Hasan Ali in a pickpocketing case: పాకిస్తాన్ స్టార్ ఆటగాడు హాసన్ అలీ (Pak cricketer Hasan Ali) గురించి సోషల్ మీడియాలో దారుణమైన న్యూస్ వైరల్ గా మారింది. పిక్ ప్యాకెట్ కేసులో ( pick pocketing case) అడ్డంగా దొరికాడని… ఈ క్రమంలో హసన్ అలీని పోలీసులు చితకబాదినట్లు ఓ వీడియో వైరల్ గా మారింది. జమ్మూ కాశ్మీర్ సమీపంలో ఈ సంఘటన జరగగా.. హసన్ అలీనే దొంగ చాటున మన ఇండియన్ రైల్వే ఎక్కినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో పిక్ ప్యాకెట్ చేసి… పోలీసులకు దొరికాడట. దీంతో అతడిని పోలీసులు కొట్టినట్టు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు సంబంధించిన ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ (Hasan Ali in a pickpocketing case) ఇండియన్ రైల్వే పోలీసుల చేతిలో దెబ్బలు తింటున్న వీడియో ఫేక్ అని తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్ సమీపంలో రెగ్యులర్ గా వెళ్లే ఓ రైలులో అచ్చం హసన్ అలీ తరహాలోనే ఉన్న ఓ వ్యక్తి పిక్ ప్యాకెట్ కు పాల్పడి అడ్డంగా దొరికిపోయాడు. దీంతో రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు… అతడిని అదుపులోకి తీసుకున్నారు. ముందుగా రైలులోనే ఆ నిందితుడిని అత్యంత దారుణంగా కొట్టారు పోలీసులు. దీంతో హసన్ అలీ తరహా లోనే ఉన్న సదరు నిందితుడు పోలీసుల దెబ్బలకు తట్టుకోలేక తెగ అరిచాడు. అయినప్పటికీ పోలీసులు మాత్రం తగ్గలేదు. ఇంతలోనే ట్రైన్ లో ఉన్న మరో వ్యక్తి ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను క్యాప్చర్ చేశాడు.
ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే పిక్ ప్యాకెట్ కు పాల్పడిన సదరు వ్యక్తి పాకిస్తాన్ క్రికెటర్ హసన్ అలీ తరహా లో ఉన్న నేపథ్యంలో… అతడి ఫోటోలు పెట్టి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఇది చూసిన ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్… పాకిస్తాన్ క్రికెటర్ హసన్ అలీ పిక్ ప్యాకెట్ లో దొరికాడని.. వాడికి కొంచెం కూడా సిగ్గు లేదంటూ పోస్ట్ లు కూడా పెడుతున్నారు. పాకిస్తాన్ వెధవలకు కొంచెం బుద్ధి లేదని… ఇండియన్ రైల్వేలలో పిక్ ప్యాకెట్ చేయడానికి ఎంత ధైర్యం రా ? అంటూ పచ్చి బూతులు తిడుతూ కామెంట్లు పెడుతున్నారు. అయితే వాడు హసన్ అలీ కాదని… అతడి లాగా ఉన్న మరో వ్యక్తిని మరి కొంతమంది రియలైజ్ అవుతున్నారు.
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==