Anaya Bangar: టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ కోచ్ సంజయ్ బంగర్ కుమారుడు ఆర్యన్ బంగర్ {Anaya Bangar} గురించి తెలియని వారు ఉండరు. ఈ మధ్య ఈమె తరచూ వార్తల్లో నిలుస్తుంది. ఎందుకంటే గతంలో ఈమె సంజయ్ బంగర్ కొడుకుగా ఉండి.. ప్రస్తుతం కూతురిగా మారింది. ఆపరేషన్ చేయించుకుని మరీ లేడిగా మారింది. 24 ఏళ్ల ఆర్యన్.. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ తీసుకొని అమ్మాయిగా మారింది. ఇక అప్పటినుండి ఈమె సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
Also Read: Shikhar Dhawan: వాడి వల్లే… టీమిండియాలో నా కెరీర్ ముగిసింది.. ధావన్ ఎమోషనల్
ఆ తరువాత ఓ స్టార్ క్రికెటర్ బాగోతం బయటపెట్టింది. అనంతరం ఐసీసీ, బీసీసీఐలకు కీలక విజ్ఞప్తి చేసింది. బిసిసి, ఐసిసి ట్రాన్స్ జెండర్ అథ్లెట్లకు మద్దతు ఇవ్వాలని కోరింది. ట్రాన్స్ జెండర్ క్రికెటర్లను మహిళల క్రికెట్ లో ఆడేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా తాను మహిళల క్రికెట్ కి అర్హురాలినని వెల్లడించింది. కానీ ప్రస్తుత నిబంధనల ప్రకారం ట్రాన్స్జెండర్ క్రికెటర్లు మహిళల క్రికెట్ లో పాల్గొనడానికి అవకాశం లేదు.
వారిని క్రికెట్ లోకి అనుమతించేది లేదంటూ 2023 ఐసిసి వన్డే వరల్డ్ కప్ సమయంలో ఐసీసీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే.. అమ్మాయి నుండి అబ్బాయిగా మారినా.. ఇప్పుడు మరోసారి ఆపరేషన్ చేయించుకుంది అనయ బంగర్. తాజాగా ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ క్రమంలో బ్రెస్ట్ ఆంగ్మేటేషన్, ట్రాచెల్ షేవ్ శస్త్రచికిత్సలు చేయించుకుంది. ఈ శస్త్ర చికిత్సలు ఆమె లింగ నిర్ధారణ ప్రక్రియలో ముఖ్యమైన భాగాలు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ పూర్తయిన తర్వాత కొన్ని ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంది.
ట్రాన్స్ జెండర్ మహిళలు తమ శరీర లక్షణాలను స్త్రీగా మార్చుకోవడానికి బ్రెస్ట్ అంగ్మేంటేషన్ శస్త్ర చికిత్సను చేయించుకుంటారు. ఈ చికిత్సలో భాగంగా బ్రెస్ట్ లో ఇంప్లాంట్ లను అమర్చి.. వాటి పరిమాణంతో పాటు ఆకృతిని పెంచుతారు. దీనితో పాటు ట్రాచెల్ షేవ్ అనేది మెడలోని థైరాయిడ్ మృదులాస్తిని తగ్గించడానికి చేసే చికిత్స. ఈ క్రమంలో ఈ చికిత్సల గురించి, చికిత్స సందర్భంలో తన అనుభవాల గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకుంది అనయ బంగర్.
Also Read: Memes on BAN: ఇదేంది మామ.. 5 పరుగులు చేసేందుకు 7 ఔట్.. బంగ్లాదేశ్ అత్యంత చెత్త రికార్డు
ఈ చికిత్సల ద్వారా నా శరీరంతో మరింత సుఖంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. అలాగే చికిత్స అనంతరం షేర్ చేసిన ఫోటోలను ఉద్దేశించి.. ఈ ఫోటోలు ఎంతో ఆనందాన్ని, తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాయని వెల్లడించింది. అలాగే ఈ ఫోటోలు, ఈ ప్రయాణం ఇతర ట్రాన్స్ జెండర్ వ్యక్తులకు స్ఫూర్తిని ఇస్తాయని పేర్కొంది. అనయ ముంబై తరపున అండర్ – 16 లో యశస్వి జైస్వాల్ తో కలిసి క్రికెట్ కూడా ఆడింది. అలాగే సర్పరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్ వంటి స్టార్ ఆటగాళ్లతో కూడా ఆడింది. ఇప్పుడు ఆమె తన లింగాన్ని మార్చుకున్నప్పటికీ.. క్రికెట్ ఆడుతూ కనిపిస్తుంది.