Ambati Rayudu On Jadeja Retirement: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య త్వరలో జరగబోతున్న వన్డే సిరీస్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. అయితే ఇందులో భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీతో పాటు రవీంద్ర జడేజాకు కూడా నిరాశ ఎదురైంది. సీనియర్లను పక్కకు పెట్టి, కేవలం జూనియర్లను మాత్రమే తీసుకుంది బీసీసీఐ. రవీంద్ర జడేజాకు వన్డేల్లో ఛాన్స్ రాకపోవడంపై టీమిండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
వెస్టిండీస్ తో జరిగిన వన్డే సిరీస్ రవీంద్ర జడేజాకు చివరిదని… అతని వన్డే కెరీర్ దాదాపు ముగిసినట్టేనని బాంబు పేల్చారు. 2027 వన్డే వరల్డ్ కప్ లో కూడా రవీంద్ర జడేజాను తీసుకోవడం కష్టమేనని, ఇది గ్రహించి రిటైర్మెంట్ ప్రకటిస్తే బెటర్ అని సూచనలు చేశారు. అలా కాకుండా 2027 వన్డే వరల్డ్ కప్ కోసం ఎదురుచూసి పరువు తీసుకోకూడదని కీలక వ్యాఖ్యలు చేశారు అంబటి రాయుడు. దీంతో రవీంద్ర జడేజా కెరీర్ పై అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు రవీంద్ర జడేజాను ఎంపిక చేయకపోవడంపై అంబటి రాయుడు కీలక అంశాలను వెల్లడించారు. వన్డే క్రికెట్ లో రవీంద్ర జడేజా మనుగడ కష్టమేనని తెలిపారు. రవీంద్ర జడేజాకు పోటీగా చాలా మంది క్రికెటర్లు జట్టులో ఉన్నారని వివరించారు. దానికి తోడు రవీంద్ర జడేజా ఏజ్ కూడా దాటిపోయిందని పేర్కొన్నారు. గతంలో టీమిండియాకు రవీంద్ర జడేజా ఎనలేని సేవలు అందించినప్పటికీ… యంగ్ క్రికెటర్ల నుంచి అతడికి పోటీ నెలకొంది అన్నారు.
అందుకే రవీంద్ర జడేజాను పక్కకు పెట్టినట్టు వివరించారు. అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబే, షహబాజ్ అహ్మద్ లాంటి వాళ్ల నుంచి రవీంద్ర జడేజాకు గట్టి పోటీ నెలకొందన్నారు. అందుకే వాళ్లనే రవీంద్ర జడేజాకు ప్రత్యామ్నాయంగా బీసీసీఐ చూస్తూ ఉందని వివరించారు. అందుకే ప్రతిసారి వాషింగ్టన్ సుందర్ తో పాటు అక్షర్ పటేల్ కు అవకాశాలు దక్కుతున్నాయని వెల్లడించారు. తాజాగా న్యూజిలాండ్ సిరీస్ కోసం ప్రకటించిన జట్టులోకి కొత్తగా నమన్ ధీర్ ను తీసుకువచ్చారని వివరించారు. అతడు స్పిన్నర్ గానే కాకుండా బ్యాటింగ్ చేస్తాడని నమ్మకాన్ని ఉంచి, రవీంద్ర జడేజాను పక్కకు పెట్టారని తెలిపారు. ఇది ఇలా ఉండగా… న్యూజిలాండ్ తో జరగబోతున్న వన్డే సిరీస్ నేపథ్యంలో మొదటి 3 మ్యాచ్ లకు గిల్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. చివరి రెండు వన్డేలకు శ్రేయస్ అయ్యర్ సారధిగా ఉండనున్నాడు.