Ambati Rayudu On Rohit Retirement: రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై రెండు రోజులుగా అనేక రకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. గంభీర్ బలవంతం చేసి మరి రోహిత్ శర్మతో రిటైర్మెంట్ ఇప్పిస్తున్నాడని రచ్చ రచ్చ చేశారు. అయితే దీనిపై స్వయంగా బీసీసీఐ పెద్దలు రంగంలోకి దిగి… క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. రోహిత్ శర్మ రిటర్మెంట్ కావడంలేదని చెప్పాల్సిన పరిస్థితి సోషల్ మీడియా తీసుకువచ్చింది. అయితే ఈ ఎపిసోడ్ పై టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu ) స్పందించారు. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ను వెధవలు చేసేందుకే రోహిత్ శర్మ ( Rohit Retirement ) ఈ స్కెచ్ వేశాడని షాకింగ్ కామెంట్స్ చేశారు. తన పిఆర్ స్టంట్ తో గంభీర్ ను ( Gautam Gambhir) విలన్ చేసి, రుజువు చేశాడని ఆరోపణలు చేశారు. రిటైర్మెంట్ లేదు బొక్క లేదు.. ఇదంతా నాటకమే అంటూ అంబటి రాయుడు కీలక వ్యాఖ్యలను చేశారు. దీంతో అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలకు రోహిత్ శర్మ ఫ్యాన్స్ కూడా కౌంటర్ ఇస్తున్నారు. రోహిత్ శర్మ ఎలాంటి కుట్రలు చేయలేదని పేర్కొంటున్నారు.
రోహిత్ శర్మ రిటైర్మెంట్ వ్యాఖ్యలపై టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా రోహిత్ శర్మ అత్యంత పేలవమైన ప్రదర్శన కనబరుస్తున్నారని వెల్లడించారు. దీంతో ఈ క్రమంలో రోహిత్ శర్మ పై నెగిటివ్ ప్రచారం ప్రారంభమైందని తెలిపారు. దాని నుంచి బయటపడేందుకు… అదే సమయంలో గంభీర్ ను విలన్ చేసేందుకు గాను రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలను తెరపైకి తీసుకువచ్చారని బాంబు పేల్చారు. ఇదంతా చేసింది రోహిత్ శర్మనే అంటూ ఆరోపణలు చేశారు. ఈ పిఆర్ స్టంట్ కోసం దేవేంద్ర పాండేను రోహిత్ శర్మ సంప్రదించాడని.. అందుకే రిటైర్మెంట్ వార్తలు బలంగా జనాల్లోకి వెళ్లాయని తెలిపారు.
ఈ క్రమంలో అభిమానులు అందరూ రోహిత్ శర్మ పై సింపతి చూపించారని తెలిపారు. ఈ చర్యలు నేపథ్యంలో రోహిత్ శర్మ పై యాక్షన్ తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు అంబటి రాయుడు. అదే సమయంలో వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ శర్మను కచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలిపారు. వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ ఉంటేనే టీమిండియా కు అద్భుతమైన విజయాలు అందుతాయి అన్నారు. దక్షిణాఫ్రికా గడ్డపై బౌన్సర్లు ఎదుర్కోవడం కేవలం రోహిత్ శర్మ వల్ల మాత్రమే అవుతుందన్నారు. రోహిత్ శర్మ అనుభవం టీమిండియా కు అవసరమని తెలిపారు.
Also Read: Hasan Ali in a pickpocketing case: పిక్ పాకెట్ కేసులో హసన్ అలీ..తోలు తీసిన ఇండియన్ పోలీసులు !