E-Paper
Advertisement

ఫ్లాట్ పిచ్ లు ఉండ‌వు.. 2027 వరల్డ్ కప్ తొలి రౌండ్ కే టీమిండియా ఎలిమినేట్

ఫ్లాట్ పిచ్ లు ఉండ‌వు.. 2027 వరల్డ్ కప్ తొలి రౌండ్ కే టీమిండియా ఎలిమినేట్
Advertisement

Michael Atherton On Team India: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య వన్డే సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్త పెను సంచలనం సృష్టిస్తోంది. నిజంగానే గంభీర్ ఒత్తిడి మేరకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తే మాత్రం… టీమిండియాను కాపాడడం ఎవరి తరం కాదంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. మొదట రోహిత్ శర్మను పంపించి ఆ తర్వాత విరాట్ కోహ్లీని కూడా గెంటేయడమే గంభీర్ ప్లానని అంటున్నారు. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ బయటకు వెళ్తే 2027 వన్డే వరల్డ్ కప్ టీమ్ ఇండియా గెలవడం కష్టమేనని చర్చకు కూడా మొదలైంది. ఈ క్రమంలో మాజీ క్రికెటర్ మైక్ ఆథర్టన్ (Michael Atherton) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2027 వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా గెలవడం కష్టమేనని.. గ్రూప్ స్టేజిలో ఎలిమినేట్ అవుతుందని హెచ్చరించారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Pakistan Cricket Board Fine To Kavya Maran For NOC: కావ్య పాప‌కు షాక్ ఇచ్చిన పాకిస్తాన్‌..ఏకంగా రూ.21 ల‌క్ష‌లు క‌ట్టాల‌ని కండీష‌న్ !

2027 వరల్డ్ కప్ తొలి రౌండ్ కే టీమిండియా ఎలిమినేట్

Advertisement

2027 వన్డే వరల్డ్ కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో టీమిండియా జట్టును ఉద్దేశించి ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైక్ ఆథర్టన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వచ్చే వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా ఫేవరెట్ జట్టుగా ఉండబోదని బాంబు పేల్చారు. గతంలో ఉన్న చాలా బలంగా ఉన్న టీమిండియా… ఇప్పుడు చాలా వీక్ గా మారిపోయింది అన్నారు. దక్షిణాఫ్రికా గడ్డపైన వన్డే వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో… టీమ్ ఇండియా చిత్తు కావడం గ్యారెంటీ అని హెచ్చరించారు. అక్కడి బౌన్స్ పిచ్ లకు టీమిండియా క్రికెటర్లు తట్టుకోవడం కష్టమేనని వార్నింగ్ ఇచ్చారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ సందర్భంగా హైవే లాంటి మైదానాలకు టీమిండియా క్రికెటర్లు అలవాటు పడ్డారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మొన్న టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ కూడా ఇండియాలో జరగడంతో… ఫ్లాట్ మైదానాలను టీమిండియా కోసం ఐసీసీ ఏర్పాటు చేసిందని ఆరోపణలు చేశారు.

Also Read: ICC unveils new formats for Men’s ODI and T20 World Cups:  వ‌ర‌ల్డ్ క‌ప్ 2027 ఫార్మాట్ వ‌చ్చేసింది..టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ‌ధ్య మూడు మ్యాచ్ లు

Advertisement

ఈ క్రమంలోనే టీమ్ ఇండియా టైటిల్ కూడా గెలిచిందన్నారు. కానీ 2027 వన్డే వరల్డ్ కప్ లో మ్యాచ్ లు దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతాయని.. దీనివల్ల టీమిండియా గ్రూప్ స్టేజిలో ఎలిమినేట్ కావడం గ్యారెంటీ అని హెచ్చరించారు. అలా జరగకపోతే తాను క్రికెట్ గురించి అస్సలు మాట్లాడబోరని సంచలన ప్రకటన చేశారు మైక్ ఆథర్టన్. 2027 వన్డే వరల్డ్ కప్ కంటే ముందు, ఐపిఎల్ 2027 టోర్నమెంట్ కూడా వస్తుందని.. అప్పుడు కూడా టీమిండియా క్రికెటర్లు మళ్లీ హైవే లాంటి మైదానాలలో ఆడడానికి అలవాటు పడతారన్నారు. దాదాపు మూడు నెలల పాటు ఆ హైవే పిచ్ లపై ఆడి.. 2027 వన్డే వరల్డ్ కప్ కోసం సిద్ధమవుతారని తెలిపారు. దీనివల్ల టీమిండియా చిత్తుగా ఓడి ఇంటి దారి పడుతుందని హెచ్చరించారు. అందుకే 2027 వన్డే వరల్డ్ కప్ లో ఫేవరెట్ జట్టుగా టీమిండియా ఉండబోతున్నారు మైక్ ఆథర్టన్.

 

 

Related News

ఐపీఎల్ ఆడ‌టానికి సిగ్గుగా లేదా? ద‌క్షిణాఫ్రికా ప్లేయ‌ర్ల‌పై ఆండ్రీ నెల్ సీరియ‌స్‌

రోహిత్ శ‌ర్మ రిటైర్మెంట్ ఇస్తే, టీమిండియాను కుక్క కూడా ప‌ట్టించుకోదు

రిటైర్మెంట్ ఇవ్వాలంటూ రోహిత్ శర్మపై ఒత్తిడి.. గంభీర్ కుట్రలకు చెక్ పెట్టిన అంబానీ?

రోహిత్ శ‌ర్మను కాదు, ముందు గంభీర్ ను మెడ‌లు ప‌ట్టుకుని గెంటేయండి

2009లో మేం ఓడించాం, 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లోనూ చిత్తుగా టీమిండియా ఓడించాలి

డ్ర‌గ్స్ క‌ల‌క‌లం..పాకిస్తాన్ కు అమ్ముడుపోయిన జై షా…ఆ ప్లేయ‌ర్ కు శిక్ష త‌గ్గింపు?

జో రూట్ పెద్ద ఫులిష్ గాడు..99 ప‌రుగుల వ‌ద్ద నేనుంటే, సెంచ‌రీ చేసుకునేవాడు

Big Stories

Advertisement
×