Andre Nel On IPL : ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ (Indian Premier League tournament) చాలా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. 2008 సమయంలో ప్రారంభమైన ఈ మెగా టోర్నమెంట్ 19 సంవత్సరాలుగా ఎక్కడ బ్రేక్ లేకుండా ఇరగదీస్తోంది. దానికి తగ్గట్టుగానే వ్యూయర్షిప్ కూడా దుమ్ము లేపుతోంది. ఏమాత్రం బోర్ కొట్టకుండా మూడు నెలల పాటు ఈ టోర్నమెంట్ ఎంటర్టైన్మెంట్ క్రికెట్ అభిమానులకు అందిస్తోంది. అలాంటి ఐపీఎల్ టోర్నమెంట్ పై చాలా మంది విషప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.
లేటెస్ట్ గా దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ ఆండ్రీ నెల్ (Andre Nel ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దక్షిణాఫ్రికా క్రికెటర్లు మొత్తం ఐపిఎల్ పైన ఆధారపడిపోతున్నారని మండిపడ్డారు. దేశానికి ఒక్కడు కూడా సరిగ్గా రావడంలేదని… ఐపీఎల్ కు మాత్రం ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. అసలు ఐపిఎల్ ఆడడానికి దక్షిణాఫ్రికా క్రికెటర్లకు సిగ్గు లేదంటూ ఫైర్ అయ్యారు. జాతీయ జట్టుకు ప్రాధాన్యత ఇవ్వకుండా.. ప్రైవేట్ టోర్నమెంట్ అయిన ఐపీఎల్ లో ఆడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ ఆండ్రీ నెల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఎక్కువ సంఖ్యలో ఆడతారన్న సంగతి తెలిసిందే. గిబ్స్ కాలం నాటి ప్లేయర్ల నుంచి మొదలుకొని, ప్రస్తుత కగిసో రబాడా లాంటి ప్లేయర్ల వరకు అందరూ ఐపిఎల్ లో ఆడుతున్న వాళ్లే. ఇందులో కొంతమంది రిటైర్మెంట్ ఇస్తే… మరి కొంతమంది రెగ్యులర్ గా ఐపిఎల్ ఆడుతున్నారు. దానికి తగ్గట్టుగానే డబ్బులు కూడా బాగానే సంపాదిస్తున్నారు.
అయితే దీనిపైనే దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ నెల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు డబ్బులకు మరిగారని ఆగ్రహించారు. దక్షిణాఫ్రికా జట్టుకు ఆడకుండా… చాలామంది ఐపిఎల్ కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. జాతీయ జట్టుకు ఆడాల్సింది పోగా… డబ్బులు వచ్చే దగ్గరికి మాత్రమే వెళుతున్నారన్నారు. దీనివల్ల క్రికెట్ కనుమరుగు అవుతుందని హెచ్చరించారు. ఇకనైనా ఐపిఎల్ తగ్గించి జాతీయ జట్టుకు ఆడాలని కోరారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ఒక్కటే కాకుండా.. సౌత్ ఆఫ్రికా T20 లీగ్, మేజర్ క్రికెట్ లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్, కరేబియన్, ఇటు శ్రీలంక అన్ని దేశాల్లోనూ ఫ్రాంచైజీ లీగ్స్ ఎక్కువగా అయిపోయాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనివల్ల క్రికెటర్ల మధ్య స్నేహపూర్వక బంధం పెరుగుతోందని పాజిటివ్ కామెంట్స్ కూడా చేశారు. నెల్.
https://www.facebook.com/watch/?v=1919487428878143