మకాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి తెప్పించిన నెయ్యి, పాలను విజయ బ్రాండ్ పేరుతో చార్మినార్ చిరునామాతో విక్రయిస్తున్నట్లు తేల్చారు. అంతేగాక నాచారంలోని ఈ పుడ్ కేంద్రానికి ఎఫ్​ ఎస్ ఎస్ ఏఐ లైసెన్స్ కూడా లేదు. దీంతో అధికారులు సుమారు రూ.7,78,800 విలువైన 632 నెయ్యి ప్యాకెట్లు, 7208 పాల టెట్రా ప్యాక్స్‌ను సీజ్ చేశారు.

71 ప్రాంతాల్లో శాంపిల్స్ సేకరణ..

రాష్ట్ర ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ రాయుళ్లపై తెలంగాణ ఆహార భద్రత విభాగం మరోసారి కొరడా ఝళిపించింది. ఏప్రిల్ 16న రాష్ట్రవ్యాప్తంగా పాలు, నెయ్యి విక్రయ కేంద్రాలపై అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూడటంతో పాటు లక్షల రూపాయల విలువైన నకిలీ ఉత్పత్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 71 ప్రాంతాల్లో ఆహార భద్రత కమిషనర్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు తనిఖీలు చేపట్టాయి.

Advertisement

Also Read: Genelia : రాజమాత లాగా జెనీలియా.. చూడటానికి రెండు కళ్లు చాలట్లేదుగా..

లైసెన్సులు లేకుండా..

ఈ సందర్భంగా 37 ఎన్‌ఫోర్స్‌మెంట్ శాంపిల్స్, 54 సర్వైలెన్స్ శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు పంపారు. ప్రధానంగా జిల్లా కేంద్రాల్లో విచ్చలవిడిగా లూజు పాలు, నెయ్యి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఎటువంటి బ్రాండింగ్ లేకుండా, కనీస నాణ్యత పాటించని నెయ్యిని కొన్ని చోట్ల గుర్తించి అక్కడికక్కడే పారవేయించారు. లైసెన్సులు లేకుండా, నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ల్యాబ్ నివేదికలు రాగానే ఆహార భద్రత చట్టం 2006 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

​లూజుగా అమ్మే పాలు, నెయ్యిని కొనుగోలు చేయవద్దు: డాక్టర్ సంగీతా సత్యనారాయణ కమిషనర్, ఫ్యామిలీ వెల్ఫర్

Advertisement

​‘‘పాలు, నెయ్యి ప్యాకెట్లపై తప్పనిసరిగా ఎఫ్ఎస్ఎస్ఏఐ నంబర్ ఉందో లేదో తనిఖీ చేయాలి. ఏవైనా అనుమానాలు ఉంటే వెంటనే హెల్ప్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయాలి.​ప్రజలందరికీ సురక్షితమైన ఆహారాన్ని అందించే వరకు ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయి. రూల్స్ బ్రేక్ చేస్తే చట్టపరంగా శిక్షలు తప్పవు”అంటూ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ సంగీతా సత్యనారాయణ తెలిపారు.

Also Read: క్రాష్ టెస్ట్ లో దుమ్మురేపిన రెనాల్ట్ డస్టర్‌, ఎన్ని పాయింట్స్ సాధించిందంటే?

Related News

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

Big Stories

Advertisement
×