E-Paper
Advertisement

Babar Azam: అంపైర్ల‌తో గొడ‌వ‌కు దిగిన బాబ‌ర్ ఆజం..బ్యాన్ వేసేందుకు PCB రంగం సిద్ధం

Babar Azam: అంపైర్ల‌తో గొడ‌వ‌కు దిగిన బాబ‌ర్ ఆజం..బ్యాన్ వేసేందుకు PCB రంగం సిద్ధం
Advertisement

Babar Azam:  పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026) చాలా రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో కూడా సగానికి పైగా మ్యాచులు పూర్తయ్యాయి. అయితే నిన్న లాహోర్ లోని గడాఫీ వేదికగా ( Gaddafi Stadium, Lahore) మరో కీలక మ్యాచ్ జరిగింది. లాహోర్ ఖలందర్స్ vs పెషావర్ జల్మీ ( Lahore Qalandars vs Peshawar Zalmi) జట్ల మధ్య మ్యాచ్ జరగగా, బాబర్ ఆజం ( Babar Azam ) సేన ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా బాబర్ ఆజం వర్సెస్ అంపైర్ల ( Umpires) మధ్య గొడవ జరిగింది. పదే పదే బంతులు మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు బాబర్ ఆజం.

Also Read: Lungi Ngidi injury: కేవ‌లం 11 నిమిషాలే, ఇండియా తడాఖా ఏంటో చూపించిన‌ ఢిల్లీ పోలీసులు, గ్రీన్ కారిడార్ వేసి మరీ

అంపైర్ల‌తో గొడ‌వ‌కు దిగిన బాబ‌ర్ ఆజం

Advertisement

బంతులు మార్చడం వ‌ల్ల త‌మ బౌల‌ర్లు చాలా ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంద‌ని ఆవేశానికి లోనైయ్యాడు. దీంతో అంపైర్ల ద‌గ్గ‌ర‌కు వెళ్లి.. ఇదెక్క‌డి న్యాయం అంటూ చిందులు వేశాడు బాబ‌ర్. అయితే, బాబర్ ఆజం అంత‌లా అరిచినా అంపైర్లు మాత్రం ప‌ట్టించుకోలేదు. ఆట‌గాళ్ల వ‌ల్ల బంతులు పాడైపోతున్నాయ‌ని, అందుకే మార్చాల్సి వ‌స్తోంద‌ని క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు అంపైర్లు. మీ చేత‌కాని త‌నం వ‌ల్లే, బంతులు పాడైపోతున్నాయ‌ని అంపైర్లపై బాబ‌ర్ ఆజం రివ‌ర్స్ ఎటాక్ చేశాడు. దీంతో గొడ‌వ కాస్త పెద్ద‌ది అయింది. అయితే, చివ‌ర‌కు త‌న తోటి ప్లేయ‌ర్లు స‌ముదాయించ‌డంతో గొడ‌వ స‌ద్దుమ‌ణిగింది. ఈ క్రమంలో లాహోర్ ఖలందర్స్ కెప్టెన్‌ బాబ‌ర్ ఆజం పై పీసీబీ బ్యాన్ విధిస్తుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. రూల్స్ ప్ర‌కారం, అంపైర్ల‌తో గొడ‌వ పెట్టుకోవ‌డం త‌ప్పు కాబ‌ట్టి, బాబర్ పై క‌చ్చితంగా యాక్ష‌న్ తీసుకోనున్నార‌ట‌. అయితే, ఫైన్ వేస్తారా ? లేక మ్యాచ్ ఆడ‌కుండా చేస్తారా ? అనేది చూడాలి.

పెషావర్ జల్మీ పై ఆరు వికెట్ల తేడాతో లాహోర్ ఖలందర్స్ విజయం

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా లాహోర్ ఖలందర్స్ vs పెషావర్ జల్మీ బిగ్ ఫైట్ జరిగింది. గుడ్ ఆఫ్టర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో లాహోర్ విక్టరీ అందుకుంది. ఈ మ్యాచ్ లో పెషావర్ జల్మీ మొదట బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 20 ఓవర్లు ఆడి నాలుగు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ ఆజం 45 బంతుల్లో 59 పరుగులు చేయగా, మిచెల్ బ్రేస్ వెల్ 83 పరుగులతో రాణించాడు. దీంతో ఆ మాత్రం స్కోరు చేయగలిగింది పెషావర్ జల్మీ. అయితే ఈ లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో లాహోర్ ఖలందర్స్ చేదించగలిగింది. ఈ క్రమంలో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయింది. లాహోర్ ఖలందర్స్ ఓపెనర్ ఫఖ‌ర్ జమాన్ 58 పరుగులతో రాణించగా మిగిలిన ప్లేయర్లు కూడా అదరగొట్టారు. దీంతో అవ‌లీల‌గా విక్టరీ అందుతుంది.

Advertisement

Also Read: Inzamam-ul-Haq : నా కొడుకు కాలి గోటికి కూడా వైభ‌వ్ స‌రిపోడు..ఐపీఎల్ లో ఛాన్స్ ఇచ్చి చూడండి, తడాఖా చూపిస్తాడు

Related News

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

రీ-ఎంట్రీపై ప‌గ‌టి క‌ల‌లు వ‌ద్దు..ఇక‌ రిటైర్మెంట్ ఇచ్చేసి, స‌న్యాసం తీసుకో !

SRH ఇక నీదే అల్లుడు…క‌ట్నంగా కింద క‌ట్ట‌బెట్టిన కావ్య పాప ఫ్యామిలీ ?

ఉగ్రవాదుల టెన్షన్..21 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌లో అడుగుపెట్టిన ఇంగ్లాండ్

Big Stories

Advertisement
×