Memes on BAN: సొంతగడ్డపై శ్రీలంక క్రికెట్ జట్టు దుమ్ము రేపుతుంది. రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్, మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్, మూడు మ్యాచ్ ల టీ-20 సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తోంది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ తో రెండు టెస్టుల సిరీస్ ని 1 – 0 తో కైవసం చేసుకున్న లంక.. ప్రస్తుతం బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ లో తలపడుతోంది. ఈ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా బుధవారం కొలంబో వేదికగా జరిగిన తొలి వన్డేలో శ్రీలంక అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
ఈ తొలి వన్డేలో శ్రీలంక 77 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్ లో శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక సూపర్ సెంచరీతో మెరిశాడు. మరోవైపు బంగ్లాదేశ్ ఐదు పరుగుల వ్యవధిలో ఏకంగా ఏడు వికెట్లు కోల్పోయి ఓ చెత్త రికార్డుని తన పేరిట లిఖించుకుంది. ఈ తొలి వన్డే లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.2 ఓవర్లలో 244 పరుగులు చేసి ఆల్ అవుట్ అయ్యింది. శ్రీలంక బ్యాటర్లలో అసలంక {106}, కుషాల్ మెండీస్ {45} పరుగులతో పరవాలేదనిపించారు.
ఇక బంగ్లాదేశ్ బౌలర్లలో టస్కిన్ అహ్మద్ 4, తన్జీమ్ హసన్ సాకీబ్ 3, తన్వీర్ ఇస్లామ్, నజ్మూల్ హుస్సేన్ షాంటో చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం 245 పరుగుల లక్ష్యాన్ని చేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లా బ్యాటర్లు తంజీద్ హసన్ {62}, జాకీర్ అలీ {51} పరుగులతో రాణించిన ఫలితం దక్కలేదు. శ్రీలంక బౌలర్లలో వానిందు హసరంగ 4, కామిందు మెండీస్ 3, అసితా ఫెర్నాండో, మహీష్ తీక్షణ చెరో వికెట్ తీశారు.
అయితే మొదట లక్ష్య చేదనలో బంగ్లాదేశ్ ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 100 పరుగులు చేసి పటిష్టంగా కనిపించింది. కానీ ఆ తర్వాత ఐదు పరుగుల వ్యవధిలోనే ఏకంగా ఏడు వికెట్లు కోల్పోయింది. నజ్ముల్ హుస్సేన్ షాంటో 23 పరుగుల వద్ద రన్ అవుట్ కాగా.. హాసరంగా వేసిన తరువాతి ఓవర్ లో లిటల్ దాస్ {0} పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత టౌహీడ్ హృదయ్ {1}, మెహ్దీ హాసన్ మిరాజ్ {0}, తంజీమ్ హాసన్ సకీబ్ {1}, టస్కిన్ అహ్మద్ {0} వరుసగా పెవిలియన్ కి క్యూ కట్టారు.
Also Read: Virat Kohli: వైట్ జెర్సీలో విరాట్ కోహ్లీ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్!
దీంతో బంగ్లాదేశ్ 5 పరుగుల వ్యవధిలోనే ఏడు వికెట్లు కోల్పోయింది. ఇలా వరుసగా వికెట్లు పడగొట్టి శ్రీలంక వరల్డ్ రికార్డు నమోదు చేసింది. అతి తక్కువ పరుగుల వ్యవధిలోనే అత్యధిక వికెట్లు తీసిన జట్టుగా నిలిచింది. ఈ జాబితాలో శ్రీలంకనే టాప్ లో ఉంది. ఈ తాజా రికార్డు తో 39 ఏళ్ల ఫీట్ ని అధిగమించి రెండవ స్థానాన్ని కూడా సొంతం చేసుకుంది శ్రీలంక. 2008లో జింబాబ్వే తో జరిగిన వన్డే మ్యాచ్ లో శ్రీలంక 3 పరుగుల వ్యవధిలోనే ఏకంగా ఏడు వికెట్లను పడగొట్టింది. ఇప్పుడు ఈ రికార్డుని శ్రీలంక తాజా మ్యాచ్ లో మరోసారి ఐదు పరుగుల వ్యవధిలోనే 7 వికెట్లు పడగొట్టి రెండవ స్థానంలో నిలిచింది.