Shikhar Dhawan: భారత క్రికెట్ అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న క్రికెటర్లలో టీమిండియా డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ {Shikhar Dhawan} ఒకరు. అభిమానులు ముద్దుగా “గబ్బర్” అని పిలుచుకునే శిఖర్ ధావన్.. తన తొలి ఆత్మకథ “ది వన్: క్రికెట్ మై లైఫ్, అండ్ మోర్” అనే పుస్తకాన్ని విడుదల చేశారు. హార్పర్ కాలిన్స్ ఇండియా ప్రచురించిన ఈ పుస్తకం 2025 జూన్ 26న అధికారికంగా విడుదలైంది. దీంతో ప్రస్తుతం ఈ పుస్తకంపైనే చర్చ జరుగుతుంది.
Also Read: Memes on BAN: ఇదేంది మామ.. 5 పరుగులు చేసేందుకు 7 ఔట్.. బంగ్లాదేశ్ అత్యంత చెత్త రికార్డు
ఈ పుస్తకంలో శిఖర్ ధావన్ క్రికెట్ కెరీర్ లోని ఎత్తుపల్లాలు, మానసిక పోరాటాలు, ఓటములు, విజయాలు, వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులను నిర్మొహమాటంగా వివరించారు. అయితే తన కెరీర్ త్వరగా ముగియడానికి కారణమైన ఆ ఆటగాడు ఎవరో తన ఆత్మకధ ప్రకటన సందర్భంగా ఓ ఆంగ్ల మీడియాతో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు గబ్బర్. తన కెరీర్ త్వరగా ముగియడానికి కారణమైన ఆ ఆటగాడు ఎవరో స్వయంగా వెల్లడించారు.
కెరీర్ ప్రారంభంలో శిఖర్ ధావన్ పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ 2013లో ధావన్ కెరీర్ లో కొత్త మలుపు వచ్చింది. తన టెస్ట్ అరంగేట్రం మ్యాచ్ లోనే ఆస్ట్రేలియాపై అద్భుతమైన సెంచరీ చేయడంతో ప్రపంచం అతడి ప్రతిభను గుర్తించింది. దీంతో అతడు చాలాకాలం భారత జట్టుకు ఓపెనింగ్ బ్యాటర్ గా వ్యవహరిస్తాడని అంతా భావించారు. కానీ కొంతకాలానికి అతడి కెరీర్ ముగిసింది.
ఇదే విషయాన్ని శిఖర్ ధావన్ వెల్లడిస్తూ.. ” నేను దేశవాలీ క్రికెట్ ను చాలా చక్కగా వినియోగించుకున్నా. నేను టెస్ట్ అరంగేట్రం చేయకముందే భారత్ తరపున అత్యధిక సెంచరీలు చేయాలని కలలు కనేవాడిని. నాకు ఆస్ట్రేలియా పై మంచి ఆరంభం దక్కింది. ఆ తర్వాత కూడా ఓపెనర్ గా 40 సగటుతో పరుగులు రాబట్టాను. కానీ ఇంగ్లాండ్ వంటి జట్టుపై సరిగ్గా ఆడలేక పోయాను. రెండుసార్లు ఇంగ్లాండ్ వెళ్లి అక్కడ కాస్త ఇబ్బంది పడ్డాను. నా కెరీర్ పై ఇప్పటికీ సంతోషంగానే ఉంది.
నా కెరీర్ లో చాలా హాఫ్ సెంచరీలు చేశాను. ఎక్కువగా సెంచరీలు చేయలేకపోయాను. కానీ 70 లు అధికంగా ఉన్నాయి. అలాంటి సందర్భంలో ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ చేశాడు. ఇక అప్పుడేనా అంతరాత్మ ఓ విషయం స్పష్టంగా చెప్పింది. ఇక నీ కెరీర్ ముగింపు దశకు చేరుకుందని నా ఇన్నర్ వాయిస్ వినిపించింది. ఆ సమయంలో నా స్నేహితులు, శ్రేయోభిలాషులు మద్దతుగా నిలవడం నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. జట్టులో స్థానం కోల్పోవడం అనేది క్రికెటర్ల కెరీర్ లో సహజం. ఇక నన్ను జట్టు నుంచి తొలగించినప్పుడు నేను ఎవరినీ కాంటాక్ట్ చేయలేదు” అని చెప్పుకొచ్చాడు శిఖర్ ధావన్.