E-Paper
Advertisement

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు
Advertisement

Ms Dhoni Ruling Team India: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. 2007 సమయంలో టీమిండియా కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న మహేంద్రసింగ్ ధోని, దాదాపు పది సంవత్సరాల పాటు జట్టును లీడ్ చేశాడు. 2007 నుంచి 2017 వరకు టీమిండియా జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. ఈ క్రమంలో 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ 2013 ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్ గా ధోని చరిత్ర సృష్టించాడు. టీమిండియా తరఫునే కాదు ఐపీఎల్ లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఐదు ట్రోఫీలు అందించాడు. అయితే అలాంటి మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుతం టీమిండియాలో లేకపోవడంతో చాలామంది ప్లేయర్లకు అన్యాయం జరుగుతోందని చర్చ జరుగుతోంది.

Also Read: ICC unveils new formats for Men’s ODI and T20 World Cups:  వ‌ర‌ల్డ్ క‌ప్ 2027 ఫార్మాట్ వ‌చ్చేసింది..టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ‌ధ్య మూడు మ్యాచ్ లు

బీసీసీఐని కూడా వణికించిన మొన‌గాడు ధోనినే

Advertisement

మహేంద్రసింగ్ ధోని కెప్టెన్ గా ఉన్నప్పుడు హెడ్ కోచ్ , చీఫ్ సెలెక్టర్ల ప్రాధాన్యత ఏమాత్రం ఉండబోయేది కాదు. అటు బీసీసీఐ పెద్దలు కూడా టీమిండియా జట్టులో జోక్యం చేసుకోలేదు. మొత్తం టీం ఇండియాను రూల్ చేశాడు మహేంద్ర సింగ్ ధోని. 2007లోనే కెప్టెన్సీ ఇచ్చేటప్పుడు అనేక షరతులు పెట్టాడు. తనకు నచ్చిన జట్టును మాత్రమే ఆడిస్తానని… నచ్చకపోతే పక్కకు పెడతానని బీసీసీఐ పెద్దలకు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, వివిఎస్ లక్ష్మణ్, గంగూలీ, రాహుల్ ద్రావిడ్ లాంటి తోపు క్రికెటర్లను పక్కకు పెట్టాడు ధోని. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, సురేష్ రైనా లాంటి ఎంతోమంది క్రికెటర్ల జీవితాలను ధోని మార్చేశాడు. టీమిండియా సెలెక్టర్లు కాదని చెప్పినప్పటికీ, మహేంద్ర సింగ్ ధోని యంగ్ స్టార్లకు మాత్రమే అవకాశాలు ఇచ్చి… చరిత్ర సృష్టించాడు. ఎవరైనా ఆటగాడిని పక్కకు పెట్టాలంటే, బీసీసీఐ అలాగే చీఫ్ సెలెక్టర్, హెడ్ కోచ్ ఈ మధ్యకాలంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ ధోని సమయంలో ఇలా ఉండేది కాదు. ఏ ఒక్క ప్లేయర్ ను పక్కకు పెట్టాలన్నా , ధోని పర్మిషన్ ఉండాల్సిందే. ధోనికి నచ్చకపోతేనే పక్కకు పెడతారు. అలాగే ధోని రిటైర్మెంట్ సమయంలో కూడా అతన్ని ఎవరు బలవంత పెట్టలేదు. అతని తీసేయాలని ఎవరు ఫోర్స్ చేయలేదు. కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని బిసిసిఐ ప్రెషర్ పెట్టలేదు. పది సంవత్సరాలపాటు టీమిండియాను ఏలి… తానే రిటైర్మెంట్ ఇచ్చాడు. రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీపై ఒత్తిడి పెంచి బిసిసిఐ వాళ్లను పక్కకు పెట్టింది. కానీ ధోనీని బీసీసీఐ ఎన్నడూ కూడా టచ్ చేయలేదు.

Also Read: Pakistan Cricket Board Fine To Kavya Maran For NOC: కావ్య పాప‌కు షాక్ ఇచ్చిన పాకిస్తాన్‌..ఏకంగా రూ.21 ల‌క్ష‌లు క‌ట్టాల‌ని కండీష‌న్ !

గంభీర్ హయాంలో పరిస్థితి ఏంటంటే ?

Advertisement

గంభీర్ హెడ్ కోచ్ అయిన తర్వాత పరిస్థితులు చాలా దారుణంగా తయారయ్యాయి. టీమిండియాలో కెప్టెన్ ప్రాధాన్యత ఏమాత్రం లేదు. మొత్తం గౌతమ్ గంభీర్ నిర్ణయాలే ఫైనల్. అతడు నిల్చోమంటే నిలబడాలి.. పడుకోమంటే పడుకోవాల్సిందే. గౌతమ్ గంభీర్ అలాగే అజిత్ అగార్కర్ లకు నచ్చిన ప్లేయర్లే టీమిండియాలో ఉంటున్నారు. అటు గుడ్డిగా బీసీసీఐ కూడా వాళ్ళ మాట మాత్రమే వింటోంది. కెప్టెన్సీ ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోయింది. అందుకే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్లు రిటైర్మెంట్ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో మహేంద్ర సింగ్ ధోనీకి హెడ్ కోచ్ బాధ్యతలు ఇవ్వాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ధోని కెప్టెన్ అయితే టాలెంట్ ఉన్నవాళ్ళకు మాత్రమే అవకాశాలు వస్తాయని చెబుతున్నారు.

 

Related News

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

ఐపీఎల్ ఆడ‌టానికి సిగ్గుగా లేదా? ద‌క్షిణాఫ్రికా ప్లేయ‌ర్ల‌పై ఆండ్రీ నెల్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×